మామిడి

మామిడిలో తెల్ల పొలుసు

Aulacaspis tubercularis

కీటకం

క్లుప్తంగా

  • ఆకులు పాలిపోవడం, ఆకులు రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం, పేలవంగా వికసించడం, పండ్ల ఎదుగుదల తగ్గడం మరియు వక్రీకరణ చెందడం.
  • అకాలంగా పండ్లు రాలిపోవడం.

లో కూడా చూడవచ్చు


మామిడి

లక్షణాలు

ఆకులు, కొమ్మలు మరియు పండ్లపై మొక్కల రసాలను పీల్చడం వలన మొక్కలు గాయపడతాయి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే మామిడి మొక్కలు పాలిపోవడం , ఆకులు రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం మరియు ఎదుగుదల మరియు అభివృద్ధి తగ్గడం లాంటి లక్షణాలకు దారితీయవచ్చు. పండిన పండ్ల పైతొక్క పై గులాబీ రంగు మచ్చలు చూడవచ్చు.ఈ మచ్చల వలన పండ్లు వాటి ఆకర్షణీయతను కోల్పోతాయి. (సౌందర్య నష్టం), ముఖ్యంగా అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లలో మార్కెట్ విలువను కోల్పోతాయి. తెగులు యొక్క సాంద్రత పండ్ల దిగుబడి నష్టాలను ప్రభావితం చేస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

తెల్ల పొలుసు పురుగుకి అనేక సహజ శత్రువులు ఉన్నాయి. రైతులు పొలాల్లో తెల్ల పొలుసు పురుగు యొక్క శత్రువులను వృద్ధిచేయడానికి వాటిని ఆకర్షించేవాటిని మరియు పోషక పదార్ధాలను ఉపయోగించవచ్చు. పొలంలో మరిన్ని సహజ శత్రువులను పరిచయం చేయడం సాధ్యమే.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మీ ప్రాంతంలో అనుమతించబడిన పురుగుమందులను వాడండి మరియు క్రియాశీల పదార్ధాలను మార్చి మార్చి వాడండి, తద్వారా ఈ పురుగులు మందులకు నిరోధకతను పెంచుకోవడాన్ని నివారించండి. తెల్ల పొలుసుకు వ్యతిరేకంగా పురుగు మందులను ఆకులపై పిచికారీ చేయడం తక్కువ ఆచరణాత్మకమైనది, ఎందుకంటే చాలా మామిడి రకాలు 20 మీటర్ల పొడవు వరకు ఉంటాయి. అందువలన సాధారణ స్ప్రే పరికరాల ద్వారా అంత ఎత్తుకు చేరుకోవడం కష్టం.

దీనికి కారణమేమిటి?

హెమిప్టెరా, డయాస్పిడిడే కుటుంబానికి చెందిన తెల్ల మామిడి పొలుసు పురుగు వల్ల నష్టం జరుగుతుంది. ఇది చిన్నగా ఉండి పెంకులతో కూడిన క్రిమి. మామిడి మొక్క మొలక నుండి పక్వానికి వచ్చే వరకు అన్ని ఎదుగుదల దశలలో ఈ పురుగు దాడి చేస్తుంది. మామిడి మొక్కను తినే సమయంలో ఇది మొక్క రసాన్ని పీల్చి మొక్కలోకి విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. వర్షాకాలం కంటే వేడి మరియు పొడి వాతావరణంలో, ముఖ్యంగా చిన్న మొక్కలు మరియు మామిడి చెట్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • సరైన పొలం మరియు కావలసిన రకాన్ని ఎంచుకోండి.
  • ఆసియా మరియు ఆఫ్రికాలో జరిపిన పరిశోధనల ఆధారంగా, అల్ఫాన్సో, కెంట్, టామీ అట్కిన్స్ మరియు డాడ్ వంటి ఇతర రకాలతో పోల్చినప్పుడు అటాల్ఫో, యాపిల్, హాడెన్ మరియు కీట్ మామిడి రకాలు మామిడిలో తెల్ల పొలుసు పురుగును ఎక్కువగా తట్టుకోగలవని రిపోర్ట్ చేయబడింది.
  • తెల్ల పొలుసు పురుగుల ఉనికి కోసం పదిహేనురోజులకు ఒకసారి తోటను పర్యవేక్షించి తెగులు సోకిన కొమ్మలు మరియు రెమ్మలను కత్తిరించి తొలగించండి.
  • వృద్ధి కారకాల కోసం మొక్కలు పోటీ పడకుండా ఉండడానికి మొక్కల మధ్య సరిపడినంత దూరం ఉండేలా చూసుకోండి.
  • పండ్లను కోయడానికి ముందు భౌతిక రక్షణ పద్ధతిగా పండ్లను బ్యాగింగ్‌ చేయవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి