ప్రత్తి

ప్రత్తి కాండం ముక్కు పురుగు

Pempherulus affinis

కీటకం

క్లుప్తంగా

  • ప్రత్తి కాండం ముక్కు పురుగు యొక్క లార్వా మొక్క మొదలు వద్ద కాండంలోకి చొచ్చుకుపోయి లోపల నుండి తినడం మొదలుపెడుతుంది.
  • దీనివలన నాళాల కణజాలాన్ని నష్టం వాటిల్లి కాండం ఆకృతి మారిపోతుంది.
  • దిగుబడి బాగా తగ్గిపోయి బలమైన గాలులు వీచినప్పుడు కణుపుల వద్ద మొక్క విరిగిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

మొక్క మొదలులో కాండం పైన ముడి వంటి వాపు ఏర్పడడం ఈ తెగులు యొక్క చాలా ముఖ్యమైన లక్షణం. కాండం లోపల లార్వాలు తినడం వలన నాళాల కణజాలం దెబ్బతినడం వలన ఈ నష్టం కలుగుతుంది. దీనివలన లేత మొక్కలు చనిపోతాయి. ముదురు మొక్కలు ముందుగా వాలిపోయి మొత్తానికి ఎండిపోతాయి. ఇవి చాలా వరకూ జీవించేవుంటాయి కానీ వీటి సత్తువ తగ్గి ఎదుగుదల మందగిస్తుంది. ఇలా దెబ్బతిన్న కాండాలు బలమైన గాలులు వేసినట్లయితే లేదా ప్రత్తి కాయల బరువుకు చాలా సులభంగా పడిపోతాయి. ప్రత్తి కాయలు తక్కువగా ఏర్పడడం మరియు తక్కువ నాణ్యత కలిగిన ప్రత్తి ఈ తెగులు ఇతర లక్షణాలు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

నేలలో ముందు ఎరువులు వేసేసమయంలో వేప చెక్కను పెరటి పెంటను మట్టికి కలిపి వాడడం వలన కాండం మరియు చిగుర్ల ముక్కు పురుగుల తెగుళ్లను తగ్గించవచ్చు. (ఒక హెక్టారుకు10 టన్నులు పెరటి పెంట + 250 కిలోల వేప చెక్క). లేత మొక్కలను వేప నూనె ద్రావణంలో తడపడం వలన పెద్ద ముక్కు పురుగులు ఆకుపాలైన గుడ్లను పెట్టకుండా నివారించవచ్చు. లింగాకర్షక బుట్టలను వుపయోగించి( కీటక నాశినులతో కలిపి వాడి) ఈ పురుగులను గమనించడం మరియు నియంత్రించడం చేయవచ్చు)

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలను (కిలో విత్తనాలకు 10 మిల్లీలీటర్ల క్లొర్ఫైరిఫాస్ 20 EC) ముందు నివారణ చర్యగా విత్తన శుద్ధి చేసి ఈ తెగులు విస్తరించకుండా నియంత్రించవచ్చు.కాండం పైన క్లొర్ఫైరిఫాస్ 20 EC పిచికారీ చేసినట్లయితే ఇది కాండం మరియు చిగుర్ల వీవిల్ పురుగుల పైన (ఒక లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు) ప్రభావం చూపిస్తుంది.అంకురోత్పత్తి జరిగిన తర్వాత 15 నుండి 20 రోజుల తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపైన ఈ ద్రావణాన్ని వాడండి. లింగాకర్షక బుట్టలను వుపయోగించి( కీటక నాశినులతో కలిపి వాడి) ఈ పురుగులను గమనించడం మరియు నియంత్రించడం చేయవచ్చు)

దీనికి కారణమేమిటి?

ప్రత్తి కాండం ముక్కు పురుగు పురుగు అయిన పెంపేరులస్ అఫ్ఫినిస్ వలన ఈ నష్టం కలుగుతుంది. పెద్ద పురుగులు చిన్నగా వుండి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటి తల మరియు రెక్కలపైన తెల్లని రంగు ఉంటుంది. లేత మొక్కల చిగుర్లపైన ఆడపురుగులు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదగబడిన తర్వాత తెల్లని క్రిములు కాండం మరియు బెరడు మధ్యనుండి కాండం లోనికి ప్రవేశించి నాళాల కణజాలాన్ని తినడం మొదలుపెడతాయి. దీనివలన మొక్కల మొదళ్లవద్ద కాండం ఉబ్బుతుంది. ఈ ప్రత్తి షూట్ వీవిల్ ( అల్సిడోడుస్ అఫ్ఫాబెర్) కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది. అందువల్లనే దీనికి కూడా అదేవిధమైన చికిత్స మరియు నివారణ చర్యలు చేపట్టవచ్చు. కానీ ప్రత్తి షూట్ వీవిల్ ముదురు బూడిద రంగుతో కూడిన గోధుమ రంగులో వుండి వాటి ముందు రెక్కలపైన పాలిపోయిన పట్టీలు కలిగివుంటాయి. దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా తమిళనాడులో ఈ ప్రత్తి కాండం ముక్కు పురుగు పురుగులు చాలా తీవ్రమైన తెగులుగా చెప్పుకోవచ్చు.


నివారణా చర్యలు

  • కీటకాలు ఆశించకుండా ఉండడానికి పొలంలో మొక్కలను దట్టంగా నాటండి.
  • పొలంలో వరసల వద్ద మట్టిని గట్ల వలే వేయడం వలన ముక్కు పురుగు మొక్కలకు ఆశించకుండా ఉంటుంది.
  • పొలంలో పంట మార్పిడి పద్దతిని పాటించండి లేనట్లయితే పొలాన్ని కొంత కాలం బీడుగా ఉంచండి.
  • పొలం చుట్టూ ప్రక్కల ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలను (హైబిస్కస్, ఇండియన్ మల్లో) తొలగించండి.
  • పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ దెబ్బతిన్న మొక్కలను తొలగించండి.
  • లింగాకర్షక బుట్టలు వుపయోగించి ఈ కీటకాల ఉనికిని గమనిస్తూవుండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి