Apriona cinerea
కీటకం
పెద్ద పెంకు పురుగు రెమ్మల బెరడును తింటుంది. తెగులు సోకిన కాండం పైన గుడ్డు పెట్టడం వలన ఏర్పడిన మచ్చ (ఓవిపోసిషన్) చాలా సృష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా, పెద్ద చెట్ల ప్రతి కొమ్మపై ఒక నెలవంక ఆకారపు మచ్చ ఉంటుంది. బెరడు క్రింద ఉన్న గ్యాలరీలు (జిగ్జాగ్ బొరియలు) మరియు చెక్కలోని సొరంగాలు లార్వా ఉనికిని తెలుపుతాయి. చిన్న మొక్కల్లో, గుడ్లు పెట్టె స్థితిలో వున్న రంధ్రాల నుండి జిగురు స్రవిస్తుంది మరియు బెరడులో లార్వా సొరంగాలను చూడవచ్చు. బెరడు క్రింద గ్యాలరీలు తరువాత చెక్కలో సొరంగాలు ఉండటం ద్వారా లార్వా కార్యకలాపాలు గుర్తించబడతాయి. పరిపక్వత చెందిన మొత్తం చెట్లలోకి లార్వా ప్రవేశించినప్పుడు మలపదార్ధ బహిష్కరణ రంధ్రాలు ఒకదాని దగ్గరకు మరొకటి వరుసగా దగ్గరగా ఉంటాయి. చిన్న మొక్కల్లో, ఈ లార్వా వేర్లలోకి సొరంగం చేయవచ్చు. సాధారణ మల పదార్ధ బహిష్కరణ రంధ్రాలు ఉండటం వలన ఇతర గొంగళి పురుగులతో పోలిస్తే ఎ. సినీరియా యొక్క లార్వాను గుర్తించడం సులభం.
స్టియెర్నెర్మా ప్రవాస్సోస్ మరియు హెటెరోరాబ్డిటిస్ యస్ పి పి వంటి పరాన్నజీవి నెమటోడ్లను మరియు నియోప్లెక్టానా నెమటోడ్లు, ఎలాట్రిడ్ బీటిల్ మరియు బ్యూవేరియా బస్సియానా వంటి వీటి సహజ శత్రువులను ఉపయోగించండి. శారీరక రక్షణ లేదా చికిత్స (కలప కోసం వేడి లేదా వికిరణంతో లేదా కలప చిప్స్ కోసం 3 సెం.మీ కంటే చిన్న పరిమాణానికి కత్తిరింపులు). ఐ ఎస్ పి ఏం 15 ప్రమాణాల ప్రకారం కలప ప్యాకేజింగ్ మెటీరియల్ ను చికిత్స చేయండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్పటి వరకూ ఈ కీటకం వలన కలిగే నష్టానికి వ్యతిరేకంగా రసాయన నియంత్రణ పద్ధతులు అభివృద్ధి చేయబడలేదు. క్రిములను చంపడానికి.10 మి.లీ మోనోక్రోటోఫాస్ 36 డబ్ల్యు ఎస్ సి ని ఇంజెక్ట్ చేసి తడి బంకమట్టితో రంధ్రాన్ని మూసివేయండి.
చిన్న క్రిములు మరియు పెద్ద కాండం తొలిచే పురుగుల వలన నష్టం జరుగుతుంది, అయినప్పటికీ, చిన్న క్రిములు మరింత వినాశకరమైనవి. చిన్న క్రిములు ముదురు గోధుమ రంగు చదునైన తలతో లేత పసుపు రంగులో ఉంటాయి. పెద్ద పురుగులు మొదలు వద్ద అనేక నల్లని పొక్కులు కలిగి లేత బూడిద రంగులో ఉంటాయి. కొమ్మలపై లేదా ప్రధాన కాండం పైన ఇవి గుడ్లు పెడతాయి. 5-7 రోజుల తరువాత, లార్వాలు కాండంలోకి చొచ్చుకు పోయి పైకి సొరంగాలు చేసి ఒక క్రమమైన పద్దతిలో రంధ్రాలను సృష్టిస్తాయి. దీని ద్వారా మల పదార్ధం బయటకు వస్తుంది. వీటి లార్వా ఒక కాళ్ళు లేని, క్రీమి తెల్లని రంగుతో పొడవుగా మరియు స్థూపాకార ఆకారంలో ఉంటుంది. ఆడ పురుగులు నమిలిన ఓవిపోసిషన్ పగుళ్లలో బెరడు కింద గుడ్లు పెడతాయి. ఇవి 5-7 రోజుల తరువాత పొదగబడతాయి. లార్వా పెరుగుదల యొక్క ప్రారంభ దశలలో, మల పదార్ధం బహిష్కరణ రంధ్రాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, కానీ అవి పరిపక్వం చెంది పరిమాణంలో పెరిగేకొద్దీ, పెద్ద మల బహిష్కరణ రంధ్రాలు ఏర్పడతాయి. ఇవి ఒకదానికి మరొకటి దూరంగా ఉంటాయి.