Macrodactylus subspinosus
కీటకం
ప్రభావితమైన పంటను బట్టి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. గులాబీ మొక్కల్లో వికసించే పువ్వులు ప్రభావితమవుతాయి. దీని వలన పూరేకుల్లో పెద్ద పరిమాణంలో సక్రమంగా లేని రంధ్రాలు ఏర్పడతాయి. పండ్ల చెట్లపై, ముఖ్యంగా ద్రాక్ష ఆకులను తింటాయి. చివరికి ఆకులను అస్థిపంజరంలా చేస్తాయి. అలాగే, పైతొక్క పాక్షికంగా ఒలవబడి, క్రమరహితంగా వున్న లోతు లేని ప్యాచీల వలన పండ్లు కూడా దెబ్బతినవచ్చు.
లార్వాలను చంపడానికి పరాన్నజీవి నెమటోడ్‌తో మట్టిని తడపండి. సంక్రమణ స్థాయి తీవ్రంగా ఉంటే పైరెత్రిన్ సిఫార్సు చేయబడింది.
అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మీ ద్రాక్షతోటలో ఎకరాకు 600-800 లీటర్ల నీటిలో 400 మి.లీ మలాథియాన్ 50% యి సి ను కలిపి వాడండి. అసిఫేట్, క్లోర్‌ఫైరిఫాస్, బైఫెంట్రిన్, సైఫ్లుత్రిన్ లేదా ఇమిడాక్లోప్రిడ్ కలిగి వున్న ఇతర పురుగుమందులు సిఫారసు చేయబడ్డాయి. తేనెటీగలకు హాని కలిగకుండా లేదా చనిపోకుండా ఉండడానికి పూలపై పిచికారీ చేయకండి
మాక్రోడాక్టిలస్ సబ్‌స్పినోసస్ యొక్క పెద్ద చాఫర్ వల్ల నష్టం జరుగుతుంది. ఇవి ముదురు రంగు తల మరియు పొడవాటి కాళ్లతో సన్నగా వుండే లేత ఆకుపచ్చ రంగు పెంకు పురుగులు. ఇవి 12 మిమీ పొడవు ఉంటాయి. ఆడ పెంకు పురుగు, నేల ఉపరితలం క్రింద గడ్డితో వున్న, బాగా నీరు ఇంకే ఇసుక నేలలో గుడ్లను పెడుతుంది. ఇవి గుడ్లు పెట్టడానికి తడి నేలలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. శీతాకాలమంతా లార్వా మట్టిలో గ్రబ్ లాగ జీవిస్తుంది మరియు గడ్డి వేర్లను తింటుంది. ఇది గులాబీలు, స్టోన్ ఫ్రూట్ చెట్లు, ఉదా. ద్రాక్ష, ఆపిల్, చెర్రీస్, పీచెస్, పియర్స్ మరియు మరియు ప్లమ్ పండ్లను ప్రభావితం చేస్తుంది మరియు ఇసుక నేలకు ప్రాధాన్యం ఇస్తాయి.