శనగలు & సెనగ పప్పు

హెలికోవేర్పా గొంగళి పురుగులు

Helicoverpa armigera

కీటకం

క్లుప్తంగా

  • ఈ గొంగళి పురుగులు తినడం వలన పండ్లు, మొగ్గలు, ప్రత్తి కాయలు మరియు పువ్వులపై మరియు అప్పుడప్పుడు ఆకులపై రంధ్రాలు మరియు మల పదార్ధం కనిపిస్తాయి.
  • విత్తనాలు లేదా గింజలు మొత్తం తినివేయబడతాయి.
  • దీనివలన పంట దిగుబడి మరియు నాణ్యత బాగా తగ్గిపోతుంది.
  • ఇతర సూక్ష్మ జీవులు సోకడం వలన కణజాలం మరియు పండ్లు కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు

29 పంటలు
బార్లీ
చిక్కుడు
కాకరకాయ
క్యాబేజీ
మరిన్ని

శనగలు & సెనగ పప్పు

లక్షణాలు

మొక్కల పైభాగాన పువ్వుల నిర్మాణాలు, లేత ఆకులు చుట్టూ గుంపులు గుంపులుగా తెల్లని రంగు నుండి గోధుమ రంగు గుడ్లు చూడవచ్చు. వీటి లార్వా మొక్కల ఏ భాగాన్ని అయినా తింటాయి కానీ ఇవి ఆశించిన మొక్కల రకాన్ని బట్టి ఇవి పువ్వులను మరియు కాయలు/కంకులు/పండ్లు/ మొగ్గలను బాగా తింటాయి. చిన్న లార్వా ఆకులపైనా, ఎదిగే భాగాలపైనా లేదా పండ్ల నిర్మాణాలపైన గీరి కొద్ది మొత్తంలో నష్టం కలుగచేస్తుంది. పెద్ద లార్వా పూవులు లేదా లేత కాయలు/కంకులు/పండ్లు/మొగ్గల లోపలకు రంధ్రాలు చేసి లోపల వున్న మొత్తం పదార్ధాన్ని తొలగిస్తుంది. దీనివలన గింజలకు నష్టం ఏర్పడి అమ్మడానికి పనికిరాకుండా అయిపోతాయి. ఈ రంధ్రాల చుట్టూ మల పదార్ధం కనిపిస్తుంది. దీనివలన ఇతర సూక్ష్మ క్రిములు ఈ ప్రాంతంలో చేరి దెబ్బతిన్న కణజాలం కుళ్లిపోతుంది. హెచ్. ఆర్మీగెరా వలన పంటల దిగుబడికి చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పుష్పించే దశలో ఈ కీటకాల గుడ్లపై దాడిచేయడానికి ట్రైకొగ్రామ్మా కందిరీగలు ( T చిలోనిస్ లేదా T బ్రాసిలయన్సిస్) ను ఉపయోగించవచ్చు. మైక్రోప్లిటిస్, హెటేరోపెల్మా మరియు నేటాలియా కందిరీగలు ఈ లార్వాలపై పరాన్న జీవులుగా ఉంటాయి. వీటిని వేటాడి తినే (బిగ్ ఐ బగ్, గ్లాసి షీల్డ్ బగ్, మరియు స్పైన్డ్ ప్రెడేటరీ షీల్డ్ బగ్) చీమలు, సాలీడ్లు, కుమ్మరి పురుగులు, మిడతలు మరియు ఈగలు ఈ లార్వాపై దాడి చేస్తాయి. అందువలన పొలంలో ఈ కీటకాలను ప్రోత్సహించాలి. స్పైనోసాడ్ న్యూక్లియో పోలీహెడ్రోవైరస్ (NPV), మెటార్జియం అనిసోప్లై బెయువేరియా బస్సియన లేదా బాసిల్లస్ తురింగియాన్సీస్ లాంటి జీవ కీటక నాశినులు కలిగిన ఉత్పత్తులను ఈ లార్వాను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. మొగ్గలు ఏర్పడే దశలో మొక్కలకు సంబంధించిన పదార్ధాలైన వేప నూనె, వేప గింజల కాషాయం (NSKE 5%), మిర్చి లేదా వెల్లుల్లి పదార్ధాలను కూడా ఆకులపై పిచికారీగా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పంటకు మేలు చేకూర్చే కీటకాలకు నష్టం కలగకుండా ఈ కీటకాలను నశింపచేయడానికి, కొన్ని ఎంపిక చేసుకున్న కీటక నాశినులను వాడడం మంచిది. ఈ గొంగళి పురుగులు పురుగు మందులకు చాలా నిరోధకతను కలిగి ఉంటాయి. అందువలన వీటి గుడ్లను మరియు లార్వాను గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. క్లొరాన్త్రనిలిప్రోల్ , క్లోరోఫెరిఫోస్, సైపర్మేత్రిన్ ఆల్ఫా మరియు జెటా సైపర్మేత్రిన్ ఏమామెక్టిన్ బెంజోయెట్, ఏసఫిన్వాలరెట్, ఫ్లూబెండయమైడ్, మేథోమిల్ లేదా ఇండొక్సాకార్బ్ లను ఉపయోగించవచ్చు. (సాధారణంగా ఒక లీటర్ నీటిని 2.5 మి.లీ). పుష్పించే దశ లో మొదటిసారి ఒకసారి తర్వాత ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఈ మందులను పిచికారీ చేయాలి. తక్కువ విలువ కలిగిన పంటలపైనా పురుగు మందులు ఉపయోగించడం వలన లాభం ఉండదు.

దీనికి కారణమేమిటి?

ఈ నష్టం హెలికోవేర్పా ఆర్మీగెరా అనే కీటకం వలన కలుగుతుంది. వ్యవసాయంలో హెచ్. ఆర్మీగెరా ఒక విధ్వంసకర తెగులు. ఇది చాలా రకాల పంటలను ఆశిస్తుంది. ఇవి లేత గోధుమ రంగులో ఉండి మూడు నుండి నాలుగు సెంటీమీటర్ల వెడల్పు రెక్కలు కలిగివుంటుంది. సాధారణంగా ఇవి ముదురు రంగులో మచ్చలతో కూడిన పసుపు నుండి నారింజ రంగు లేదా గోధుమ రంగు ముందు రెక్కలు కలిగి ఉంటుంది.వెనక రెక్కలు తెల్లని రంగులో ఉండి ముదురు ఈనెలను కలిగి ఉంటుంది. ఈ రెక్కల క్రింది అంచులపై పొడవైన ముదురు మచ్చలను కలిగి ఉంటుంది. ఆడ కీటకాలు పువ్వులపై, లేదా ఆకు పైన , ముఖ్యంగా మొక్కల పైభాగంలో వుండే ఆకులపై, గోళాకారపు తెల్లని గుడ్లను ఒకొక్కటిగా కానీ గుంపుగా కానీ పెడుతుంది. పరిపక్వదశను బట్టి వీటి లార్వా ఆలివ్ పచ్చ నుండి ఎర్రని ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటి శరీరంపైన నల్లని చిన్న చిన్న చుక్కలు ఉండి ఇవి ముదురు రంగు తలను కలిగి ఉంటాయి. పరిపక్వత తరువాత దశలలో ప్రక్కన మరియు వెనక వైపున చారలు మరియు పట్టీలు ఏర్పడతాయి. ఇవి పక్వ దశ పూర్తి చేసుకున్నప్పుడు మట్టిలో ప్యూపాగా రూపాంతరం చెందుతాయి. పండ్లు/ మొగ్గలు/ కాయలు వృద్ధి చెందే సమయాలలో వీటి జనాభా చాలా అధికంగా వృద్ధి చెంది ఉంటుంది. దీనివలన పంటకు అధిక మొత్తంలో దిగుబడి నష్టం కలుగుతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు సోకని మొక్క రకాలను వాడండి.
  • సీజన్లో ముందుగా పంట వేసి ఈ పురుగుల జనాభా బాగా వృద్ధి చెందక ముందే పంట కోతకు వచ్చేటట్టు ప్రణాలళికను రూపొందించుకోండి.
  • మొక్కల మధ్యన సరైన అంతరాన్ని పాటించండి.
  • పొలం మధ్యలో కొంత జాగాను ఖాళీగా వదిలి వీటి జీవిత చక్రానికి విరామం వచ్చేటట్టు చూడండి.
  • పక్షులు వాలడానికి కర్రలను ఏర్పాటు చేసి ఈ పురుగులను తినే పక్షులను ఆకర్షించండి ప్రతీ ఐదు నుండి ఆరు వరసల మధ్యన మేరీగోల్డ్ (టాగిటస్ ఎరేక్టా ) మొక్కలను వేయండి.
  • ఈ పురుగులను గమనించడానికి కాంతి లేదా లింగాకర్షక బుట్టలను ఏర్పరచి వీటిని పెద్ద మొత్తంలో పట్టుకోండి.
  • నీటి ఎద్దడి లేకుండా చూడండి.
  • పొలంలో సరైన మురుగు నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోండి.
  • మొక్కలను తరుచూ గుడ్లు మరియు దెబ్బతిన్న పువ్వులు, పండు మొగ్గలు, లేదా కాయల కోసం గమనిస్తూ వుండండి.
  • చేతులతో వీటి లార్వాను, మరియు వీటి గుడ్లు వున్నఆకులను మొక్కలను తొలగించండి.
  • పొలంలో కలుపు మొక్కలను తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • పొలాన్ని బాగా లోతుగా దున్ని వీటి లార్వా సూర్యరశ్మి మరియు వీటి సహజ శత్రువులైన కీటకాలకు బహిర్గతం అయ్యేటట్టు చూడండి.
  • పొలంలో ఎల్లప్పుడూ ఒకే రకం పంటను వేయకుండా పంట మార్పిడి పద్దతులను పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి