Membracidae
కీటకం
నల్లి జాతి పురుగులు కణద్రవ్యాన్ని పీల్చడం వలన కాండం మీద కార్కి కాల్సస్ ఏర్పడుతుంది. కాండం మీద పురుగులు తిన్న గుర్తులు చూడవచ్చు. సంక్రమణ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావితమైన భాగం ఎండిపోయి రాలిపోతుంది. మొక్క వాడిపోయినట్లు కనిపిస్తుంది మరియు మొక్క సత్తువ తగ్గిపోతుంది. కణ ద్రవ్యాన్ని పీల్చడం మరియు కీటకాల లాలాజలం ద్వారా విషాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఆకుల వక్రీకరణను గమనించవచ్చు. దీనితో పాటు మొక్క భాగాలపై నల్లటి బూజు, కాప్నోడియం spp., కౌబగ్స్ స్రవించే తేనెబంకపై వృద్ధి చెందుతాయి, దీని ఫలితంగా నాణ్యత లేని ఆకులు ఉత్పత్తి అవుతాయి. ఈ పురుగులు సాధారణంగా ఆకుపచ్చ కాండం నుండి రసాన్ని పీలుస్తాయి. సంక్రమణ తీవ్రత అధికంగా ఉంటే కార్కీ కాల్సస్ ఏర్పడటానికి, మొక్క వాడిపోవడం మరియు మొక్కల సత్తువ తగ్గడం జరుగుతుంది.
పరాన్నజీవులు కౌబగ్స్ గుడ్లను చంపగలవు. ఈ తెగులుకు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతి గురించి నేటికీ మాకు తెలియదు. వ్యాధి సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే జీవ సంబంధిత చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. తెగులు జనాభాను నియంత్రించడానికి ఒక లీటరు నీటిలో 2 మి.లీ చొప్పున డైమెథోయేట్ ను ఉపయోగించవచ్చు.
ఓంబినోటస్ ఒనెరాటస్ మరియు ఆక్సిరాచిస్ టరాండస్‌తో సహా మెంబ్రాసిడే కుటుంబంలోని పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగుల వల్ల ఈ నష్టం జరుగుతుంది. ఈ కీటకాలకు ఇతర పేర్లు ట్రీ హాపర్స్ లేదా ముళ్ల పురుగులు. బూడిద-గోధుమ రంగు, రెక్కలు కలిగిన పురుగులు 7 మి.మీ పొడవు, ఉరము మీద ముల్లు లాంటి భాగాలు ఉంటాయి. కాండం లేదా కొమ్మలపై ఆడ గుడ్లు క్రమరహిత సమూహాలలో పెడుతుంది. ఇవి చీమలతో పరస్పర సంబంధంలో జీవిస్తాయి. చిన్నపురుగులు తేనెబంక ను స్రవిస్తాయి, వీటిని చీమలు తింటాయి. దీనికి బదులుగా చీమలు ఈ పురుగులను వాటి సహజ శత్రువుల నుండి కాపాడతాయి ఉష్ణోగ్రత పడిపోయి తేమ పెరిగితే తెగులు జనాభా కు అనుకూలంగా ఉంటుంది.