Jatrophobia brasiliensis
కీటకం
లార్వాలు తినడం వలన మొక్కలపై బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలు ఎక్కువగా ఆకుల పైభాగంలో కనిపిస్తాయి, ఇక్కడ ఈగలు గుడ్లు పెడతాయి మరియు కొన్నిసార్లు మొగ్గలు మరియు కాండం మీద కూడా ఏర్పడతాయి ఈ బుడిపెలు పసుపు-ఆకుపచ్చ నుండి ఎరుపు రంగులో ఉంటాయి మరియు శంఖాకారంలో ఉంటాయి. ఈ బుడిపెలు తెరిచి చూసినప్పుడు వీటి లోపల లార్వాతో లేదా లార్వా లేకుండా ఒక స్థూపాకార సొరంగం కనిపిస్తుంది. ఆకు కింద నుండి బుడిపెలను గమనించినట్లయితే, ఒక చిన్న రంధ్రాన్ని చూడవచ్చు. ఈ రంధ్రం ద్వారా పెద్ద ఉల్లికోడు బయటకు వస్తుంది.
వీటిని గమనించడానికి లేదా సంభోగంలో అంతరాయం కలగచేయడం కోసం రంగు ఎరలను ఉపయోగించండి.
అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి.
జత్రోఫోబియా బ్రాసిలియెన్సిస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది. చిన్న ఎగిరే కీటకాలైన ఈగలు ఆకు ఉపరితలంపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదిగినప్పుడు, బైటకి వచ్చే లార్వా అసాధారణ సెల్యులార్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది, ఇది ఆకు ఎగువ ఉపరితలంపై ఏర్పడుతుంది.