నిమ్మజాతి

జెయింట్ స్వాలోటైల్ గొంగళి పురుగు

Papilio cresphontes

కీటకం

క్లుప్తంగా

  • ఆకు రూపం కోల్పోతుంది.
  • ఆకులలో చాలావాటి పైన గొంగళి పురుగు తిన్న లక్షణాలు కనపడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఇవి తినడం వలన ఆకులపై ప్యాచీలు లేదా రంధ్రాల రూపంలో నష్టం కనిపిస్తుంది. లేత ఆకులను గొంగళి పురుగులు తమ ఆహారంగా ఇష్టపడతాయి. గొంగళి పురుగు మీగడ తెలుపు రంగు చిహ్నాలతో పక్షి విసర్జన పదార్థం మాదిరిగా ఉంటుంది మరియు ఇది దుర్వాసనను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద పురుగులు పువ్వులలో మకరందాన్ని తింటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లెస్పెసియా రిలే (విల్లిస్టన్), బ్రాచిమెరియా రోబస్టా, స్టెరోమలస్ కాసోటిస్ వాకర్ మరియు స్టెరోమలస్ వెనెస్సే హోవార్డ్ వంటి పరాన్నజీవి కీటకాలను తోటలో ప్రవేశ పెట్టండి. బాసిల్లస్ తురింగియెన్సిస్‌తో నర్సరీ స్టాక్ మరియు చిన్న గుంపు చెట్లను రక్షించండి. సబ్బు నీటిని ఆకులపై పిచికారీ చేయండి. పరిపక్వత చెందిన నిమ్మ జాతి చెట్లు కొన్ని ఆకుల నష్టాన్ని సులభంగా తట్టుకోగలవు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పరిపక్వత చెందిన వాణిజ్య సిట్రస్ చెట్లు లార్వా సంక్రమణను తట్టుకోగలవు, అందువలన రసాయన నియంత్రణ పద్ధతుల అవసరం చాలా తక్కువ లేదా అవసరం లేదు.

దీనికి కారణమేమిటి?

జెయింట్ స్వాలోటైల్ గొంగళి పురుగు తినడం వల్ల నష్టం జరుగుతుంది. ఆడ పురుగులు మొక్కల ఆకుల ఉపరితలంపై ఒక్కొక్కటిగా గుడ్లు పెడతాయి. సాధారణంగా గుడ్లు చిన్నగా, గోళాకారంలో మరియు క్రీమ్ నుండి గోధుమ రంగులో ఉంటాయి. గొంగళి పురుగులు పక్షి విసర్జన పదార్ధాలను పోలి ఉండి, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. శరీరం మధ్యభాగం చుట్టూ మీగడ తెలుపు రంగు గుర్తులు ఉంటాయి. పెద్ద సీతాకోకచిలుక చాలా పెద్దగా ఉంటుంది. ఇది పసుపురంగు చిహ్నాలతో ముదురు గోధుమ రంగు రెక్కలను కలిగి ఉంటుంది. వీటిలో రెక్కల మీదుగా పెద్ద క్షితిజ సమాంతర పసుపు రంగు చార ఉంటుంది. ఇవి సాధారణంగా 4 నుండి 6 అంగుళాల పరిమాణంలో ఉంటాయి.


నివారణా చర్యలు

  • చిన్న చెట్లపై గుడ్లు మరియు గొంగళి పురుగులు కనిపిస్తే వాటిని నాశనం చేయండి.
  • పువ్వులు మరియు పండ్ల దిగుబడిని కాపాడటానికి ఆకుల నుండి లార్వాలను చేతితో తొలగించండి.
  • ఇటీవలే విచ్చుకున్న లేత రంగు ఆకులను గమనిస్తూ వుండండి.
  • ఎందుకంటే ఆడ జెయింట్ స్వాలోటెయిల్స్ వాటిపై గుడ్లు పెట్టడానికిఇష్టపడతాయి.
  • పరిపక్వత చెందిన సిట్రస్ చెట్లు కొన్ని ఆకుల నష్టాన్ని సులభంగా తట్టుకోగలవు, అందువలన ముందుగా నాటడం సిఫార్సు చేయబడింది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి