Leucoptera sp.
కీటకం
ప్రారంభంలో, ఆకులలో సొరంగాలు ఏర్పడతాయి. తరువాత ఇవి ఆకు యొక్క ఉపరితల భాగంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి, దీని కారణంగా పెద్ద నిర్జీవ కణాల మచ్చలు ఏర్పడతాయి. లార్వాలు సొరంగాలలో జీవిస్తూ ఆకు లోపలి కణజాలాన్ని(మెసోఫిల్) తింటాయి. ఆకులు బలహీనపడి కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఆకులు రాలిపోయి, మొక్కలు ఎండిపోయి చివరికి చనిపోతాయి.
పంట నిర్వహణ పద్ధతులు మరియు ల్యాండ్ స్కెప్ నిర్మాణం, వీటి సహజ శత్రువుల యొక్క వైవిధ్యాన్ని మెరుగుపరచి వాటిని సమృద్ధిగా చేసి కీటకాల గుంపును మరియు వీటి సహజ శత్రువులు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలను ప్రభావితం చేస్తాయి. పర్యావరణపరంగా సంక్లిష్టమైన కాఫీ వ్యవస్థలు, అధిక జీవవైవిధ్యం కలిగిన పారాసిటోయిడ్ కందిరీగలు, చీమలు మరియు ఆకు చార యొక్క ఇతర సహజ శత్రువులతో సంబంధం కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఈ సహజ శత్రువులను జీవ నియంత్రణగా ఉపయోగించటానికి గణనీయమైన ప్రయత్నాలు చేయబడలేదు. వీటి జనాభా స్థాయిలను తగ్గించడానికి కీటకాల సహజ ప్రవర్తనలను మార్చటానికి లేదా అంతరాయం కలిగించడానికి ఫెరోమోన్‌లను ఉపయోగించవచ్చు.
నివారణ చర్యలు మరియు అందుబాటులో ఉన్న జీవ చికిత్సలతో పాటు ఎల్లప్పుడూ సమీకృత విధానాన్ని పరిగణలోకి తీసుకోండి. ప్రస్తుతం, కాఫీ పెంపకందారులు ఆర్గానోఫాస్ఫేట్లు, కార్బమేట్స్, పైరిత్రాయిడ్స్, నియోనికోటినాయిడ్స్ మరియు డయామైడ్స్ వంటి న్యూరోటాక్సిక్ క్రిమిసంహారకాలను ఉపయోగిస్తున్నారు. కానీ, రసాయన నియంత్రణలు సరిపోవు మరియు వాటి ప్రభావాన్ని కోల్పోవచ్చు ఎందుకంటే వాటిని అధికంగా ఉపయోగించడం వలన తెగులు ఈ మందులకు నిరోధకతను పెంచుకుంటుంది.
కాఫీ ఆకులను మాత్రమే తినే కాఫీ ఆకు చార తెగులు(CLM) లార్వా వల్ల ఈ నష్టం జరుగుతుంది. పెద్ద పురుగులు రాత్రిపూట సంభోగిస్తాయి మరియు ఆడ పురుగులు కాఫీ ఆకుల పైభాగంలో గుడ్లు పెడతాయి. 20°C ఉష్ణోగ్రత వద్ద అండోత్సర్గము ముందు సమయం 3.6 రోజులు. సగటున, ప్రతి గుడ్డు సుమారు 0.3 మిమీ ఉంటుంది మరియు వాటిని కంటితో చూడటం కష్టం. పొదిగేటప్పుడు, లార్వా ఎగువ ఆకు ఎపిడెర్మిస్‌తో సంబంధం ఉన్న గుడ్ల దిగువ భాగాన్ని వదిలి ఆకులలోకి ప్రవేశిస్తుంది. లార్వా పారదర్శకంగా ఉంటుంది మరియు 3.5 మిమీ పొడవు వరకు ఎదుగుతుంది. ఇది ఆకుల లోపలి కణజాలాన్ని తింటాయి మరియు ఆకులలో సొరంగాలను సృష్టిస్తాయి. ఈ సొరంగాలు కణజాల నాశనానికి కారణమవుతాయి, దీని కారణంగా కిరణజన్య సంయోగక్రియ తగ్గి మొక్క కృంగిపోతుంది. లార్వా దశలో నాలుగు అంతర దశలు ఉంటాయి. లార్వా సొరంగాలను విడిచిపెట్టి, సాధారణంగా ఆకు యొక్క అక్ష ప్రాంతంలో X- ఆకారపు పట్టు గూడును నేసి, ప్యూపా గా మారుతుంది. సాధారణంగా, మొక్క దిగువ భాగంలో చనిపోయిన ఆకులు పేరుకుపోయిన ప్రాంతంలో ఎక్కువ ప్యూపాలు కనిపిస్తాయి. సగటున 2 మిమీ శరీర పొడవు మరియు 6.5 మిమీ రెక్కల పొడవుతో ప్యూపా నుండి పెద్ద పురుగులు బయటకి వస్తాయి. అవి పొత్తికడుపు చివరి వరకు వుండే పొడవాటి యాంటెన్నాతో తెల్లటి జుట్టు లాంటి పొలుసులను కలిగి ఉంటాయి మరియు గోధుమ-తెలుపు రంగులో ఉండి విప్పారిన రెక్కలను కలిగి ఉంటాయి. ప్యూపా నుండి పెద్దపురుగులు బైటకి వచ్చిన వెంటనే అవి జతకట్టి గుడ్లు పెట్టి జీవిత చక్రాన్ని పునఃప్రారంభిస్తాయి. పొడి వాతావరణ సీజన్లు మరియు అధిక ఉష్ణోగ్రతలు ఈ తెగులు సంభవించడానికి అనుకూలంగా ఉంటుంది.