Coreidae
కీటకం
వృద్ధి దశ మరియు ప్రభావితమయ్యే మొక్కల రకాన్ని బట్టి లీఫ్ ఫుట్ నల్లుల జాతులు పంటల్లో అనేక రకాల లక్షణాలను కలిగిస్తాయి. పంటల్లో లీఫ్ ఫుట్ నల్లుల యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. లీఫ్ ఫుట్ నల్లులు మొక్కలలో, ముఖ్యంగా ఇంకా వృద్ధి చెందుతున్న చిన్న మొక్కల పెరుగుదల మందగించేటట్టు చేస్తాయి. దీనివల్ల తక్కువ దిగుబడి రావడం లేదా పంట ఆలస్యం కావడం జరగవచ్చు. ఈ నల్లులు కాయ రంగు మారడం మరియు వైకల్యం చెందడం వంటి లక్షణాలను కలిగిస్తాయి. ప్రభావితమైన కాయలు రంగు మారవచ్చు, ఆకారం మారవచ్చు లేదా కాయల ఉపరితలంపై చిన్న చిన్న నొక్కుకుపోయినట్టు ఉన్న ప్రాంతాలు ఏర్పడవచ్చు. ఈ కనిపించే నష్టాల కారణంగా కాయల మార్కెటింగ్ అవకాశాలు తగ్గుతాయి. లీఫ్ ఫుట్ నల్లులు మొక్కల ఆకులు మరియు కాండాలకు హాని కలిగిస్తాయి. దీని కారణంగా ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా గోధుమ రంగులోకి మారడం, వడలిపోవడం మరియు మొక్క చనిపోవడం జరుగుతుంది. అదనంగా, లీఫ్ ఫుట్ నల్లుల యొక్క కొన్ని జాతులు మొక్కల వ్యాధులను ఇతర మొక్కలకు సంక్రమింప చేయగలవు, ఇది పంటలను మరింత దెబ్బతీస్తుంది మరియు దిగుబడిని తగ్గిస్తుంది.
క్రిమి సంహారక సబ్బు లేదా వేపనూనె లేదా పైరెత్రిన్ వంటి బొటానికల్స్ చిన్న పురుగులను కొంతవరకు మాత్రమే నియంత్రిస్తాయి. లీఫ్ ఫుట్ నల్లులను నియంత్రించడానికి వాటి గుడ్లను తొలగించడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి.
లీఫ్ ఫుట్ నల్లుల రసాయన నియంత్రణలో తెగుళ్లను చంపడానికి లేదా తిప్పికొట్టడానికి పురుగుమందులను ఉపయోగించడం జరుగుతుంది. పైరెథ్రాయిడ్లు, నియోనికోటినాయిడ్స్ మరియు స్పినోసాడ్‌లతో సహా లీఫ్ ఫుట్ నల్లుల నియంత్రణకు అనేక ప్రభావవంతమైన క్రిమిసంహారకాలు ఉన్నాయి. ఈ క్రిమిసంహారకాలను స్ప్రేలు, డస్టింగ్ లేదా ఎరలుగా ఉపయోగించవచ్చు. పురుగుమందులను ఉపయోగించినప్పుడు లేబుల్‌పై సూచనలను జాగ్రత్తగా అనుసరించండి. రక్షిత దుస్తులు ధరించండి మరియు గాలులు లేదా వర్షం ఉన్నప్పుడు స్ప్రే చేయకండి. అలాగే, వాడాల్సిన సమయం మరియు మీరు ఉత్పత్తిని ఎన్నిసార్లు వాడాలి అనే దానికి సంబంధించి లేబుల్‌పై ఏవైనా పరిమితులు ఉన్నాయా అనేది గమనించండి. లీఫ్ ఫుట్ నల్లుల జనాభాను తగ్గించడంలో రసాయన నియంత్రణ ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, పురుగుమందుల మితిమీరిన వినియోగం లేదా దుర్వినియోగం వలన ఈ మందుల లక్ష్యం కాని కీటకాలు, వన్యప్రాణులు మరియు మానవులతో సహా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చని గమనించడం ముఖ్యం. అందువల్ల, క్రిమిసంహారక మందులను తెలివిగా మరియు సాగు మరియు జీవ నియంత్రణలను కలిగి ఉన్న సమీకృత తెగులు నిర్వహణ విధానంలో భాగంగా ఉపయోగించడం చాలా ముఖ్యం.
లీఫ్-ఫుట్ బగ్స్ అనేవి చదునుగా, ఆకు ఆకారంలో ఉండి వెనుక కాళ్లను కలిగి ఉండే కీటకాలు.. ఇవి మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా 20 మి.మీ పొడవు ఉంటాయి. ఇవి సాధారణంగా గోధుమరంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి మరియు పండ్లు, కూరగాయలు మరియు గింజలు వంటి మొక్కల రసాన్ని తింటాయి. ఆడ పురుగు మొక్కలపై గుడ్లు పెట్టినప్పుడు లీఫ్ ఫుట్ నల్లి యొక్క జీవిత చక్రం ప్రారంభమవుతుంది. గుడ్లు సుమారు 1.4 మి.మీ పొడవు, ఓవల్ ఆకారంలో, కాంస్య నుండి ముదురు గోధుమ రంగులో ఉంటాయి ఇవి వరుసలలో గుడ్లు పెడతాయి. గుడ్లు చిన్న పిల్లలుగా పొడగబడతాయి. ఇవి పెద్ద పురుగులపోలికలతో ఉంటాయి. ఇవి పెద్దవి కావడానికి ముందు అనేక రకాలుగా రూపాంతరం చెందుతాయి. ప్రతి రూపాంతరం సమయంలో, పిల్ల పురుగు తన పాత చర్మాన్ని విసర్జిస్తుంది మరియు కొత్త చర్మం పెరుగుతుంది. ఇవి పెరిగేకొద్దీ, పెద్ద పురుగులు వలే కనిపించడం ప్రారంభిస్తాయి మరియు వాటి రెక్కలు వృద్ధి చెందుతాయి. లీఫ్ ఫుట్ నల్లులు పెద్ద పురుగులుగా మారిన తర్వాత అవి జతకట్టి గుడ్లు పెడతాయి. ఆలా మళ్లీ వాటి జీవిత చక్రం ప్రారంభమవుతుంది. లీఫ్ ఫుట్ నల్లులు వాతావరణం మరియు ఆహార లభ్యతను బట్టి సంవత్సరానికి అనేక తరాలను కలిగివుంటాయి. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడువీటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పెద్ద పురుగులు చనిపోయిన మొక్కలు లేదా రక్షక కవచం కింద దాగి ఉండి చలికాలం గడిపిన తర్వాత వసంతకాలంలో బయటకు వస్తాయి. శీతాకాలంలో వాతావరణం వెచ్చగా ఉంటే, ఎక్కువ పెద్ద కీటకాలు మనుగడ సాగిస్తాయి మరియు మరిన్ని సమస్యలను కలిగిస్తాయి. కొన్ని రకాల లీఫ్ ఫుట్ నల్లులు కలుపు మొక్కలపై మాత్రమే పునరుత్పత్తి చేస్తాయి, మరికొన్ని రకాల నల్లులు కూరగాయలపై పునరుత్పత్తి చేస్తాయి. ఈ కీటకాలతో పండ్ల నష్టం ప్రధాన సమస్య మరియు పండ్లు ఏర్పడటం ప్రారంభించిన సమయంలో అవి సమస్యలను కలిగిస్తాయి.