ప్రత్తి

ప్రత్తిలో సెమి లూపర్

Anomis flava

కీటకం

క్లుప్తంగా

  • చిన్న లార్వా గుంపులు గుంపులుగా ఆకు లామినాను తినడం వలన చిన్న చిన్న రంద్రాలు ఏర్పడతాయి.
  • ఎదిగిన లార్వా ఆకులను విపరీతంగా తింటాయి.
  • దీనివలన ఒక్క మధ్య ఈనే దాని వెనక వున్న ఈనెలు మాత్రం మిగులుతాయి.
  • చిన్న లార్వా లూప్ వలే కదలడాన్ని బట్టి దీనికి సెమి లూపర్ అనే పేరు వచ్చింది.

లో కూడా చూడవచ్చు


ప్రత్తి

లక్షణాలు

చిన్న లార్వా ఆకులపైన గీరుతూ గుంపులుగా ఆకులను తింటూ చిన్న చిన్న రంద్రాలను ఏర్పరుస్తాయి. పెద్ద లార్వా ఆకుల అంచుల నుండి తినడం మొదలు పెట్టి మొత్తాన్ని ఒక ప్రధాన ఈనెను మాత్రం (అస్థిపంజరం) మిగులుస్తాయి. తరువాత ఇవి లేత చిగుర్లు, మొగ్గలు మరియు ప్రత్తి కాయలను కూడా తింటాయి. నల్లని మల పదార్ధాలు ఆకులపైన కనపడతాయి. వాతావరణ పరిస్థితుల పైన ఆధారపడి ఈ తెగులు అప్పుడప్పుడు మాత్రమే వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే దిగుబడిలో తీవ్ర న్తసం కలుగుతుంది. వీటి జనాభా అధికంగా వున్నప్పుడు మరియు ఇవి లేత మొక్కలపైన దాడిచేసినప్పుడు మాత్రమే వీటి వలన పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఇవి ఎదిగే కొలది మొక్కలు వీటికి నిరోధకతను పెంచుకుంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్రమం తప్పకుండ గుడ్లను మరియు పిల్ల లార్వాలను వెతికి పట్టడం ఈ సెమి లూపర్లను నియంత్రించడంలో ముఖ్య భాగం. ఇచ్యుమోనిడై, బ్రేకొనిడై, స్కెలియోనిడై, ట్రైకొగ్రామాటిడై మరియు టాచినిడై వంటి కొన్ని జాతుల పారాసైటోయిడ్లను వీటి జీవన నియంత్రణకు ఉపయోగించవచ్చు. వేప నూనె పిచికారీ కూడా వీటి జనాభాను నియంత్రించడంలో ఉపయోగ కారిగా ఉంటుంది. ఉదాహరణకు వేప గింజల కాషాయం (NSKE 5%) లేదా వేప నూనె (1500ppm) @ లీటరుకు 5 మిల్లీలీటర్లను పిచికారీ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అధిక మోతాదులో పురుగులు మందులు వాడడం వలన ఇవి వాటికి నిరోధకతను పెంచుకుంటాయి. వీటి లార్వా పెద్దది ఔతున్నప్పుడు పురుగుల మందుల చికిత్సకు నిరోధకతను పెంచుకుంటాయి. అందువలన వీటి గుడ్లను మరియు చిన్న లార్వాను ముందుగానే పసికట్టడం చాలా ముఖ్యం. గుడ్ల దశలోనే వీటి నివారణకు పూనుకోవాలి. క్లొరాన్త్రనిపోల్, ఏమామెక్టిన్ బెంజోయెట్, ఫ్లూబెండియమైడ్, మేథోమేల్ లేదా ఎస్ఫేన్వలెరేట్ లను ఉపయోగించవచ్చు. తక్కువ విలువ కలిగిన పంటలలో ఈ రసాయనాలను ఉపయోగించడం గిట్టుబాటుకాదు.

దీనికి కారణమేమిటి?

అనోమిస్ ఫ్లావ యొక్క లార్వా వలన నష్టం కలుగుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది నారింజ గోధుమ రంగు ముందు రెక్కలు కలిగి ఉండి చివర్లలో రెండు బూడిద రంగు జిగ్ జాగ్ గీతలు కలిగి ఉంటాయి. ప్రధానంగా కనిపించే ఒక నారింజ రంగు త్రికోణం ఈ రెక్కలపైన సగం వరకు విస్తరించి ఉంటుంది. ,వెనక రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి ప్రత్యేకమైన లక్షణాలేమి కలిగి వుండవు. ఆడ కీటకాలు సుమారు 500-600 వరకు గుండ్రని గుడ్లను ఆకులపైన పెడతాయి. చిన్న లార్వా పాలిపోయిన పచ్చ రంగులో ఉండి మొదటి ఐదు భాగాలను సన్నని పసుపు రంగు చారలు సృష్టంగా వేరు చేస్తాయి. పెద్ద లార్వా గోధుమ రంగు లేదా నల్లని రంగులోకి మారి ప్రక్క భాగంలో రెండు పసుపు రంగు చర్యలను కలిగివుంటాయి. వీటి ప్యూపా గోధుమ రంగులో ఉండి ముదురు ఆకులపైన ఇవి కనిపిస్తాయి. వీటి లార్వా ముందుకు కదులుతున్నప్పుడు వాటి శరీరాన్ని ఆర్చ్ వలే వంపుగా మారుస్తాయి. అందువల్లనే వీటికి ఆంగ్లంలో సెమి లూపర్ అనే పేరు వచ్చింది.


నివారణా చర్యలు

  • మార్కెట్లో అందుబాటులో వున్నట్లైతే తెగుళ్లును తట్టుకునే విధానాలను ఉపయోగించండి.
  • అధికంగా వర్షం పాడినప్పుడు ఈ తెగులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అందువలన పొలంలో మంచి మురుగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోండి.
  • ఈ పురుగుల జనాభా పెరగక ముందే( సాధారణంగా విత్తిన సుమారు 60 నుండి 70 రోజుల మధ్యన) సీజన్లో ముందుగానే పంటను వేయండి.
  • పొలాన్ని క్రమం తప్పకుండ గమనిస్తూ తెగులు సోకిన ఆకులను చేతితో తొలగించండి.
  • పంటకు మేలు చేకూర్చే కీటకాలను సంరక్షించడానికి పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించండి.
  • ఈ తెగులు సంక్రమించని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి