కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

కుడ్జు నల్లి

Megacopta cribraria

కీటకం

క్లుప్తంగా

  • చిన్న, అండాకారపు, లేత గోధుమ రంగు నల్లులు.
  • ఆకులు ఎండిపోతాయి.
  • కాయలు అసాధారణంగా వృద్ధిచెందుతాయి.


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

మీరు నల్లని మచ్చలతో చిన్న, అండాకారపు, లేత గోధుమరంగు కీటకాలను చూస్తారు. కాండం మీద వీటి సమూహాలను చెక్ చేయండి. మొక్క యొక్క కాండం పైన ఇవి సమూహాలుగా ఏర్పడి బాగా ఎక్కువగా తింటాయి. కాయలు క్రమరహితంగా పెరగడం మరియు ఆకులపై నిర్జీవ మచ్చల కోసం చెక్ చేయండి. కాయలు సరిగ్గా పెరగవు మరియు గింజలు చిన్నవిగా మరియు తేలికగా ఉంటాయి, ఒక్కో కాయలో విత్తనాలు తక్కువగా ఉంటాయి. పురుగులు మొక్కల నుండి పోషకాలను పీల్చుకుంటాయి: ఆకులు మరియు కాండం నుండి ఎండిపోయేలా చేస్తాయి. మొక్కలపై ముదురు, నిర్జీవమైన భాగాలు పురుగులు ఎక్కడ రంధ్రాలు చేసి మొక్క యొక్క పోషకాలను పీల్చుకుంటున్నాయో చూపుతాయి. పెద్ద పురుగులు కాండంపై తింటాయి. చిన్న పురుగులు ఆకు ఈనెలను తింటాయి. వాటిని చెదరగొట్టినప్పుడు లేదా నలిపివేసినప్పుడు అవి విడుదల చేసే వాసనను గమనించండి. కుడ్జు పురుగులు ఆకులపై జిగటగా ఉండే చక్కెర లాంటి ద్రవాన్ని విసర్జిస్తాయి. ఇది ఆకులపై నల్లని పూతను ఏర్పరిచే, సూర్యరశ్మిని అడ్డుకుని మరియు కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగించే ఒక రకమైన ఫంగస్‌ కి ఇది ఆహారంగా పనిచేస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బ్యూవేరియా బస్సియానా అనేది కుడ్జు కీటకాలకి సంక్రమించి ఈ తెగులును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా సంభవిస్తుందో లేదో చెక్ చేయండి: ఇవి సోకిన గోధుమరంగు కుడ్జు కీటకాలు తెల్లగా, నురుగుతో కూడిన శిలీంధ్ర పూతను కలిగి ఉంటాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పెద్ద పురుగులపై పిచికారీ చేయకండి ఎందుకంటే ఇది వాటిపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు: చిన్న పురుగుల pai మాత్రమే పిచికారీ చేయండి. మీరు సీజన్‌లో ఒక మొక్కపై 5 పెద్ద లేదా అంతకన్నా ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయండి. పెద్ద పురుగులు స్థిరపడనివ్వండి మరియు చిన్న పురుగులు గుడ్ల నుండి బయటకు వచ్చినప్పుడు పిచికారీ చేయండి. పైరెథ్రాయిడ్స్ (β-సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్, సుమిసిడిన్) మరియు ఆర్గానోఫాస్ఫేట్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇమిడాక్లోప్రిడ్ కూడా తెగులును తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. కాయ ఏర్పడే సమయంలో సిఫార్సు చేయబడిన పిచికారీ వీటి జనాభాను నియంత్రించగలదు మరియు ఆ తరువాత కాలంలో పురుగుమందుల పిచికారీ వాడకాన్ని తగ్గిస్తుంది. వీటి జనాభాను తగ్గించడానికి ఒక ప్రయోజనకరమైన బ్యూవేరియా బస్సియానా అనే శిలీంద్రం పని చేస్తుంది కాబట్టి పిచికారీ చేసే ముందు జాగ్రత్త వహించండి. మీ సమయం మరియు డబ్బు ఆదా చేస్తుంది!

దీనికి కారణమేమిటి?

ఈ పురుగులు శీతాకాలం ఆకు చెత్తలో లేదా చెట్ల బెరడు కింద గడుపుతాయి. ఆడ పురుగులు ఆకు దిగువ భాగంలో పొడవుగా వుండే గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుండి పొదగబడే పురుగులు పెద్ద పురుగుల మాదిరిగానే శరీర ఆకృతిని కలిగి ఉంటాయి. అవి పొలం అంచుల వద్ద మొదలై లోపలికి వ్యాపిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రతలు మరియు తగ్గుతున్న పగటి నిడివి సమయంలో మరియు శీతాకాలంలో అవి లోపల దాక్కుని కాలం గడుపుతాయి మరియు ఆ తరువాత వచ్చే వేసవిలో వెచ్చని ఉష్ణోగ్రతలలో పంటలలో కొత్త జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి.
  • ఈ నల్లులు తెల్లటి ఉపరితలాలకు ఆకర్షితులవుతాయి: పెద్ద కుడ్జ్ నల్లులను ఆకర్షించడానికి మరియు సంగ్రహించడానికి తెలుపు లేదా పసుపు రంగు జిగురు అట్టలను ఉపయోగించండి.
  • పంట కోత తర్వాత మీ పొలం నుండి పంట అవశేషాలను తొలగించండి.
  • ఉచ్చు పంటగా పొలం సరిహద్దులలో ముందస్తు-సీజన్ సోయాబీన్‌ పంటను నాటండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి