Euchrysops cnejus
కీటకం
ఇక్కడ ఇవి ప్రవేశించిన లేదా తినడం వలన కలిగిన రంధ్రాలు కనపడడంతో మొగ్గలు, పువ్వులు మరియు కాయలపైన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రతీ కాయ పైన వున్న అనేక రంధ్రాల ద్వారా నష్టం వర్గీకరించబడుతుంది. రంధ్రాలు కణద్రవ్యాన్ని స్రవిస్తాయి మరియు రంధ్రాల అంచు నల్లగా మారుతుంది.
గడ్డి నీలం సీతాకోకచిలుక జనాభాను నియంత్రించడానికి అన్ని లెపిడోప్టెరాన్ తెగుళ్ళపై దాడి చేయడానికి సహజ శత్రువులను ఉపయోగించండి. వారం వ్యవధిలో 0.6 లక్ష/ఎకరానికి/వారానికి నాలుగు సార్లు గుడ్డుని ఆశించే పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామా ఎస్స్ పి ని విడుదల చేయండి. టెలోనోమస్ ఎస్పిపిని (ఒక గుడ్డు పరాన్నజీవి) మరియు అప్నాటెల్స్ ఎస్స్ పి పి. (ఒక లార్వా పరాన్నజీవి) పరాన్నజీవులను గమనించినప్పుడు ఎటువంటి పురుగుమందులను పిచికారీ చేయకుండా వీటిని పరిరక్షించండి. ఇతర గొంగళి పురుగులను నియంత్రించడానికి వాడే పురుగుమందుల ద్వారా కూడా వీటి లార్వాలను నియంత్రించవచ్చు. మీ మొక్కలను బాసిల్లస్ తురింజెన్సిస్ (కనీసం 100 ఎల్ నీరు/హెక్టారు) తో కవర్ చేయండి. వేప నూనె కూడా ఈ తెగులును అదుపులో ఉంచుతుంది.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గడ్డి నీలం సీతాకోకచిలుకకు వ్యతిరేకంగా పురుగుమందులు నమోదు చేయబడలేదు. లెపిడోప్టెరా యొక్క ఇతర జాతులను లక్ష్యంగా చేసుకునే అనేక ఉత్పత్తులు ఈ తెగులును కూడా నియంత్రిస్తాయి. ఈ. స్నేజుస్ ను సమర్థవంతంగా నియంత్రించడానికి ప్రొఫెనోఫోస్ సూచించబడింది.
ఈ లక్షణాలు ప్రధానంగా యూక్రిసోప్స్ క్నెజస్ యొక్క లార్వా వల్ల కలుగుతాయి. పెద్ద మగ సీతాకోకచిలుక లేత ఊదా రంగులో ఉంటుంది, అయితే ఆడ సీతాకోకచిలుక నల్లగా దుమ్ము కొట్టుకుపోయినట్టు ఉండి దాని రెక్కల మొదళ్ళ వద్ద లేత మెరిసే నీలిరంగుతో నల్లగా ఉంటుంది. ఆడ సీతాకోకచిలుక దాని జీవితకాలంలో 60 నుండి 200 గుడ్లు పెట్టవచ్చు మరియు వాటిని రెమ్మలు, పూల మొగ్గలు లేదా ఆకులపై ఒకొక్కటిగా ఉంచుతుంది. దీని లార్వా సాధారణంగా దృఢమైన, చదునైన లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండి, ఎరుపు గీతతో మరియు దాని శరీరంపై చిన్న నల్ల వెంట్రుకలతో 13 మి.మీ పొడవు ఉంటుంది. వాటి రంగు మరియు తినే ప్రాంతాల కారణంగా, ఇవి పగటి పూట తిరుగుతున్నప్పటికీ (పగటిపూట చురుకుగా ఉంటాయి) వీటిని కనుగొనడం కష్టం. ముఖ్యంగా పప్పు ధాన్యాల పంటలలో వీటి లార్వా పువ్వులు మరియు లేత కాయలను తింటుంది, మరియు వాటిలోకి రంద్రాలు చేస్తుంది. వీటి ప్యూపా దశ ఆకులపై సంభవిస్తుంది.