Batocera rufomaculata
కీటకం
ఇవి కొమ్మల బెరడును కొరుకుతాయి మరియు ఎదుగుతున్న చిగుర్లను నమిలి తింటాయి. బెరడు ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. తెగులు తీవ్రత అధికంగా ఉంటే చెట్టు బాగా బలహీనంగా మారి కొమ్మలు విరిగిపోవచ్చు లేదా ప్రధాన కాండం కూలిపోతుంది. కొమ్మలు లేదా మొత్తం చెట్టు కూడా ఎండిపోయినట్టు కనబడవచ్చు. బైటకు తోయబడిన మల పదార్ధాన్ని బెరడు పగుళ్లలో లేదా చెట్టు మొదలు వద్ద చూడవచ్చు. చెట్టు బెరడులోని నిష్క్రమణ రంధ్రాలు ఈ ముట్టడికి సూచికలు. ఈ వ్యాధి వలన ఆకులు మరియు పండ్ల ఉత్పత్తి కూడా ప్రభావితమవుతుంది మరియు దిగుబడి నష్టానికి దారితీస్తుంది. ప్రారంభంలో చెట్టు యొక్క ఉప-వల్కలం లోకి ప్రవేశించి తరువాత చెట్టులోకి లోతుగా వెళ్లే లార్వా వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. పెద్ద పురుగులు ఆకుపచ్చ పెరుగుతున్న చిగుర్లను మరియు కొమ్మల బెరడులను నమలుతాయి. చిన్న పురుగులు కాండం లేదా కొమ్మల పై బెరడుకు సక్రమంగా లేని రంధ్రాలు చేస్తాయి. ఇవి నాళ సంబంధిత కణజాలాలను ఆహారంగా తింటాయి మరియు దీని ఫలితంగా కణజాలంపై పోషకాలు మరియు నీటి రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రారంభ దశలో చివరి చిగుర్లు చనిపోతాయి. వీటి మలపదార్ధం అనేక పాయింట్ల నుండి స్రవిస్తుంది మరియు కొన్ని సమయాల్లో రంధ్రాల నుండి కణజాల ద్రవం బయటకు వస్తుంది. లేత మొక్కల విషయంలో లేదా లేదా ఒకే చెట్టుపై ఎక్కువ క్రిములు ఉంటే కొమ్మలు లేదా మొత్తం చెట్టు వాలిపోతుంది.
తెగుళ్ల జనాభాను నియంత్రించడానికి మెటార్జిజియం అనిసోప్లియా లేదా బీవేరియా బస్సియన్నాను ఉపయోగించవచ్చు.
అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పెద్ద పెంకు పురుగులను గుర్తించినప్పుడు, కాండం, కొమ్మలు మరియు బహిర్గతమైన వేర్లపై ఆర్గానోఫాస్ఫేట్లు వంటి పురుగుమందులను వాడాలి. ప్రవేశ రంధ్రాలను శుభ్రపరచండి మరియు వాటిని డైక్లోర్వోస్ (0.05%) లేదా కార్బోఫ్యూరాన్ (3 G రంధ్రానికి 5 గ్రాముల చొప్పున ) ఎమల్షన్‌లో ముంచిన దూదితో నింపి వాటిని బురదతో నింపండి. బొరియలలో దాక్కున్న పెద్ద లార్వాలను అస్థిర ద్రవం లేదా ఫ్యూమిగెంట్ ఇంజెక్షన్ ద్వారా అవి వున్న చోటే చంపవచ్చు. నేలమట్టం నుండి కాండం మీద ఒక మీటర్ ఎత్తు వరకు బోర్డియక్స్ పేస్ట్ రాయండి, ఇది గుడ్డు పెట్టడాన్ని నిరోధిస్తుంది. దూదిలో ముంచిన మోనోక్రోటోఫాస్‌తో పాడింగ్ (36 డబ్ల్యు ఎస్ సి 10 మీ.లీ 2.5 సెం.మీ/చెట్టుకు) చేయండి. ముట్టడి ఎక్కువగా ఉంటే చెట్టు కాండంపై కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ రాయండి.
బాటోసెరా రుఫోమాక్యులాటా యొక్క లార్వా మరియు తర్వాతి దశ వల్ల నష్టం జరుగుతుంది. ఇవి 25-55 మిమీ పొడవు ఉండి పొడవైన యాంటెన్నా కలిగివుంటాయి. ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. ఆడ పెంకు పురుగు దెబ్బతిన్న లేదా ఒత్తిడికి గురైన చెట్ల బెరడును కత్తిరించి ఆ ప్రాంతాల్లో గుడ్లు పెడుతుంది. ప్రత్యామ్నాయంగా, నేల కోతకు గురై బహిర్గతమైన వేర్లలో ఇవి గుడ్లు పెడతాయి. లార్వా, ప్రధాన కాండం, పెద్ద కొమ్మలు లేదా బహిర్గతమైన వేర్ల బెరడు కింద తింటాయి. తరువాతి లార్వా దశలో ఇవి కూడా చెక్కలోకి లోతుగా రంధ్రాలు చేసి అక్కడ ప్యూపా దశకు చేరుకుంటాయి. పెద్ద పురుగులు నిష్క్రమణ రంధ్రం నుండి బైటకి వచ్చి కొమ్మల బెరడు మరియు పెరుగుతున్న చిగుర్లను తింటాయి. పెద్ద పురుగులు 3-5 సెం.మీ. పొడవు ఉండి, బూడిద గోధుమ రంగులో, థొరాక్స్ కు రెండు ప్రక్కలా రెండు కిడ్నీ ఆకారంలో నారింజ-పసుపు మచ్చలు ఉంటాయి. పూర్తిగా పెరిగిన లార్వా ముదురు గోధుమ రంగు తలతో క్రీమ్ రంగులో ఉంటుంది మరియు 10 సెం.మీ పొడవు ఉంటుంది. లార్వా వృద్ధి చెందడానికి తరచుగా ఒక సంవత్సరానికి పైగా పడుతుంది. లార్వా, బెరడు పైపొర నుండి రంధ్రం చేస్తుంది మరియు వీటి పరిమాణం కారణంగా పెద్ద సొరంగాలు, ఆకులు మరియు పండ్ల ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇవి కాండంలో ప్యూపా దశకు చేరుకుంటాయి. వేసవి చివరిలో పెద్ద పెంచు పురుగులు బైటకు వస్తాయి.ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. ఇవి చాలా నెలలు జీవించగలవు మరియు ఎక్కువ దూరం ఎగరగలవు. దీనివలన ఇవి చెదిరిపోవడానికి వీలు కలుగుతుంది. ఈ తెగులు ఒక తరాన్ని మాత్రమే కలిగివుంటుంది.