మామిడి

ఆకు ముడుత ముక్కు పురుగు

Apoderus tranquebaricus

కీటకం

క్లుప్తంగా

  • చివరి ఆకులు మెలితిరగడం, చుట్టబెట్టుకుపోవడం మరియు ఎండిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

ఈ తెగులుకు చెట్లు ప్రభావితమైనప్పుడు, ఆకు కొనల నుండి మెలితిరగడం మొదలవుతుంది. ఆకులు చుట్టుకుపోయి కనిపిస్తాయి. పెద్ద ముక్కు పురుగుల కారణంగా ఆకులు మెలితిరగడం జరుగుతుంది. ముక్కు పురుగు మామిడి ఆకులను కత్తిరించి ఆకులను వ్రేళ్ళ లాంటి ఆకృతిలోకి మారుస్తుంది. ఇలా చుట్టబడిన ఆకులు ప్రధాన ఆకులకు అనుసంధానించబడి ఉంటాయి. ఇలా చుట్టబడిన ఆకులలోపల ముక్కు పురుగు యొక్క పిల్ల పురుగు ఆకు యొక్క కణజాలాన్ని తింటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇది మామిడి పంటలో ఒక చిన్న తెగులు. దెబ్బతిన్న ఆకులను చేతులతో తొలగించడం ఉత్తమమైన పద్ధతి.

రసాయన నియంత్రణ

జీవ/పర్యావరణ అనుకూల చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. వీటి జనాభా తక్కువగా ఉంటే అది మీ చెట్టుకు గణనీయమైన నష్టాన్ని కలిగించదు. వీటి జనాభా అధికంగా ఉంటే మోనోక్రోటోఫాస్ మరియు ఎండోసల్ఫాన్ వంటి పురుగుమందులు నష్టాన్ని తగ్గించగలవు.

దీనికి కారణమేమిటి?

మామిడి ఆకు ట్విస్టింగ్ వీవిల్ అనే తెగులు వల్ల మామిడి చెట్లకు నష్టం జరుగుతుంది. ఈ పురుగు నర్సరీ మరియు ప్రధాన పొలం రెండింటిలోనూ ఉంటుంది. ఇది జామూన్, ఉసిరి, పనస, జీడి, టేకు, జామ మరియు వేప వంటి ఇతర మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇటీవల, ఇది 2023వ సంవత్సరంలో బాదం చెట్లపై కూడా గమనించబడింది. దీని జీవిత చక్రం వివిధ దశలను కలిగి ఉంటుంది: గుడ్లు, గ్రబ్ దశలో ఐదు లార్వా రూపాలు, ప్యూపా మరియు పూర్తిగా ఎదిగిన దశ. ఆడ పురుగు వంకర్లు తిరిగివున్న ఆకుల బయటి భాగంలో ఒక్కొక్కటిగా గుడ్లు పెడుతుంది. ఆడ పురుగు ఒక జిగట పదార్థాన్ని స్రవిస్తుంది, ఇది గుడ్లు ఆకు ఉపరితలంపై అంటుకునేలా చేస్తుంది. గుడ్లు మెరిసే పసుపు రంగును కలిగి ఉంటాయి. దీని యొక్క చిన్న మరియు అపరిపక్వ రూపం అయిన గ్రబ్ పసుపు రంగులో ఉంటుంది. ఇది చుట్టబడివున్న ఆకుల లోపల కణజాలాన్ని తింటుంది. దీని వలన ప్రభావితమైన ఆకులకు నష్టం కలుగుతుంది. పెద్ద ముక్కు పురుగు ఎర్రటి గోధుమ రంగులో ఉండి పొడవైన ముక్కును కలిగి ఉంటుంది. ఇది మామిడి ఆకులను కత్తిరించి మడతపెడుతుంది. ఇలా చుట్టబడిన ఆకులు ప్రధాన ఆకులకు జోడించబడి ఉంటాయి. వెచ్చని ఉష్ణోగ్రతలు, ఎక్కువ వర్షం మరియు అధిక తేమ లాంటి వాతావరణ పరిస్థితుల్లో మామిడి చెట్ల ఆకులను మెలితిప్పే పురుగులు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాల కోసం చెట్లను గమనిస్తూ ఉండండి.
  • దెబ్బతిన్న ఆకులను చేతితో తొలగించండి.
  • లోపల క్రిముల కోసం వెతికి వాటిని నలిపివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి