పొగాకు

పొగాకు పంటలో కొమ్ము పురుగు

Manduca sexta

కీటకం

క్లుప్తంగా

  • ఇవి ఆకుల బాహ్య భాగంలో తింటాయి మరియు ఆకులలో రంధ్రాలు చేస్తాయి.
  • ఆకులు మిస్ అవుతాయి.
  • ఆకులు రాలి పడిపోతాయి.
  • గొంగళి పురుగుల ఉనికి.

లో కూడా చూడవచ్చు


పొగాకు

లక్షణాలు

గొంగళి పురుగులు లేత ఆకులు మరియు పెరుగుతున్న రెమ్మలను తిని ఆకులలో రంధ్రాలు చేస్తాయి. ఆకులపై ముదురు విసర్జన ద్వారా వాటి ఉనికి గుర్తించబడుతుంది. మొక్కను నిశితంగా పరిశీలిస్తే మీరు ఆకుపచ్చ లేదా గోధుమ గొంగళి పురుగులను చూడవచ్చు. గొంగళి పురుగులు కాండం మరియు ప్రధాన ఈనెలను మాత్రమే వదిలి పొగాకు మొక్క యొక్క అన్ని ఆకులను తినివేయగలవు. వీటి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మొత్తం పొలంలోని ఆకులన్నీ ఇవి తినివేస్తాయి. టమోటాల విషయంలో, వీటి తీవ్రత కారణంగా గొంగళి పురుగులు వృద్ధి చెందుతున్న పండ్లను తిని పండుపై పెద్ద పెద్ద మచ్చలను ఏర్పరుస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లేబుల్ మరియు స్థానిక మార్గదర్శకాల ప్రకారం బాసిల్లస్ తురింజిఎంసిస్ (బిటి) ఉత్పత్తులను ఉపయోగించండి. బిటి అనేది గొంగళి పురుగును తీసుకున్నప్పుడు చంపే ఒక బాక్టీరియం మరియు సేంద్రీయ వ్యవసాయానికి సురక్షితం. అదనంగా, పక్షులు, చిన్న క్షీరదాలు, లేడీబగ్‌లు, అల్లిక రెక్కల పురుగులు మరియు పరాన్నజీవి కందిరీగలు వంటి సహజశత్రువులు కొమ్ము పురుగుల జనాభాను తగ్గించడంలో సహాయపడతాయి. మీరు మీ మొక్కలపై ఏవైనా పొగాకు కొమ్ము పురుగులు కనిపిస్తే, చేతి తొడుగులు ధరించి వాటిని చేతితో తీసివేసి, వాటిని చంపడానికి వాటిని సబ్బు నీటిలో ఉన్న బకెట్‌లో వేయండి.

రసాయన నియంత్రణ

పొగాకు కొమ్ము పురుగు మరియు ఇతర గొంగళి పురుగులను నియంత్రించడానికి అనేక రసాయన క్రిమిసంహారకాలు ఉన్నాయి. మలాథియాన్, డయాజినాన్, కార్బరిల్ మరియు ఫెనిట్రోథియాన్ అనేవి పురుగుల వృద్ధి యొక్క వివిధ దశలను లక్ష్యంగా చేసుకునే పురుగుమందులు, అయితే అవి చురుకుగా తినే గొంగళి పురుగుకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయి. పురుగుమందులు లేదా ఏదైనా రసాయన ఉత్పత్తిని ఉపయోగిస్తున్నప్పుడు, కంటి రక్షణతో సహా రక్షణ దుస్తులను ధరించడం చాలా ముఖ్యం మరియు లేబుల్ సూచనలను జాగ్రత్తగా చదవండి. దేశాన్ని బట్టి నిబంధనలు మారుతూ ఉంటాయి, కాబట్టి మీరు మీ ప్రాంతానికి సంబంధించిన నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించారని నిర్ధారించుకోండి. ఇది భద్రతకు హామీ ఇస్తుంది మరియు వీటిపై మందులు విజయవంతంగా పనిచేసే అవకాశాలను పెంచుతుంది.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు కీటకాల వల్ల కలుగుతాయి. సాధారణంగా ఈ పురుగులు పొగాకు మరియు టొమాటో వంటి సోలనేసియస్ మొక్కలను మాత్రమే తింటాయి,. గొంగళి పురుగు పెద్దవారి చూపుడు వేలు అంత పొడవు వరకు పెరుగుతుంది మరియు దాని శరీరం చివర ఎరుపు లేదా నల్లని "కొమ్ము" ఉంటుంది. సాధారణంగా గొంగళి పురుగు ఆకుపచ్చగా ఉంటుంది, కానీ గోధుమ రంగులో కూడా ఉండవచ్చు మరియు దాని శరీరం యొక్క రెండువైపులా వికర్ణ రూపంలో ఏడు తెల్లని చారలు మరియు నీలం-నలుపు మచ్చ ఉంటుంది. ఆడ పొగాకు కొమ్ము పురుగు అతిధేయ మొక్క ఆకులపై గుడ్లు పెడుతుంది. గొంగళి పురుగులు ఇప్పటికే తిన్న మొక్కలపై సాధారణంగా అవి గుడ్లు పెట్టవు. గుడ్డు పొదగబడి గొంగళి పురుగు మొక్క యొక్క ఆకులు మరియు కాండం మీద తింటుంది. గొంగళి పురుగు విశ్రాంతి దశకి చేరుకునేవరకు అనేక సార్లు దాని చర్మాన్ని విసర్జిస్తుంది. ఈ సమయంలో గొంగళి పురుగు పెద్ద చిమ్మటగా మారుతుంది. భూమి క్రింద లేదా ఆకు చెత్తలో బాగా లోతులో ఇది విశ్రాంతి దశను గడుపుతుంది.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే వ్యాధి నిరోధక పొగాకు సాగు రకాలను ఎంచుకోండి.
  • బాగా ఆలస్యంగా నాటవద్దు; ఇది ఇతర పొలాల నుండి కీటకాలు మీ పొలంలోని లేత మొక్కలకు సంక్రమింపచేస్తుంది.
  • తెగుళ్ళను ప్రోత్సహించకుండా ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి అధిక మొత్తంలో నత్రజని ఎరువులను వాడకుండా సరైన మోతాదులో వాడండి.
  • తెగులు ముట్టడి లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సంకేతాల కోసం మీ పంటను, ముఖ్యంగా చిన్న ఆకులు మరియు రెమ్మలను చెక్ చేయండి.
  • పంట కోసిన తర్వాత, రాబోయే రెండేళ్లలో సమస్యలను నివారించడానికి మట్టిలో క్రిమికీటకాలను నియంత్రించండి: పొగాకు మొక్కల సెకండరీ కాండాలను కత్తిరించి, వాటిని పొలం నుండి దూరంగా పారవేసి, ఆపై దున్నండి.
  • పంట కోసిన తర్వాత పొలాన్ని శుభ్రంగా ఉంచడానికి కాండాలను త్వరగా తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి