బెండ

డష్టి ప్రత్తి స్టయినర్

Oxycarenus hyalinipennis

కీటకం

క్లుప్తంగా

  • పిల్ల మరియు పెద్ద పురుగులు తెరిచివున్న ప్రత్తి కాయలను విపరీతంగా తింటాయి.
  • దీని వలన ప్రత్తి రంగు మారిపోతుంది మరియు ప్రత్తి కాయలు రాలిపోతాయి.
  • ఇలా దెబ్బతిన్న ప్రాంతంలో ఇతర సూక్ష్మ క్రిములు చేరి ఈ లక్షణాలను ఇంకా దిగజారుస్తాయి.

లో కూడా చూడవచ్చు


బెండ

లక్షణాలు

ప్రత్తి స్టయినర్ గా పిలవబడే ఈ పురుగులు మరియు పిల్ల పురుగులు కొద్దిగా తెరచి వున్న ప్రత్తి కాయలను తిని ప్రత్తి రంగు మారిపోయేటట్టు మరియు అప్పుడప్పుడూ ప్రత్తి కాయలు కుళ్లిపోయి రాలిపోతాయి( ఇవి ప్రత్తి కాయలను తింటున్నప్పుడు బాక్టీరియా సంక్రమించడం వలన పాక్షికంగా ఈ నష్టం కలుగుతుంది). తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు ప్రత్తి రంగు మారిపోవడం వలన నాణ్యత తగ్గిపోతుంది. అందువల్లనే దీనికి ప్రత్తి స్టయినర్ అనే పేరు వచ్చింది. బెండ వంటి ఇతర ప్రత్యామ్న్యాయ పంటలలో ఒక విధమైన చెడు వాసన మరియు జిడ్డు లాంటి ద్రవం కారడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఆఫ్రికాలో కొన్ని జాతుల పరాన్నజీవి పురుగులు ఈ కీటకాలపైన జీవించడం గమనించబడినది. వీటి వలన ఈ కీటకాలు మందగించి కొంత సమయానికి చనిపోతాయి. పలుచన చేసిన వేప నూనె (5%), ఎంటోమొపాథోజెనిక్ ఫంగి బెయువేరియా బస్సియానా మరియు మేతర్హిజియం అనిసోప్లై ఈ కీటకాల జనాభాను నియంత్రించడంలో ప్రభావం చూపిస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లోర్ఫైరీఫాస్, ఎస్ఫేన్వలేరేట్, బైఫెత్రిన్, డెల్టామేత్రిన్, లాంబ్డా- సైహాలోత్రిన్ లేదా ఇండొక్సాకార్బ్ కలిగిన ద్రావణాలను ఆకులపైన పిచికారీ చేయడంవలన గులాబీ బోల్ వార్మ్ పై ఇవి ప్రభావం చూపించడమే కాకుండా డష్టి ప్రత్తి స్టయినర్ జనాభాను తగ్గిస్తాయి. ఈ కీటకాలు సీజన్ చివర్లో మొక్కలను ఆశించడం వలన పంట పైన ఈ పురుగుల మందులు అవశేషాలు మిగిపోతాయి. అందువలన రసాయనిక మందులు వాడడం సాధ్యం కాదు. కీటక నాశినులకు ఈ కీటకాలు నిరోధకత ఏర్పరచుకోవడం వర్ణించబడింది.

దీనికి కారణమేమిటి?

ఆక్సీకరెనస్ హ్యలినిపెన్నీస్ అనే డష్టి ప్రత్తి స్టయినర్ అనేక రకాల ఆహారాన్ని తీసుకునే కీటకం వలన ఈ లక్షణాలు కలుగుతాయి. ఈ తెగులు ప్రత్తిలో చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. పెద్ద పురుగులు 4-5 మిల్లీమీటర్ల పొడవు ఉండి మునిమాపు రంగులో ఉండి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి. మగ కీటకాలు ఆడ కీటకాలకన్నా చిన్నగా ఉంటాయి. ఆడ పురుగులు తెల్లని పసుపు రంగు గుడ్లను, 4 గుడ్లను ఒక గుంపుగా తెరిచి వున్న ప్రత్తి కాయల లోపల విత్తనాలకు దగ్గరగా పెడతాయి.పిల్ల పురుగులు 2.5 మిల్లీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ఇవి వీటి జీవిత వివిధ దశలలో గులాబీ రంగు నుండి గోధుమ రంగులోకి మారతాయి. వీటి జీవిత చక్రం సుమారు 40-50 రోజుల వరకూ ఉంటుంది. అప్పటీకే చాలా ప్రత్తికాయలు తెరుచుకుని వుండే సీజన్ చివర్లో ఈ తెగులు సంక్రమిస్తుంది. దీనికి బెండ మరియు మాల్వసియా మొక్కలు ప్రత్యామ్న్యాయ అతిధి పంటలుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • పొలాన్ని తరుచుగా గమనిస్తూ ప్రత్తి కాయల చుట్టూ చిన్న పురుగుల ఉనికిని గమనిస్తూ వుండండి.
  • ఇవి తక్కువ సంఖ్యలో వున్నప్పుడు ఈ పురుగులను చేతులతో తొలగించండి.
  • ప్రత్యామ్న్యాయంగాఅల్ట్రా వయోలైట్ దీపపు వలలను ప్రత్తి మరియు బెండ పంటలను వేసిన పొలాల్లో ఏర్పాటుచేయండి.
  • పొలంలో పరియు పొలం చుట్టూ ప్రక్కల ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి