Spodoptera littoralis
కీటకం
చాలా అధికంగా తినడం వలన పంటకి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. తరచుగా ఇది మొక్కల ఆకులను పూర్తిగా తింటుంది. ఇవి లేత ఆకులను తినడానికి ఇష్టపడతాయి కానీ ఎదిగే మొక్క భాగాలు, లేత రెమ్మలు, కాండాలు, మొగ్గలు, పండ్లు మరియు అన్ని మొక్కల భాగాలను కూడా తింటాయి. కాండం లోపలి భాగాలను లార్వా నమిలి తినడం ద్వారా రంధ్రాలు చేసి ఇతర వ్యాధులు కూడా మొక్కలకు సంక్రమించేలా చేస్తుంది. లార్వా చిన్న మొక్కలను ఎక్కువగా తింటే మొక్క యొక్క వృద్ధి మందగిస్తుంది మరియు అది చిన్నపరిమాణంలో పండ్లను ఉత్పత్తి చేస్తుంది లేదా ఫలాలను ఆలస్యంగా ఉత్పత్తి చేస్తుంది.
నివారణతో ప్రారంభించి సరైన సమీకృత 11సస్యరక్షణ చర్యలను చేపట్టడం చాలా ముఖ్యం. వీటిని సామూహికంగా పట్టుకోవడం మరియు సంభోగంలో అంతరాయాన్ని కలిగించడానికి లింగాకర్షక బుట్టల వాడకం చాలా ముఖ్యం.
ఈ తెగులు అనేక రసాయన సమ్మేళనాలకు నిరోధకతను కలిగి ఉంది. అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి.
సాధారణంగా ఇది శీతాకాలంలో మంచు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తుంది. గుడ్లు మరియు మొక్కల పదార్ధాలు లేదా మొలకల ద్వారా లార్వా పొలంలోకి ప్రవేశించవచ్చు. పెద్ద పురుగు చిన్న ద్రాక్ష పరిమాణంలో ఉంటుంది. దీని రెక్కలు బూడిద-గోధుమ రంగులో తెల్లటి గీతలతో ఉంటాయి. ఆడ చిమ్మటలు లేత ఆకుల దిగువన లేదా మొక్క యొక్క పైభాగాలపై వాటి గుడ్లను (20 నుండి 1,000 గుడ్లు) పెడతాయి: గుడ్లు తెల్లటి-పసుపు రంగులో ఉంటాయి మరియు ఆడ చిమ్మటల ఉదరం నుండి జుట్టు లాంటి పొలుసులతో కప్పబడి ఉంటాయి. లార్వా బొటనవేలంత పొడవు వరకు పెరుగుతాయి, వెంట్రుకలు లేకుండా మరియు వివిధ రంగుల్లో ఉంటాయి (ముదురు బూడిద నుండి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, తరువాతి దశల్లో ఎరుపు-గోధుమరంగు లేదా లేత పసుపు రంగులోకి మారుతాయి).