పసుపు

కాస్టర్ సీడ్ మరియు క్యాప్సూల్ కాయతొలుచు పురుగు

Dichocrocis punctiferalis

కీటకం

క్లుప్తంగా

  • గొంగళి పురుగులు చిగుర్లు మరియు క్యాప్స్యూల్ లోకి రంధ్రము చేసి ప్రవేశిస్తాయి.
  • క్యాప్సూల్స్ చుట్టూ గూడు కడతాయి.

లో కూడా చూడవచ్చు

8 పంటలు
ప్రత్తి
వంకాయ
అల్లం
జామ
మరిన్ని

పసుపు

లక్షణాలు

రెమ్మలు మరియు క్యాప్సూల్‌లను బోరింగ్ చేయడం ద్వారా లార్వా నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా తరచుగా క్యాప్సూల్స్ ని కలిపి సాలెగూడు లాగ చేస్తుంది. ఇందులో ఇవి వాటి మలపదార్ధంతో పట్టు వరుసలతో కప్పబడిన సొరంగాలను సృష్టిస్తాయి. కొన్నిసార్లు, ఆకు కాండం వద్ద కలిసే చోట లేదా అరుదుగా మందపాటి ఆకుల మధ్య కనిపిస్తాయి. నష్టం వాటిల్లిన చిగుర్లపై కనిపించే మలపదార్ధం మరియు సాలెగూడుగా మారిన క్యాప్సూల్స్‌ ఈ తెగులు యొక్క సంకేతాలు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ప్రధాన పంటల నుండి కాయ తొలుచు పురుగును మళ్లించడానికి ఉచ్చు పంటలను నాటండి. పొలంలో సహజ శత్రువులను పరిచయం చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. లార్వాలను రసాయన చికిత్సలతో నియంత్రించడం చాలా కష్టం ఎందుకంటే ఇవి కాయలోకి రంధ్రాలు చేయగలవు. పిచికారీ చేసినప్పుడు, పుష్పగుచ్ఛము ఏర్పడినప్పటి నుండి మరియు మరల 20 రోజుల తర్వాత పురుగుమందుల వాడకం ప్రారంభించాలి.

దీనికి కారణమేమిటి?

కాండం, రెమ్మలు, మొగ్గలు, పండ్లు మరియు గింజల్లోకి లార్వా రంధ్రాలు చేయడం వలన నష్టం జరుగుతుంది. ఈ నష్టం ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఆడ చిమ్మట పండ్లు లేదా గింజలపై లేదా సమీపంలో చిన్నచిన్న, అండాకారపు, లేత పసుపు రంగు గుడ్లు పెడతాయి. 6-7 రోజుల తరువాత, గుడ్లు ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. పెద్ద చిమ్మట లేత పసుపు రెక్కలు మరియు నల్లని చిన్నచిన్న చుక్కలతో మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. లార్వా గింజలు, క్యాప్సూల్స్ మరియు లేత రెమ్మలను తింటాయి. పూర్తిగా ఎదిగిన లార్వా 24 మి.మీ పొడవు, పాలిపోయినట్టు ఉండే ఆకుపచ్చ రంగులో కొద్దిగా గులాబీ రంగులో ఉంటాయి మరియు మృదువైన వెంట్రుకలు, ముదురు రంగు తల మరియు కవచంతో ఉంటాయి. ఇవి కాండం లేదా క్యాప్స్యూల్ లో పూపా దశను గడుపుతాయి.


నివారణా చర్యలు

  • తెగులు సోకిన రెమ్మలు మరియు వాటి క్యాప్సూల్స్ ని సేకరించి నాశనం చేయండి.
  • శుభ్రతను మెయింటైన్ చేయండి.
  • సీజన్ కి ముందుగానే నాటండి.
  • ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలను నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి