క్యాబేజీ

క్యాబేజీ లీఫ్ వెబ్బర్

Crocidolomia binotalis

కీటకం

క్లుప్తంగా

  • ఆకుల్లో రంధ్రాలు ఏర్పడతాయి.ఆకులపై మరియు క్యాబేజీ మధ్యలో గొంగళి పురుగుల మలం కనిపిస్తుంది.
  • బూడిద-గోధుమరంగు చిమ్మటలు నల్లని మచ్చ మరియు ముందు రెక్కలపై లేత గోధుమరంగు గజిబిజి గీతలను కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్

క్యాబేజీ

లక్షణాలు

ప్రారంభ లక్షణాలు ఆకుల చుట్టూ చుట్టబడినట్టు వున్న పట్టు లాంటి గూళ్ళ ద్వారా వర్గీకరించబడతాయి. ఇవి తిన్న నష్టాన్ని ఆకులపై చూడవచ్చు. ఈ పురుగులు ఆకులను అస్థిపంజరం వలే చేస్తాయి. తరచుగా క్యాబేజీ లోపలి ఆకులు దెబ్బతింటాయి. ఇవి పూమొగ్గలను తింటాయి మరియు వాటికి రంధ్రాలు చేస్తాయి. క్యాబేజీల ఆకులు మరియు మధ్యభాగంలో గొంగళి పురుగులు విసర్జిస్తాయి. ఆకుల దిగువ భాగంలో గుడ్లు కనిపిస్తాయి. ఆకులు దెబ్బతినడం వల్ల ప్రభావిత మొక్కల ఆరోగ్యం క్షీణిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

నష్టం కనిపించిన వెంటనే బాసిల్లస్ తురింజెన్సిస్‌ను వాడండి (సాయంత్రం సమయాల్లో వాడాలి) గొంగళి పురుగులు పురుగుమందులను తినేలా చేయడం ద్వారా వాటిని చంపే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా చల్లడం ద్వారా మొక్కలను పూర్తిగా కప్పండి. గుడ్లపై బిటి పనిచేయదు, కానీ పూర్తిగా పెరిగిన వాటి కంటే చిన్న లార్వా పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 15 లీటర్ల నీటికి ఒక లీటర్ చొప్పున తాజా వేప, నిమ్మ గడ్డి, అల్లం లేదా ఇతర బొటానికల్ పురుగుమందులను వాడండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విస్తృత శ్రేణి పురుగుమందులను (పెరిథ్రాయిడ్లు మరియు ఆర్గానోఫాస్ఫేట్లు వంటివి) వాడటం మానుకోండి ఎందుకంటే అవి వీటి సహజ శత్రువులను చంపుతాయి. ఫోసలోన్, ఫెన్వాలరేట్, సైపర్‌మెత్రిన్ లేదా డెల్టామెత్రిన్ వంటి పురుగుమందులను పిచికారీ చేయండి. ఇలాంటి చర్యతో పురుగుమందులను మరలా వాడకండి.

దీనికి కారణమేమిటి?

క్రోసిడోలోమియా బైనోటాలిస్ యొక్క లార్వా వలన నష్టం జరుగుతుంది. ఈ లార్వా చాలా అరుదుగా మొలకలపై దాడి చేస్తుంది కాని మొక్క అన్ని దశలలోనూ తింటుంది. ఇవి బైట ఆకుల దిగువ భాగంలో 40 నుండి 100 సమూహాలలో గుడ్లు పెడతాయి. ఇవి మొదట పాలిపోయిన ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. తరువాత పొదగడానికి ముందు ప్రకాశవంతమైన పసుపు మరియు గోధుమరంగులోకి మారతాయి. కొత్తగా పొదిగిన గొంగళి పురుగు లార్వా సుమారు 2 మి.మీ పొడవు ఉంటుంది మరియు ఇవి పరిపక్వత చెందినప్పుడు పొడవాటి వెంట్రుకలతో 20 మి.మీ వరకు పెరుగుతాయి. తరువాతి దశలలో, ఇవి ఆకులపై మందపాటి గూళ్ళను తయారు చేస్తాయి మరియు గొంగళి పురుగులు వాటి క్రింద భాగంలో తింటాయి. సాధారణంగా ఇవి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి మరియు ప్రారంభ దశల నుండి పంటకోత కాలం వరకు పంటలకు సంక్రమిస్తాయి. ఇది ముల్లంగి, ఆవాలు, ఎర్ర ముల్లంగి మరియు ఇతర క్రూసిఫర్‌లకు కూడా సంక్రమిస్తుంది. క్యాబేజీ పైన ఉండే వీటి విసర్జన పదార్ధాలు, ఈ కూరగాయలను తినడానికి పనికిరాకుండా చేస్తాయి.


నివారణా చర్యలు

  • తెగుళ్లు లేని విత్తనాలను మాత్రమే నాటడానికి వాడండి.
  • గుడ్ల గుంపు మరియు చిన్న గొంగళి పురుగుల కోసం నర్సరీలో మొలకలని తనిఖీ చేయండి.
  • అవి దొరికినట్లైతే ఆకులు లేదా మొత్తం మొక్కను తీసివేసి వాటిని నాశనం చేయండి.
  • ఆవాలు (బ్రాసికా జున్సియా) లేదా చైనీస్ క్యాబేజీని ఒక ఉచ్చు పంటగా వాడండి.
  • క్యాబేజీలను నాటడానికి 15 రోజుల ముందు ఆవ మొక్కల యొక్క మొదటి వరుసను నాటండి, నాటిన 25 రోజుల తరువాత రెండవ వరుసను నాటండి.
  • వలలను ఉపయోగించి గొంగళి పురుగులను పట్టుకోండి మరియు క్రిములు జొరబడని మెష్ లేదా ఉన్నితో మొక్కలను కప్పండి.
  • పంట ఎదిగేకాలంలో ప్రతి రోజూ అనుమానాస్పద మొక్కలను పరిశీలించి, కనిపించిన గుడ్లు లేదా గొంగళి పురుగులను తొలగించండి.
  • మొక్కలో గొంగళి పురుగులతో చుట్టుకుపోయిన ఆకులను తొలగించి నాశనం చేయండి.
  • పంటకోత తర్వాత, వెంటనే పంట అవశేషాలను నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి