చెరుకు

చెరుకు పైరిల్లా

Pyrilla perpusilla

కీటకం

క్లుప్తంగా

  • ఆకుపచ్చ నుండి గోధుమ రంగు కీటకాలు ఆకుల దిగువ భాగాన్ని తింటాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారడం మరియు ఎండిపోవడం జరుగుతుంది.
  • మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది.
  • తేనె బంక ఉత్పత్తి మరియు ఆకు పైన నల్లటి బూజు పెరుగుతుంది.
  • ఇవి మొక్కజొన్నతో పాటు ఇతర గడ్డి మరియు తృణధాన్య పంటలపైన కూడా తక్షణమే దాడి చేస్తాయి.

లో కూడా చూడవచ్చు


చెరుకు

లక్షణాలు

ఇవి ఆకుల దిగువ భాగంలో కనపడి ఇవి అక్కడ మొక్కల కణద్రవ్యాన్ని పీల్చుకుంటాయి. మొదట ఇవి ఆకులు పసుపు రంగు లోనికి మారడం మరియు తరువాత ఆకులు ఎండిపోవడానికి కారణమవుతాయి. తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు ఆకు ఉపరితలంపై పసుపు రంగు పట్టీలు కనిపిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది, ఫలితంగా మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఇవి ఆకుల పైన పూతలా ఏర్పడే తేనే బంక అనే తీపి పదార్థాన్ని కూడా స్రవిస్తాయి. ఇది అవకాశవాద శిలీంధ్రాలను ఆకర్షిస్తుంది, దీని పెరుగుదల ఆకు ఈనెలను నల్లగా చేస్తాయి. ఇది కిరణజన్య సంయోగక్రియను మరింత తగ్గిస్తుంది, ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. మొక్కజొన్నతో పాటు చెరుకు, మిల్లెట్లు, బియ్యం, బార్లీ, వోట్స్, జొన్న, బజ్రా మరియు అడవి గడ్డిపై కూడా ఇవి దాడి చేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

అనేక పరాన్నజీవులు వీటి గుడ్లు మరియు పిల్ల కీటకాలపై దాడి చేస్తాయి. గుడ్డును ఆశించే పరాన్నజీవులలో టెట్రాస్టిచస్ పైరిల్లె, చెలోన్యూరుస్ పైరిల్లె, ఓయెన్సిర్టస్ పైరిల్లె, ఓ. పిపిలియోనస్ మరియు అగోనియాస్పిస్ పైరిల్లె ఉన్నాయి. పిల్ల కీటకాలపై లెస్టోడ్రైనస్ పైరిల్లె, పైరిల్లోక్సేనోస్ ఒంపాక్టస్, క్లోరోడ్రైనస్ పల్లిడస్, ఎపిరికానియా మెలనోలెకా దాడి చేస్తాయి. దీనిని ఆశించే పరాన్న జీవుల్లో కోక్కినెల్లా సెప్టెంపుంక్టట, సి. ఉండేసిమ్ పుంక్టట, నింబోవా బాసిపుంక్టట, గోనియోపెటరిక్స్ పుసానా. చిలోమేనెస్ సెక్స్మాకులాట, బృముస్ సుటురాలిస్ వున్నాయి. నింబోవా బాసిపుంక్టట, గోనియోపెటరిక్స్ పుసాన గుడ్డును ఆశించే పరాన్నజీవులు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మలాథియాన్ కలిగిన ఉత్పత్తులు ఈ తెగులుకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

దీనికి కారణమేమిటి?

పైరిల్లా పెర్పుసిల్లా యొక్క పెద్ద కీటకాలు నష్టం కలుగచేస్తాయి. ఇది చాలా చురుకైన మొక్కల హాప్పర్, ఇది ఏడాది పొడవునా సంతానోత్పత్తి చేస్తుంది మరియు ఒక పొలంలో నుండి మరొక పొలానికి వలస పోవచ్చు, దీనివల్ల చాలా అధికంగా నష్టం జరుగుతుంది. పెద్ద కీటకాలు ఆకుపచ్చ నుండి గడ్డి రంగులో ఉండి 7-8 మి.మీ పొడవు ఉంటాయి. ఇవి సాధారణంగా మొక్కలపై గుంపులు గుంపులుగా తింటూ కనిపిస్తాయి మరియు వీటిని చెదరకొట్టినప్పుడు వెంటనే పక్కకి దూకుతాయి. సూటిగా వున్న ముక్కులో వాటి నోటి భాగాలను దాచి వాటితో మొక్క కణజాలాలను పీల్చుకుంటాయి. అధిక తేమ మరియు వేగవంతమైన మొక్కల పెరుగుదల తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది, ఉదాహరణకుఅధికంగా పెంట లేదా ఎరువులు వేసిన పొలాలు. అధికంగా నీరు పెట్టడం లేదా వర్షాకాలం కూడా అవి వృద్ది చెందడానికి దోహదం చేస్తాయి.


నివారణా చర్యలు

  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • పంట కోత తర్వాత తెగులు సోకిన మొక్కలను తొలగించి వాటిని కాల్చివేయండి.
  • విస్తృత శ్రేణి పురుగుమందులను వాడవద్దు.
  • అలా చెయ్యడం వలన ప్రయోజనకరమైన కీటకాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి