కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కాయ పురుగు

Riptortus pedestris

కీటకం

క్లుప్తంగా

  • మధ్యస్థ సైజు గోధుమ రంగు సుడి దోమ.
  • పచ్చి ధాన్యం రాలిపోతాయి.
  • నల్ల మచ్చలు మరియు లోపల ముడుచుకున్న గింజలతో పేలవంగా నిండిన ధాన్యం.


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

కాయల చుట్టూ కీటకాలు గుంపులుగా కనిపిస్తాయి. అవి గోధుమ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చిన్న కీటకాలు మరియు పెద్ద కీటకాలు పచ్చి కాయల నుండి పండని గింజల రసాన్ని పీలుస్తాయి. తెగులు సోకిన కాయలు ముడుచుకుపోతాయి మరియు చిన్న గింజలతో పసుపు రంగు మచ్చలు మరియు ఇవి తిన్న గోధుమ రంగు మచ్చలను చూపుతాయి. తెగులు తీవ్రంగా ఉంటే, మొక్క యొక్క లేత భాగాలు ముడుచుకుపోయి చివరికి ఎండిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

జనాభాను తగ్గించడానికి నీరు మరియు నూనెతో కూడిన పాత్రలో ఈ కీటకాలను సేకరించవచ్చు. చిన్న పరిమాణంలోని పొలాల్లో పుష్పించే మరియు కాయ ఏర్పడే సమయంలో కీటకాలను చేతితో సేకరించి చంపవచ్చు. నల్ల సబ్బు మరియు కిరోసిన్ మిశ్రమాన్ని వర్తించండి: 150 మి.లీ నీటిలో 170 గ్రాముల నల్ల సబ్బును కరిగించండి. సబ్బు/కిరోసిన్ మిశ్రమం యొక్క మందపాటి గాఢతను ఏర్పరచడానికి దీనిని 1 లీటర్ కిరోసిన్‌లో కరిగించండి. 400 మి.లీ మిశ్రమాన్ని 5 లీటర్ల నీటిలో కరిగించండి. కాయలు వృద్ధి చెందిన తర్వాత వారానికొకసారి పిచికారీ చేయాలి.

రసాయన నియంత్రణ

డైమిథోయేట్, మిథైల్ డెమెటాన్, ఇమిడాక్లోప్రిడ్ లేదా థియామెథాక్సమ్ వీటిపై సమర్ధవంతంగా పనిచేసే క్రిమిసంహారకాలు.

దీనికి కారణమేమిటి?

ఎండ కాసే రోజులు మరియు తేమ అధికంగా ఉన్న రోజులు కాయ పురుగుకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం తర్వాత మీరు ఈ పురుగుల ముట్టడిని చూడవచ్చు. ఇవి పొడవాటి కాళ్ళతో గోధుమ నలుపు రంగులో మరియు పొడవైన సన్నని రూపం కలిగి ఉంటాయి. చిన్న పురుగులు సున్నితంగా, క్రీమ్ పసుపు రంగులో ఉంటాయి మరియు తరువాత ఆకుపచ్చ-గోధుమ రంగులోకి మారుతాయి. తరువాత ముదురు గోధుమ చీమలను పోలి ఉండటం ప్రారంభిస్తాయి. పెద్ద పురుగులు గోధుమ రంగులో, సన్నగా ఉండి వెనువేగంగా ఎగురుతూ జంప్ చేస్తూ ఉంటాయి.


నివారణా చర్యలు

  • వ్యాధి నిరోధక విత్తన రకాలను సాగు చేయండి.
  • వీటి తీవ్రత అధికంగా వుండే కాలాన్ని నివారించడానికి ముందుగానే నాటండి.
  • జనాభాను తగ్గించడానికి జొన్న లేదా పెసలును అంతరపంటగా సాగు చేయండి.
  • మొక్కజొన్నను అంతర పంటగా వేయకూడదు.
  • నాటిన ఒక నెల తర్వాత మొక్కలను గమనించండి.
  • ముఖ్యంగా ఈ కీటకాలు చురుకుగా వుండే ఉదయం వేళల్లో పంటను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
  • పంట శిధిలాలలో కీటకాలు మనుగడ సాగించకుండా నిరోధించడానికి పాత మొక్కల కాండాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి