చెరుకు

ప్లాసీ బోరర్

Chilo tumidicostalis

కీటకం

క్లుప్తంగా

  • పై భాగంలో కణుపులపై రంధ్రాలు, బోలు చెరకు.
  • కుదురు మరియు మొక్క పైభాగంలో ఆకులు పొడిగా మారతాయి.
  • ఆకులు.
  • ముదురు మచ్చలు మరియు ముదురు తలతో తెల్లటి లార్వా.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

పై కణుపులలో అనేక రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. కాండాలు ఎరుపు రంగు మలపదార్ధంతో నిండి ఉంటాయి. చెరకు బోలుగా మారుతుంది మరియు మధ్య కుదురు మరియు పైభాగం ఆకులను ఎండిపోయేటట్టు చేసి మరింత సులభంగా విరిగిపోతుంది. భారీ నేలలు, నీరు నిలువ వుండే నేలలు, వరదల తాకిడి వుండే పొలాలు మరియు రాటన్ పంటలలో ఇది సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తెగులు సోకిన చెరకు మొక్క యొక్క ఎండిన పైభాగం బట్టి ఈ తెగులు సోకిన సంఘటనలను సులభంగా గుర్తించవచ్చు. మొదటి మూడు నుండి ఐదు కణుపుల్లో కొత్తగా పొదిగిన లార్వా వల్ల ప్రాథమిక ముట్టడి సంభవిస్తుంది. ఇవి బాగా ఎక్కువగా తినడం కారణంగా, తాజా ఎరుపు రంగు మల పదార్ధం ఇవి చేసిన రంధ్రాల నుండి బయటపడటం కనిపిస్తుంది మరియు చెరకు పైఆకులు చివరికి ఎండిపోతాయి. ప్రభావిత కణుపులు సులభంగా విరిగిపోతాయి మరియు తెగులు సోకిన కణుపుల ప్రక్కనే ఉన్న నోడ్లు సెట్ రూట్లను అభివృద్ధి చేస్తాయి; నోడల్ మొగ్గలు కూడా మొలకెత్తడం జరుగుతుంది. ద్వితీయ ముట్టడి విషయంలో, ఎదిగిన లార్వా ఆరోగ్యంగా వున్న మొక్క క్రిందిభాగానికి పాకి ప్రాధమిక ముట్టడిని చూపిస్తుంది లేదా పక్కన వున్న చెరకు మొక్కలకు విస్తరిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కోటిసియా ఫ్లేవైప్స్, ట్రైకోగ్రామా చిలోట్రాయే సి. టుమిడికోస్టాలిస్ యొక్క సహజ శత్రువులు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఈ రోజు వరకు ఈ తెగులుకు వ్యతిరేకంగా రసాయన నియంత్రణ పద్ధతి మాకు తెలియదు. సాధారణంగా, రసాయన నియంత్రణ చర్యలు ప్రభావవంతంగా పనిచేయవు. ఈ తెగులు సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

దీనికి కారణమేమిటి?

చిలో టుమిడికోస్టాలిస్ యొక్క లార్వా యొక్క విపరీతంగా తినే చర్య వల్ల నష్టం జరుగుతుంది. పెద్ద చిమ్మటలు గోధుమ నుండి లేత గోధుమ రంగు లో ఉండి రాత్రి సమయాల్లో చురుకుగా ఉంటాయి. ఆడ పురుగులు రాత్రిపూట ఆకు రెండు వైపులా 4 నుండి 5 వరుసలలో బ్యాచ్‌లలో గుడ్లు పెడతాయి. లార్వా క్రీమ్ తెలుపు మరియు పెద్ద ముదురు మచ్చలు మరియు ముదురు గోధుమ రంగు తల కలిగి ఉంటుంది. కాండాలలో మరియు కొన్నిసార్లు ఆకు తొడుగులలో ఇవి ప్యూపా దశలోకి వెళతాయి. తేమతో కూడిన వాతావరణం దీనికి అనుకూలంగా ఉంటుంది. చిమ్మటలు దాల్చిన చెక్క గోధుమ రంగులో ఉంటాయి, చిన్న వెండి తెలుపు బిందువులచే చివరన విరిగిన నల్ల మచ్చలను కలిగి ఉంటాయి. మగ చిమ్మటల ముందు భాగంలో కొన్ని లేత గోధుమ రంగు పొలుసులు మినహా వెనక రెక్కలు తెల్లగా ఉంటాయి. అడ చిమ్మటల ఆసన భాగంలో ఒతైన వెంట్రుకలు చూడవచ్చు. ఆకు తొడిమ మరియు కాడ భాగంలో 500 నుండి 800 గుడ్లు పెడతాయి. ఇవి దుమ్ము పట్టినట్టు వున్న తెలుపు రంగులో లేత ఆకుపచ్చ రంగుతో ఉంటాయి, కాని ఇవి పొదిగే సమయంలో ఎర్రగా మారతాయి. దీని లార్వా విపరీతంగా తింటుంది, నిదానంగా ఉండి, తెల్లని దేహంతో నలుపు/నారింజ రంగు తలతో ఉంటుంది, తరువాతి దశలో ఇది క్రీమ్ రంగులోకి మారుతుంది.


నివారణా చర్యలు

  • లక్షణాల కోసం మీ పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • డెడ్ హార్ట్స్ ను పురుగులతో పాటూ తొలగించి, రెండింటినీ నాశనం చేయండి.
  • పొలంలో నీరు నిలువకుండా చూడండి.
  • వీటి సహజ శత్రువులను పరిరక్షించండి.
  • ఎందుకంటే తెగులు జనాభాను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
  • తెగులు విస్తరణను తగ్గించడానికి కాంతి ఉచ్చులలో చిమ్మటలను సేకరించండి.
  • ప్రాధమిక ముట్టడిని చూపించే గుడ్డు ద్రవ్యరాశి మరియు చెరకు భాగాలను సేకరించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి