నిమ్మజాతి

ఓరియంటల్ సాలీడు నల్లి

Eutetranychus orientalis

పురుగు

క్లుప్తంగా

  • ఓరియంటల్ సాలీడు నల్లి, సిట్రస్ ఎర్ర నల్లి తిన్నప్పుడు కలిగిన నష్టం ఒకే సారూప్యతను కలిగి ఉంటుంది.
  • ఆకులు రంగు కోల్పోతాయి మరియు ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు ముందుగానే రాలిపోవడం, కొమ్మల డైబ్యాక్, పండ్ల నాణ్యత తగ్గడం మరియు చెట్ల సత్తువ తగ్గుతుంది.
  • సరైన నీటి సరఫరా, ఈ తెగులు వలన కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఈ నష్టం ఆకు పై భాగం ప్రక్క వైపున, ప్రధానంగా ప్రధాన ఈనె వెంట మొదలై తరువాత ప్రక్క ఈనెలకు వ్యాప్తి చెందుతుంది. లేత-పసుపు గీతలు మధ్యభాగం మరియు ఆకు ఈనెల వెంట వృద్ధి చెందుతాయి మరియు చివరికి ఆకులు రంగు కోల్పోతాయి. కొన్నిసార్లు ఆకుల పైన సన్నని దుమ్ము పేరుకున్నట్టు కనిపిస్తుంది మరియు కొద్దిగా వుబ్బునట్టు కూడా అవుతుంది. లేత ఆకులకు ఈ తెగులు సంక్రమించినప్పుడు అవి పైకి మెలికెలు తిరిగి పోతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఈ పురుగులు ఆకుల పై పొరను తిని ఆకు మొత్తం పైభాగం పైన గుడ్లు పెడతాయి. దీనివలన ఆకులు ముందుగానే రాలిపోవడం, కొమ్మలు డై-బ్యాక్స్ కావడం మరియు పండ్లు రాలి పడిపోవడం జరగవచ్చు. తరువాత సంవత్సరం పువ్వులు వికసించడం తీవ్రంగా ప్రభావితం చెందవచ్చు. చెట్లు నీటి ఒత్తిడికి లోనైనట్లైతే వీటి జనాభా తక్కువగా ఉన్నప్పటికీ పండ్లు పాలిపోవడం మరియు ఆకులు ముందుగానే రాలిపోవడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

యుటెట్రానిచస్ ఓరియంటాలిస్, పెద్ద సంఖ్యలో వేటాడే మరియు ఇతర సహజ శత్రువులను కలిగి ఉంది. ఇవి దాని వ్యాప్తిని నియంత్రించడానికి తరచుగా సరిపోతుంది. నిమ్మ జాతి ఓరియంటల్ నల్లి యొక్క సమర్థవంతమైన నియంత్రణ కోసం వివిధ దేశాలలో అనేక ఫైటోసియిడే మరియు స్టిగ్మైడే పురుగులు ఉపయోగించబడ్డాయి, ఉదా .: యూసియస్ స్టిపులాటస్, టైఫ్లోడ్రోమస్ ఫియాలటస్, నియోసియులస్ కాలిఫోర్నికస్, ఫైటోసియులస్ పెర్సిమిలిస్. స్టెథోరస్ ఎస్.పి.పి మరియు ఓరియస్ త్రిపోబోరస్ వంటి వేటాడే పెంకు పురుగులు. లేస్ వింగ్ లార్వా ఈ పురుగులను ఆహారంగా తింటాయి. ఈ తెగులును వదిలించుకోవడానికి మీరు మీ మొక్కలను సల్ఫర్‌తో పిచికారీ చేయవచ్చు లేదా డస్టింగ్ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. 20% ఆకులు మరియు/లేదా పండ్లు ప్రభావితమైతే ఈ తెగులు సోకిన మొక్కలకు చికిత్స ప్రారంభించండి. విస్తృత పరిధి కల పురుగుమందులు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి, ఎంపిక చేసిన పురుగుమందులు ఎక్కువగా సిఫార్సు చేయబడతాయి. అనేక రకాల అకారిసైడ్ల వాడకం ఈ తెగులు పురుగుల మందులకు నిరోధకత అభివృద్ధిని నివారిస్తుంది. ఫ్లూబెంజిమైన్, ఒమెథోయేట్ మరియు డికోఫోల్‌ దీనిపై మంచి ప్రభావం చూపిస్తాయి అని రిపోర్ట్ చేయబడింది.

దీనికి కారణమేమిటి?

సిట్రస్ ఓరియంటల్ మైట్ అని పిలవబడే యుటెట్రానిచస్ ఓరియంటాలిస్ యొక్క పెద్ద నల్లి మరియు పిల్ల నల్లులు తినడం వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఇవి కోలాకారంలో, చదునైన శరీరంతో ఉంటాయి ,మరియు లేత-గోధుమ, ఎరుపు గోధుమ నుండి ముదురు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. శరీరం మొత్తం పొడవు వాటికి ముదురు మచ్చలు మరియు లేత రంగు కాళ్ళు ఉంటాయి. ఇవి ఎక్కువగా నిమ్మ జాతి చెట్లకు మరియు అప్పుడప్పుడు బాదం, అరటి, కాసావా మరియు పత్తి వంటి ఇతర పంటలను కూడా ఆశిస్తాయి. సాధారణంగా ఇవి ఆకు ఉపరితలంపై కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా గాలి ద్వారా చెదరగొట్టబడతాయి. భౌగోళికంగా సంభవించిన ప్రాంతాన్ని బట్టి సంవత్సరానికి 8 - 27 తరాల వరకూ ప్రతి ఆడ నల్లి దాని జీవిత కాలంలో జీవితకాలంలో (2-3 వారాలు) 30-40 గుడ్లు పెడతాయి. చాలా తక్కువ లేదా అధిక తేమ, అధిక గాలి, కరువు లేదా సరిగా వృద్ధి చెందని వేరు వ్యవస్థ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. 21-27°C మరియు 59-70% తేమ ఓరియంటల్ స్పైడర్ మైట్ కు సరైన పరిస్థితులు.


నివారణా చర్యలు

  • పురుగుల సంఖ్యను అంచనా వేయడానికి తోటలను వారానికి ఒకసారి లెన్స్‌తో పర్యవేక్షించండి.
  • పురుగుమందులను అధికంగా వినియోగించవద్దు, ఎందుకంటే ఇది ప్రయోజనకరమైన కీటకాల జనాభాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  • చెట్టుకు సరిగా నీరు పెట్టండి మరియు వేడి వాతావరణంలో కరువు ఒత్తిడిని నివారించండి.
  • నేల మీద గడ్డి లేదా కలుపు మొక్కలతో కొమ్మలు అంటుకోకుండా చూడండి.
  • పండ్ల తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడండి.
  • తోటను పరిశుభ్రంగా ఉంచండి.
  • పంట కోత తర్వాత వ్యర్థాలు మరియు పంట అవశేషాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి