ప్రత్తి

మిరిడ్ పురుగులు

Miridae

కీటకం

క్లుప్తంగా

  • మిరిడ్ పురుగులు చివర వుండే మొగ్గలు, పువ్వులు మరియు పండ్లలోని కణద్రవ్యాన్ని పీల్చుకుంటాయి.
  • పువ్వులపై నల్లని మచ్చలు మరియు లోపల కుచించుకుపోయిన మరకలు పడిన విత్తనాలు లోపల కనిపిస్తాయి.
  • మొక్కలు బలం కోల్పోయి ఎదుగుదల తగ్గిపోతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

మిరిడ్ పురుగులు చివర వుండే మొగ్గలు, పువ్వులు మరియు పండ్లలోని కణద్రవ్యాన్ని పీల్చుకుని మొక్కకు నష్టం కలుగచేస్తాయి. పండ్లు ఏర్పడకముందు ఈ తెగులు సంక్రమిస్తే మొక్కలు వాటి మొగ్గలను కోల్పోయి ఎదుగుదల తగ్గిపోతుంది. లేత పువ్వులకు నష్టం కలిగితే అవి మూడు రోజులలో ఎండిపోతాయి. చిన్న మరియు మధ్యస్థ పరిమాణంలో వున్న పువ్వులకు నష్టం కలిగితే ఇంకా ఆ నష్టం నుండి ఇవి తేరుకోలేవు. ఒకవేళ పువ్వులు ఎదిగినా అవి ముడుతలు పడి వాటి రేకులు వికృతంగా తయారై పుప్పొడి నల్లబడిపోతుంది. ప్రత్తి కాయల పైభాగంలో నల్లని మచ్చలు ఏర్పడతాయి. లోపల విత్తనాలపైన మరకలు ఏర్పడతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే పంట దిగుబడి మరియు నాణ్యత బాగా దెబ్బతింటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వీటి జనాభాను నియంత్రించడానికి సహజ సిద్ధమైన కీటకాలను పురుగులను ఉపయోగించవచ్చు. డాంసెల్ బగ్స్, బిగ్ ఐడ్ బగ్స్, అసాసిన్ బగ్స్, చీమలు, మరియు కొన్ని జాతుల సాలీడ్లు ఈ మిరిడ్ పురుగులను తింటాయి. పలుచన చేసిన వేప నూనెను మరియు బెయువేరియా బస్సియన ఫంగస్ ఆధారిత జీవ కీటక నాశినులను వీటి జనాభాను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. ఈ తెగులును గమనించిన వెంటనే జీవన నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం మొదలుపెట్టండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. డైమేథోయేట్ , ఇండొక్సాకార్బ్ లేదా ఫిప్రోనిల్ ఈ పురుగులపైన మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని వాడడం వలన ఈ తెగులు తీవ్రతను తగ్గించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పంట రకాన్ని బట్టి అనేక జాతుల మిరిడ్ పురుగుల వలన ఈ తెగులు సంక్రమిస్తుంది. ప్రత్తిలో కంపిలోమా లివిడ మరియు క్రియోటియాడెస్ spp. జాతుల వలన, ముఖ్యంగా బీశేరటెన్స్ ( దక్షిణ భారత దేశంలో) వలన ఈ తెగులు సంక్రమిస్తుంది. దీనిని డింపుల్ బగ్ ( మధ్య మరియు ఉత్తర భారత దేశంలో) అని కూడా పిలుస్తారు. పెద్ద పురుగులు కోలగా ఉండి చదునుగా వున్న శరీరం కలిగి పచ్చని పసుపు రంగు నుండి గోధుమ రంగులో ఉంటాయి. వెనక వైపున మధ్యలో ఒక ప్రత్యేకమైన త్రికోణాకారపు అంచులు కలిగి ఉంటాయి. ఇవి ఆకుల కాడలపైన ఒకొక్కటిగా గుడ్లను పెడతాయి. ఇవి 4-5 రోజుల్లో పొదగబడతాయి. వీటి పరిమాణం మరియు రూపం వలన ఈ పిల్ల పురుగులను తామరపురుగులుగా భ్రమపడతారు. కానీ మిరిడ్ పురుగులు తామర పురుగుల కన్నా వేగంగా కదులుతాయి. ఈ C. లివిడ పురుగులకు 30-32°C ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. 35°C కన్నా అధిక ఉష్ణోగ్రతలు వున్నప్పుడు వీటి జీవిత చక్రం మందగిస్తుంది. ముఖ్యంగా మరియు బాగా అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాత వాతావరణ పరిస్థితులలో వీటి జనాభా బాగా తగ్గిపోతుంది.


నివారణా చర్యలు

  • ప్రత్తి మొక్కలను బాగా దగ్గరగా నాటకండి.
  • ఈ పురుగులను ఆకర్షించడానికి అల్ఫాల్ఫా వంటి ఇతర అతిథేయ మొక్కలను పొలం చుట్టూ నాటండి.
  • తెగులు లక్షణాల కొరకు పొలాన్ని తరచుగా గమనిస్తూ వుండండి.
  • మొక్కలకు ప్రయోజనం కలిగించే పురుగులను పరిరక్షించడానికి విస్తృత పరిధి కల పురుగుల మందుల వాడకాన్ని నివారించండి.
  • పంట కోతల తర్వాత పంట వ్యర్థాలను మరియు వ్యాధి సోకిన మొక్కలను తొలగించి కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి