Daktulosphaira vitifoliae
కీటకం
డక్టులోస్ఫైర వీటిఫోలియాలే రెండు బుడిపెల ఉత్పత్తి దశలను కలిగి ఉంది; ఒకటి ఆకు బుడిపె స్టేజ్ మరియు ఒకటి వేరు బుడిపె స్టేజ్. ఆకు యొక్క దిగువ ఉపరితలంపై చిన్న బుడిపెలు వృద్ధి చెందుతాయి. బుడిపెలు సగం బఠానీ పరిమాణంలో ఉంటుంది. కొన్నిసార్లు, మొత్తం ఆకు బుడిపెలతో కప్పబడి ఉంటుంది. సాధారణంగా ఈ ఆకు బుడిపెలు ద్రాక్ష ఉత్పత్తిలో గణనీయమైన నష్టాన్ని కలిగించదు. అయినప్పటికీ, తీవ్రమైన ముట్టడి కారణంగా సీజన్ చివరిలో ప్రభావితమైన ఆకులు గణనీయమైన వక్రీకరణ చెంది రాలిపోతాయి. ఫైలోక్సెరా యొక్క ఆకు బుడిపెలు కొన్ని దేశాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. వేర్లలో బుడిపెలు ఏర్పడకుండా ఆకులపై బుడిపెలు ఏర్పడవని గమనించండి. మరోవైపు, వేర్ల పైన బుడిపెలను నియంత్రించడం చాలా కష్టం మరియు వేరు వాపుకు మరియు తీగలు క్షీణతకు దారితీస్తుంది. వేరు వ్యవస్థ క్షీణించడం వలన ద్వితీయ సంక్రమణకు కారణమవుతుంది. తీవ్రమైన వేరు సంక్రమణ ఆకులు రాలిపోవడానికి కారణమవుతాయి మరియు చిగుర్ల పెరుగుదలను తగ్గిస్తాయి. 3 నుండి 10 సంవత్సరాలలోపు ద్రాక్ష తీగలు చనిపోవచ్చు. సాధారణంగా, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బలమైన తీగలపై దీని ప్రభావం తక్కువగా ఉంటుంది.
ద్రాక్ష ఫైలోక్సెరా యొక్క జీవ నియంత్రణపై చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది; సహజ శత్రువుల కంటే సరైన పర్యావరణ పరిస్థితులు మరియు వేరు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం.
రసాయన సాధనాలతో ఫైలోక్సెరా చికిత్స ఎల్లప్పుడూ సాధ్యం కాదు. చాలా సున్నితమైన సాగు రకాలలో, ముఖ్యంగా చిన్న మొక్కలపై, వసంతకాలంలో మొదటి బుడిపెలు అభివృద్ధి చెందిన వెంటనే చికిత్స చేయాలి. బుడిపెలు కనిపించిన వెంటనే గుడ్లు ఎప్పుడు పొదుగడం ప్రారంభిస్తాయో గుర్తించడానికి రేజర్ బ్లేడ్‌తో వాటిని కత్తిరించడం ద్వారా ప్రతిరోజూ వాటిని తెరవాలి. చిన్న లార్వాను గమనించిన వెంటనే రసాయన నియంత్రణను వర్తించండి. వివిధ జీవిత చక్రాలు ఒకదాని వెంట మరొకటి మొదల్లవకముందే నిఘా పెట్టి ముందస్తుగా చికిత్స చేయాలి. ఈ సందర్భాలలో పురుగుమందుల ప్రభావం చాలా తక్కువ. ఎల్లప్పుడూ మీ ప్రాంతంలో నియంత్రించబడిన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.
డక్టులోస్ఫైరా విటిఫోలియా యొక్క జీవిత చక్రం సంక్లిష్టమైనది. ఈ తెగులు భారీ బంకమట్టి నేలలు మరియు పొడి పరిస్థితులను ఇష్టపడుతుంది. వసంత ఋతువులో, ఆడ పురుగు ద్రాక్ష తీగ చెక్కపై పెట్టిన గుడ్డు నుండి పిల్లలను పొదిగి ఆకులపైకి వలసపోయి అక్కడ బుడిపెలను ఉత్పత్తి చేస్తుంది. 15 రోజులలో, ఆడ పురుగు పరిపక్వత చెందుతుంది. గుడ్లతో బుడిపెను నింపి వెంటనే మరణిస్తుంది. ఈ గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు బుడిపె నుండి బైట వచ్చి కొత్త ఆకులపైకి చేరతాయి. ఇవి కొత్త బుడిపెలను మరియు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. వేసవిలో, 6 లేదా 7 తరాలు ఉండవచ్చు. శరదృతువులో, ఇళ్ల పురుగులు శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉండే వేర్ల పైకి వలసపోతాయి. తరువాతి వసంతకాలంలో అవి మళ్లీ చురుకుగా మారతాయి మరియు వేర్లపై బుడిపెలను ఉత్పత్తి చేస్తాయి. రెక్కలు లేని ఆడ పురుగులు సంవత్సరాల తరబడి వేర్లపై నిరవధికంగా జీవించవచ్చు. వేసవి చివరిలో మరియు శరదృతువులో, వేర్లలో నివసించే ఫైలోక్సెరా గుడ్లు పెడతాయి. ఇవి రెక్కలు గల ఆడ పురుగులుగా వృద్ధి చెందుతాయి. ఈ రెక్కలు గల ఆడ పురుగులు వేర్లనుండి కాండం పైకి వలసపోతాయి, అక్కడ ఇవి రెండు సైజులలో గుడ్లు పెడతాయి. చిన్న గుడ్లు మగ పురుగులుగా మరియు పెద్ద గుడ్లు ఆడ పురుగులుగా వృద్ధి చెందుతాయి. వీటి మధ్యన సంభోగం జరిగి ఆడ పురుగు ద్రాక్ష కాండం పైన ఒక గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డు ద్రాక్ష కొమ్మపై శీతాకాలమంతా మనుగడ సాగిస్తుంది. ఈ గుడ్డు నుండే తరతరాలు ఆకులపై జీవించే పురుగులను పుడతాయి. భౌగోళిక కారకాలపై ఆధారపడి ఒకే సమయంలో వివిధ జీవిత చక్రాలతో తరాలు వృద్ధి చెందుతాయి.