బెండ

ఎర్ర ప్రత్తి పురుగు

Dysdercus cingulatus

కీటకం

క్లుప్తంగా

  • ప్రత్తి కాయలపైన ఇవి తిన్న నష్టం కనిపిస్తుంది.
  • కాయలు ముందుగానే తెరుచుకుంటాయి మరియు కాయలు రాలిపోవడం, ప్రత్తి రంగు మారిపోవడం జరుగుతుంది.
  • కణజాలాన్ని ఆవాసంగా చేసుకున్న సూక్ష్మ జీవులవలన కూడా నష్టం కలుగుతుంది.

లో కూడా చూడవచ్చు


బెండ

లక్షణాలు

పెద్ద మరియు పిల్ల పురుగులు పూమొగ్గలను మరియు కొద్దిగా తెరిచివున్న లేదా మూసుకుని వున్న ప్రతి కాయలను తింటాయి. ఇవి కాయలలోకి రంద్రాలను చేసి ప్రత్తి గింజలను తింటాయి. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి ఇతర సూక్ష్మ జీవులు చేరడం వలన ప్రత్తి కాయలు కుళ్లిపోయి ప్రత్తి రంగుమారి పోతుంది. కాయలు ముందుగానే తెరుచుకుపోవడం ముందుగానే కాయలు రాలిపోవడం జరుగుతుంది. తక్కువ నూనెతో చిన్న గింజలు ఏర్పడడం, రంగు మారిపోయిన ప్రత్తి మరియు అంకురోత్పత్తి తగ్గడం జరుగుతుంది. ఈ విత్తనాలు విత్తడానికి పనికిరావు. D. సింగులటస్ ఒకే మొక్కపైన నివసించదు. ఇవి ఇతర లేత ప్రత్తి కాయలపైకి కూడా వలసపోవచ్చు. ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటే ప్రత్తి రంగు మారడం వలన నాణ్యత బాగా తగ్గవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పలుచన చేసిన వేప నూనెను ఆకుల పైన పిచికారీ చేయడం ద్వారా ఈ తెగుళ్లును నియంత్రించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లొర్ఫెరిఫాస్, ఎస్ఫేన్వాలేరేట్, లేదా ఇండొక్సాకార్బ్ వంటి కీటక నాశినులను ఆకులపైన పిచికారీ చేయడం ద్వారా గులాబీ ప్రత్తి బోల్ వార్మ్ ను నియంత్రించవచ్చు. ఇవి ఎర్ర ప్రత్తి పురుగు జనాభాను నియంత్రిస్తాయి. కానీ ఈ తెగులు ఆలస్యంగా పంటకు సంక్రమిస్తే రసాయనాలను వాడడం వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే పంట కొత్త సమయంలో వీటి అవశేషాలు ప్రత్తి కాయలపైన మిగిలే ఉంటాయి.

దీనికి కారణమేమిటి?

డేస్డేర్కేస్ సింగ్యులటస్ యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులవలన ఈ నష్టం కలుగుతుంది. పెద్ద పురుగులు 12-13 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఇవి ఒక ప్రత్యేకమైన నారింజ రంగులో ఉంటాయి. వీటి తల భాగం ఎర్రని రంగులో ఉండి తెల్లని కాలర్ను కలిగి ఉంటాయి. వీటి పొట్ట భాగం నల్లగా ఉంటుంది. ముందు రెక్కలు రెండు నల్లని చుక్కలు కలిగివుంటాయి. మగ పురుగులు ఆడ పురుగుల కన్నా చిన్నగా ఉంటాయి. ఆడ పురుగులు 130 వరకు ప్రకాశవంతంగా వున్న పసుపు రంగు గుడ్లను మట్టిలో పెడతాయి. 7-8 రోజుల తర్వాత పిల్ల పురుగులు బైటకు వచ్చి ప్రత్తి మొక్కలను తినడం మొదలు పెడతాయి. ఇవి కూడా ఎర్రని రంగులో ఉండి పొట్టపైన మూడు నల్లని చుక్కలు మరియు వీపు భాగంలో మూడు జతల తెలుపు రంగుమచ్చలు కలిగి ఉంటాయి. వాతావరణం బట్టి ఇవి 50-90 రోజులవరకు వృద్ధి చెందుతాయి. మొదటి కాయలు తెరుచుకునే సమయమైన సీజన్ చివర్లో ఈ తెగులు సంక్రమిస్తుంది. బెండ, హైబిస్కస్ మరియు నిమ్మజాతి మొక్కలు వీటికి ప్రత్యామ్న్యాయ అతిధులుగా ఉంటాయి. .


నివారణా చర్యలు

  • ఈ తెగులు లక్షణాలకోసం పొలాన్ని క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • వీటి జనాభా తక్కువగా వున్న సమయంలో ఈ పురుగులను చేతితో తొలగించండి.
  • బొంబాక్స్ చెట్లు మరియు మాల్వసియా జాతికి చెందిన మొక్కలను( హైబిస్కస్ ఆస్పెర్, H కన్నబినుస్ మరియు H ట్రియోనస్) వంటి ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలను తొలగించండి.
  • బెండ వంటి ఉచ్చు మొక్కలను వేసి పురుగులను అక్కడ సేకరించండి.
  • పొలంలో ఈ పురుగులు చేరే ప్రాంతంలో తేమ వలలను వేలాడదీసి వాటిని సేకరించండి.
  • ఈ పురుగులు రసాయనిక మందులకు నిరోధకతను పెంచుకోకుండా ఉండడానికి రసాయనాల వాడకాన్ని నియంత్రించండి.
  • ప్రత్తి కాయలు తెరుచుకున్న వెంటనే వాటిని సేకరించండి.
  • ప్రత్తిని సేకరించిన వెంటనే పొలంలో వున్న అన్ని ప్రత్తి మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • పొలాన్ని బాగా లోతుగా దున్ని లోపల వున్న గుడ్లు సూర్యరశ్మికి మరియు వీటి సహజ శత్రువులకు బహిర్గతం అయ్యేటట్టు చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి