దోసకాయ

ఎర్ర గుమ్మిడి పెంకు పురుగు

Aulacophora foveicollis

కీటకం

క్లుప్తంగా

  • ఆకులపై ఈ పురుగులు తినడం వలన పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి.
  • వేర్లపైన మరియు భూమి లోపల వున్న కాండం పైన లోతైన రంధ్రాలు మరియు కాండం కుళ్ళిపోవడం మరియు వాలిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

9 పంటలు

దోసకాయ

లక్షణాలు

పెద్ద పురుగులు కీటకాలు ఆకులు, పువ్వులు మరియు పండ్లను విపరీతంగా తింటాయి. ఇవి మొక్కల కణజాలాలలో (ఈనెల మధ్య) పెద్ద రంధ్రాలను చేస్తుంది. దీనివల్ల ఎదుగుదల తగ్గి చివరికి మొక్క చనిపోతుంది. లేత మొలకలను దీని వలన అపారమైన నష్టం కలుగుతుంది. దీనివలన పంట ఆలస్యంగా పరిపక్వత చెందుతుంది. పువ్వులు ప్రభావితమైతే, అది పండ్లు ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. వీటి యొక్క చిన్న పిల్ల పురుగులు మట్టిలో ఉండి మొక్కల వేర్లు మరియు భూగర్భ కాండాన్ని తింటాయి. దీని వలన కాండం మరియు వేర్లు కుళ్ళిపోతాయి మరియు వాలిపోతాయి. పెద్ద పురుగులు మొలకలను తినడం వలన ఎదుగుదల తగ్గి చివరికి మొక్క చనిపోతుంది. దాని వలన పొలంలో ఖాళీ జాగాలు ఏర్పడతాయి. ఇవి కొన్నిసార్లు మొత్తంగా కలసి పాత మొక్కల ఆకులను ముక్కలుగా కోరుకుతాయి. పూలకు కూడా కొంత నష్టం కలుగుతుంది. ఫలితంగా పండ్లు తయారవ్వడం తగ్గుతుంది. పెద్ద పురుగులు తినడం వలన లేత పండ్ల దిగువ భాగాలపైన మచ్చలు ఏర్పడతాయి. దీని వలన కుళ్లడానికి కారణమయ్యే సూక్ష్మ జీవులు చొరబడతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

టాచినిడ్ కుటుంబం మరియు రిడ్యూవిడ్ రైనోకోరిస్ ఫస్సిప్‌లతో సహా సహజ శత్రువులు ఈ పెంకు పురుగులపై దాడి చేస్తారు. 4 లీటర్ల నీటిలో సగం కప్పు కలప బూడిద మరియు అర కప్పు సున్నం కలపండి, కొన్ని గంటలు వదిలివేయండి. మీ పొలంలో ఉపయోగించే ముందు దీనిని వడకట్టి ఈ మిశ్రమాన్ని తెగులు సోకిన కొన్ని మొక్కలపై పరీక్షించండి. ఈ మిశ్రమాన్ని మీ పంటపై ఆకుల పిచికారీగా ఉపయోగించండి. ప్రత్యామ్నాయంగా, మీరు వేప (NSKE 5%), డెరిస్ లేదా పైరెథ్రమ్ (దీనితో సబ్బును కలపండి.) వంటి మొక్కల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులను 7 రోజుల విరామంతో ఉపయోగించవచ్చు . ట్రైసిడెర్మా ట్రైకోడెర్మాను విత్తనం మరియు నర్సరీ లోనూ మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్‌ను విత్తనం, నర్సరీలో మరియు మట్టి పైనా ఉపయోగించండి. పెద్ద పెంకు పురుగులను ఆకర్షించడానికి మరియు చంపడానికి బలమైన పురుగుమందుల పిచికారీ చేసిన ఉచ్చు పంటలను ఉపయోగించండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నర్సరీలో 1 పెద్ద పురుగు/10 మొక్కలను గుర్తించినప్పుడు ఒక ఎకరానికి 250 మి.లీ డెల్టామెత్రిన్ ఉపయోగించవచ్చు. సింథటిక్ పైరెథ్రాయిడ్లు ప్రభావవంతంగా ఉంటాయి కాని అదే సమయంలో సహజ శత్రువులకు హానికరం. బలమైన పురుగుమందుల పిచికారీ వాడిన ఉచ్చు పంటలు వాడడం వలన పెద్ద పెంకు పురుగులను ఆకర్షించి చంపగలదు. తెగులును గుర్తించిన వెంటనే ఫెనిట్రోథియాన్‌ను పిచికారీ చేసి, 15 రోజుల వ్యవధిలో మరలా పునరావృతం చేయండి.

దీనికి కారణమేమిటి?

అప్పుడే పుట్టిన పిల్ల పురుగులతో పాటు అలకోఫోరా ఫోవికోల్లిస్ యొక్క పెద్ద పెంకు పురుగుల వలన నష్టం జరుగుతుంది, ఇవి ఆకులు, పువ్వులు మరియు పండ్లను తింటాయి. సాధారణంగా పూర్తిగా పెరిగిన లార్వా క్రీము తెలుపు రంగులో ఉండి మనిషి వేళ్ళ గోరు పరిమాణంలో ఉంటాయి. గుడ్లు కోలగా పసుపు రంగులో ఉంటాయి మరియు మొక్క మొదలు దగ్గర మనిషి వేలు అంత లోతులో తేమతో కూడిన మట్టిలో 10 గుడ్ల సమూహాలలో పెడతాయి. పెద్ద పురుగులు నారింజ-ఎరుపు మరియు ఇంట్లో వుండే ఈగల వలె ఉంటాయి. లార్వా 1 లేదా 2 వారాల తరువాత పొదుగుతుంది మరియు మట్టిలోకి వెళ్లి ప్యుపాగా రూపాంతరం చెందే ముందు మొక్క మరియు దాని వేర్లపై దాడి చేస్తుంది. 7 నుండి 17 రోజుల వరకు మట్టి గూడులో ప్యూపా దశలో ఉంటుంది. ఉష్ణోగ్రత 27-28°C ప్యూపా దశకు సరైన పర్యావరణ పరిస్థితులు.


నివారణా చర్యలు

  • త్వరితంగా ఎదిగే రకాలను ఉపయోగించండి, ఉచ్చు పంటలను వాడండి.
  • ఇప్పటికే తెగులు సోకిన పంటల పక్కన కొత్త పంటలను నాటకండి.
  • తీవ్రంగా తెగులు సోకిన మొక్కలను భర్తీ చేయడానికి అదనంగా విత్తనాలను నాటండి.
  • పెంకు పురుగుల వలన దెబ్బతినకుండా కాపాడటానికి మొలకలను పాలిథిన్ సంచులతో కప్పండి.
  • ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు గడుల నీటి పారుదలని ఉపయోగించి తగినంత పోషకాలు, ఎరువులు మరియు నీరు వంటి మంచి పరిస్థితులను కల్పించండి.
  • ఇవి తినడం వలన కలిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి వారానికి ఒకసారి పొలాన్ని పర్యవేక్షించండి మరియు అంటుకునే పసుపు ఉచ్చులను వాడండి.
  • మీ పొలంలో ప్రత్యామ్నాయ అతిధి కలుపు మొక్కలు లేకుండా చూడండి.
  • పంట అవశేషాలను సేకరించి కాల్చివేయండి లేదా పాతిపెట్టండి.
  • ఉదయం సమయంలో పెంకు పురుగులు మందగించి వున్నప్పుడు వాటిని చేతులతో తొలగించండి.
  • నిద్రాణస్థితి దశకు భంగం కలిగించడానికి మరియు వాటిని బహిర్గతం చేయడానికి పొలాన్ని వేసవిలో లోతుగా దున్నండి.
  • వీటిని వేటాడి తినే పురుగుల్ని మరియు పరాన్నజీవులను సంరక్షించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి