నిమ్మజాతి

ఎర్ర పొలుసు

Aonidiella aurantii

కీటకం

క్లుప్తంగా

  • చిన్న చిన్న ఎర్రని పొలుసులు ఆకులు, కాండం, కొమ్మలు మరియు పండ్లను ఆశిస్తాయి.
  • ఆకులు వాడిపోయి ముందుగానే రాలిపోతాయి.
  • పండ్లు వికృతంగా మారడం వలన వాటి మార్కెట్ ధర తగ్గిపోతుంది.
  • ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే ఆ సీజన్లోనే కాకుండా తరువాత సీజన్లో కూడా దిగుబడి తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

2 పంటలు

నిమ్మజాతి

లక్షణాలు

అధిక మొత్తంలో చిన్న పరిమాణంలో ముదురు గోధుమరంగు నుండి ఎర్రని పొలుసులు ఆకులు ( తరుచుగా ప్రధాన ఈనే వెంబడి), కొమ్మలు, మరియు మండ్లపైన ఏర్పడతాయి. అవి కొంచెం ఉబ్బెత్తుగా, శంఖం ఆకారంలో వుంది మధ్యలో సృష్టంగా ఉంటాయి. (అగ్నిపర్వతం లాంటి ఆకారం) అవి తినే ప్రాంతంలో చుట్టూ పసుపు రంగు వృత్తం చూడవచ్చు. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు వాడిపోయి ముందుగానే రాలిపోతాయి. తెగులు సోకిన కొమ్మలు పైనుండి క్రిందకు చనిపోతాయి. తెగులు తీవ్రత మరీ అధికంగా వున్నప్పుడు పెద్ద కొమ్మలు కూడా ఈ విధంగా డై బ్యాక్ చెందవచ్చు. పండ్లపైన ఈ పొలుసులు పెంకు కట్టినట్టుగా మారి పండ్లు రూపం కోల్పోయి ఎండిపోయి రాలిపోతాయి. లేత చెట్లలో ఎదుగుదల బాగా తగ్గిపోతుంది లేదా చాల కొమ్మలు డై బ్యాక్ చెందవచ్చు. ఎర్ర పొలుసులు హనీ డ్యూ ను విసర్జించడం వలన ఆకులు మరియు పండ్లపైన సూటీ బూజు ఏర్పడే అవకాశం ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అవునిడియెల్ల ఔరంటి కు సహజ శత్రువులైన ఆఫీటిస్ మెలినుస్ మరియు కొంపేరియళ్ళ బిఫాస్సియాట మరియు ప్రెడేటరీ మైట్ అయిన హేమిసర్కొప్టెస్ మలుస్ ప్రాకే ఎర్ర పొలుసు క్రిములపైన దాడి చేస్తాయి. ఎర్ర పొలుసును వాటి సహజ శత్రువుల నుండి చీమలు రక్షిస్తాయి. అందువలన జీవనియంత్రణ పద్దతిలో ఎర్ర పొలుసు తెగులును నియంత్రించడానికి చీమలను నియంత్రించడం చాలా ముఖ్యం. సేంద్రియ ఆమోదం పొందిన పెట్రోలియం ఆయిల్ స్ప్రే ను ఉపయోగించి ఈ ఎర్ర పొలుసును ఆకులు మరియు పండ్లకు సంక్రమించకుండా చేయవచ్చు. పంట కోత తర్వాత అధిక ఒత్తిడితో కడిగి పండ్లపైన ఈ పొలుసులు తొలగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వీటి సహజ శత్రువులకు నష్టం కలగకుండా వేసవి కాలం మధ్యలో నూనెను సన్నగా పిచికారీ చేయడం వలన వీటిని నియంత్రించవచ్చు. 25% కన్నా అధికంగా పండ్లకు ఈ తెగులు సంక్రమిస్తే రసాయనిక పిచికారీను ఉపయోగించవచ్చు. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు క్లోర్ఫెరిఫోస్, కార్బరిల్, మలాథియాన్ లేదా డైమేథోయేట్ వంటి పురుగుల మందులను ఉపయోగించవచ్చు. వీటి సహజ శత్రువులకు నష్టం కలిగించకుండా ఉండడానికి విస్తృత పరిధి కలిగిన పురుగుల మందులను ఉపయోగించవద్దు.

దీనికి కారణమేమిటి?

అవునిడియెల్ల ఔరంటి అనబడే ఎర్ర పొలుసు తినడం వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా నిమ్మజాతి పంటలలో ఇది ఒక ముఖ్యమైన తెగులు. ఉష్ణమండల ప్రాంతాలలో ఇది సాధారణ తెగులు. పంట కోతల తర్వాత ఇది చెక్క మరియు ఆకులపైన జీవించి ఉండి తరువాత సీజన్లో పండ్లపై కొత్తగా వ్యాపిస్తుంది. ఇవి తినడానికి సరైన ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు బాగా అధికంగా కాంతికి ఆకర్షితమౌతాయి. అవి గుడ్లను పెట్టవు కానీ చాలా చురుకుగా వుండే పాకే పిలల్లకు జన్మనిస్తాయి. ఒకసారి ఆకులపైనే లేదా లేత పండ్ల గుంతలలో స్థిరపడితే అవి కదలకుండా అక్కడే స్థిరంగా ఉండిపోతాయి. కొంత సమయం వరకు అవి ఒక ప్రత్తి లాంటి పదార్ధంతో కప్పబడి కొన్నాళ్లకు గుండ్రని చదును రూపాన్ని మరియు వాటి సహజ లక్షణమైన ఎర్రటి గోధుమ రంగును సంతరించుకుంటుంది. వీటి జీవిత చక్రం ఉష్ణోగ్రతపైన మరియు చెట్టు యొక్క ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. అందువలన చెట్లు తేమ ఒత్తిడిని ఎదుర్కొంటునప్పుడు వేసవి కాలం చివర్లో నష్టం చాలా అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఆడ పురుగులను ఆకర్షించటానికి ఫెరొమోన్ వలలు వుపయోగించి తెగులు తీవ్రతను అంచనా వేయండి.
  • ఈ పొలుసు తెగులు లక్షణాల కోసం మీ తోటలను క్రమం తప్పకుండా గమనిస్తూ వాటిని గీరడం ద్వారా తొలగించండి.
  • అధికంగా తెగులు సోకిన కొమ్మలను మరియు శాఖలను తొలగించండి.
  • గాలి ప్రసరణ బాగా జరగడానికి సరిపడినంతగా చెట్లను కత్తిరించండి.
  • దీనివలన ఈ పొలుసు తెగులుకు అననుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
  • ఈ తెగులు వృద్ధికి తోడ్పడే చీమలను పట్టుకోవడానికి లేదా అడ్డుకోవడానికి వలలు లేదా అడ్డంకులు ఏర్పరచండి.
  • ప్రయోజనకర కీటకాలను ప్రభావితం చేయకుండా ఉండడానికి, విస్తృత పరిధి కల పురుగుల మందులను వాడకండి.
  • ఆకులు మరియు పండ్లపైన దుమ్ము పేరుకుపోకుండా ఉండడానికి రోడ్లు మరియు చెట్లపైన నీటిని చల్లండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి