సోయాబీన్

బీట్ ఆర్మీవార్మ్

Spodoptera exigua

కీటకం

క్లుప్తంగా

  • ఈ గొంగళి పురుగులు రాత్రి పూట ఆహరం తింటాయి.
  • ఇవి గుంపుగా ఏర్పడి ఆకులను తింటాయి.
  • లేత మొలకలు చనిపొవఛు.
  • తెగులు తీవ్రత తక్కువగా ఉంటే ఎదిగిన మొక్కలు మరల తిగి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.
  • వీటికి వున్న అనేక సహజ శత్రువులు వీటిని నియంత్రించడంలో సహాయపడతాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు

సోయాబీన్

లక్షణాలు

ప్రారంభంలో చిన్న లార్వా గుంపుగా మొక్కల క్రింది భాగంలో వున్న ముదురు ఆకుల క్రింది భాగంలో తినడం ప్రారంభిస్తాయి. పెద్ద లార్వా ఒకొక్కటిగా విడిపోయి మొత్తం పంట అంతా విస్తరించి ఆకులపైన ఒక క్రమంగా లేని రంద్రాలను ఏర్పరుస్తాయి. పరిపక్వత చెందిన లార్వా చిన్న మొక్కల ఆకులు మొత్తం తింటాయి లేదా ఆకుల ఈనెలను మాత్రం వదిలిపెడతాయి. ఇవి తినడానికి ఆకులు దొరకనట్లైతే ఇవి కాయలపైన కూడా దాడి చేస్తాయి. కానీ ఇవి కాండాన్ని మాత్రం తినవు. సాధారణంగా ఇవి రాత్రి సమయంలో ఆకులను తింటాయి. పగటి పూట ఇవి మట్టిలో కానీ లేదా నీడగా వున్న, తడిగా వున్న మొక్క భాగంలో కానీ దాక్కుని ఉంటాయి. స్పోడోప్తేరా ఎక్సిగువా తినడం వలన మొలకలు చనిపొవఛు. కానీ ఈ తెగులు తీవ్రత తక్కువగా ఉంటే పెద్ద మొక్కలు తిరిగి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ S. ఎక్సిగువా యొక్క సహజ శత్రువుల జనాభా వృద్ధి చెందేటట్టు చేయడం ఒక ఉత్తమ మైన పద్దతి. ఫ్లవర్ బగ్స్ ( అంతో కోరిడై), (ఫైర్) చీమలు, పరాన్నజీవి కందిరీగలు( హైపో సోటెర్ డిడిమాటర్) ఈగలు మరియు సాలీడ్లు వీటి గుడ్లు మరియు లార్వా పైన దాడి చేస్తాయి. ఏంటోమోపాథోజెనిక్ ఫంగి, బాసిల్లస్ తూరంగియాన్సీస్, NPV మరియు నెమటోడ్లు వీటి లార్వాను మరియు పెద్ద పురుగులను ఆశిస్తాయి. వేప, నిమ్మ గడ్డి మరియు అల్లం ఆధారిత వృక్ష సంబంధిత కీటక నాశినులు వీటి పైన ప్రభావం చూపుతాయి. అలాగే 5% ప్రత్తి నూనె కలిగిన ద్రవాన్ని ఆకులపైన పిచికారీ చేసి గుడ్లు మరియు చిన్న లార్వాలను నియంత్రించవచ్చు. ఫెరొమోన్ ఉచ్చులు ఉపయోగించి కూడా ఇవి సంపర్కించకుండా చేసి నిరోధించి లేదా వీటి పునరుత్పత్తిని నిర్మూలించవచ్చు. (97% వరకూ ప్రభావం చూపుతుంది)

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ S. ఎక్సిగువా కు సహజ శత్రువులైన కీటకాలను రక్షించడానికి ఈ పురుగులను నివారించడానికి కీటక నాశినులు వాడకం సిఫార్స్ చేయబడలేదు. నిజానికి వీటి వాడకం ఈ తెగులు మరింత విజృంభించేటట్టు చేస్తుంది. ఈ గొంగళి పురుగులు అనేక రకాల రసాయనాలకు అధిక సామర్ధ్యంతో నిరోధికత పెంచ్గుకున్నాయి.

దీనికి కారణమేమిటి?

ఈ నష్టం స్పోడోప్తేరా ఎక్సిగువా అనే పేరు కల బీట్ ఆర్మీవార్మ్ వలన కలుగుతుంది. ఈ పురుగు ఆసియా, ఆఫ్రికా, అమెరికా మరియు యూరప్ లోని వెచ్చని ప్రాంతాల్లో మరియు గ్రీన్ హౌసుల్లోని చల్లని ప్రాంతాల్లో సంక్రమిస్తుంది. ఇవి ప్రత్తి, బీట్ మరియు మొక్క జొన్న పంటలతో పాటు చాలా రకాల ఇతర మొక్కలకు కూడా సంక్రమిస్తాయి. పెద్ద పురుగులు బూడిద గోధుమ రంగులో ఉంటాయి. ముందు రెక్కలు గోధుమ మరియు బూడిద రంగు మచ్చలతో ఒక క్రమ పద్థతిలో లేని నమూనాలో ఉంటాయి. లేత రంగు బీన్ ఆకారంలో మధ్యలో ఒక మచ్చ కలిగి ఉంటాయి. వెనక రెక్కలు బూడిద రంగు లేదా తెలుపు రంగులో ఉండి అంచుల వద్ద ముదురు రంగు లైను కలిగి ఉంటాయి. ఆడ పురుగులు ఆకుల క్రింది భాగంలో గుంపులుగా తెలుపు లేదా బూడిద రంగు వెంట్రుకలు కప్పబడిన గుడ్లను పెడతాయి. వీటి పైన ఉంటాయి. చిన్న లార్వా పచ్చని బూడిద రంగులో ఉండి వెనక భాగంలో పొడవైన ముదురు రంగు చారలు కలిగి ఉంటాయి. పెద్ద లార్వా పచ్చ రంగులో ఉండి రెండు వైపులా పసుపు రంగు చారాలతో మరియు వెనక భాగంలో పసుపు పచ్చ రంగు పట్టీను కలిగి ఉంటాయి.


నివారణా చర్యలు

  • గట్టి ఆకుల కణజాలం కలిగిన తెగులు నిరోధక జాతి విత్తనాలను వాడండి.
  • వీటి అధిక జనాభాను నివారించడానికి మొక్కలు వేసే సమయాన్ని సర్దుబాటు చేసుకోండి.
  • ఈ తెగులు ఉనికి కోసం, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లేదా తెల్లవారుజామున, మీ పొలాన్ని క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.ఫెరొమోన్ ఉచ్చులు వుపయోగించి వీటిని గమనిస్తూ వుండండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలు మరియు చెత్తను తొలగించండి.
  • ఎందుకంటే వీటి సంతానోత్పత్తి చేసుకునే ప్రాంతాలుగా ఇవి ఉపయోగపడతాయి.
  • బాగా లోతుగా కందకాలు తవ్వి నీటితో నింపి ఈ గొంగళి పురుగులు ఒక పొలంలోనుండి ఇంకొక పొలంలోకి వెళ్ళేటప్పుడు అందులో పడి మునిగిపోయేటట్టు చేయండి.
  • వీటి సహజ శత్రువులు చనిపోకుండా ఉండడానికి సరైన మోతాదులలో విస్తృత పరిధి కల కీటక నాశినులను వాడండి.
  • పొలాన్ని బాగా లోతుగా దున్ని వీటి లార్వా మరియు ప్యుపాలను వీటి సహజ శత్రువులకు బహిర్గతమయ్యేటట్టు చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి