వరి

తెల్ల వెన్ను సుడి దోమ

Sogatella furcifera

కీటకం

క్లుప్తంగా

  • ఆకులు వాలిపోతాయి.
  • ఎదుగుదల తగ్గిపోతుంది.
  • గోధుమ రంగు కంకులు, తుప్పు పట్టినటువంటి లేదా నల్లని పగిలిన గింజలు.
  • ధాన్యం దిగుబడి తగ్గుతుంది.
  • కొనల వద్ద నల్లని చుక్క, అపారదర్శక ముందు రెక్కలు కలిగిన ముదురు రంగు సుడి దోమ.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఈ తెగులు సాధారణంగా వరి కంకులు ఏర్పడే దశలో సంభవించవచ్చు. నింఫ్స్ మరియు పెద్ద కీటకాలు రెండూ, సాధారణంగా ఆకులు మరియు కాడల మధ్య ప్రాంతంలో. కాండాల యొక్క ఎగువ భాగంలో కనబడుతాయి. ఇవి నాళాల కణద్రవ్యాన్ని తిని కణజాలాలను నష్టపరుస్తాయి. దాంతో నీరు మరియు పోషకాలను కోల్పోవడం, ఆకులు వాడిపోవడం మరియు మొక్కల పెరుగుదల సరిగా లేకపోవడం సంభవిస్తాయి. ఇవి వరి కంకులపైన దాడి చేయవచ్చు. ఫలితంగా గోధుమరంగు కంకులు, నల్లటి-చీలిన గింజలు, మరియు ధాన్యం ఉత్పత్తి తగ్గడానికి దారితీస్తుంది. ఇవి తినడంలో లేత మొక్కలకు ప్రాధాన్యతనిస్తాయి. అయితే పెరుగుదల యొక్క అన్ని దశలలోను వీటి దాడికి గురి కావచ్చు. తెగులు తీవ్రంగా ఉంటే మొక్కలు చనిపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సహజంగా లభించే జీవ సంబంధ నియంత్రణ ఏజెంట్లు ఎస్. ఫర్సిఫెరా యొక్క జనాభాను నియంత్రించగలవు. వేటాడే జీవులలో మిరిడ్ బగ్ సైటోరినస్ లివిడ్పెన్నిస్ మరియు కీటకం యొక్క గుడ్లపై దాడి చేసే కొన్ని అనాగ్రస్ జాతికి చెందిన ఫెయిరీ ఫ్లైస్ (ఎ. ఫ్లేవెలస్, ఎ. పెర్ఫోరేటర్, ఎ. ఆప్టబిలిస్ మరియు ఎ. ఫ్రీక్వేన్స్) కూడా వుంటాయి. ఇంకా ఈ కీటకంపై దాడి చేసే చాలా రకాల సాలీడ్లు( ఉదాహరణకు లైకొసా సుడోఅన్నులాటా వంటివి) కూడా వున్నాయి, చివరగా, శిలీంధ్ర పాథోజెన్ ఎరినియా డెల్ఫాసిస్ కూడా కీటకం యొక్క జనాభాను తగ్గించడానికి సహాయపడుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులను అధిక మొత్తంలో వినియోగించడం వలన ఈ కీటకాలు ఈ మందులను నిరోధకతను పెంచుకున్నాయి. సమర్థవంతమైన నివారణ పద్ధతుల కొరకు వోక్సమిల్, కొన్ని పెరిథ్రోయిడ్స్, బుప్రోఫెజిన్ మరియు పైమెట్రోజిన్ వంటి కీటక నాశినుల ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి.

దీనికి కారణమేమిటి?

తెల్ల వెన్ను సుడి దోమ, సోగటెల్లా ఫుర్సిఫెరా వలన ఈ నష్టం కలుగుతుంది. పెద్ద కీటకాలు దాదాపు 3 మి.మీ. పొడవు కలిగి, లేత గోధుమరంగు నుండి నలుపు రంగులో వుంటాయి, మరియు కొన వద్ద ముదురు గోధుమరంగు మచ్చ గల పాక్షిక పారదర్శకను ముందు రెక్కలు కలిగి వుంటాయి. ఈ పురుగు వరి మొక్కల స్రావాన్ని పీల్చుకుంటుంది, మరియు అధిక దిగుబడిని ఇచ్చే (కానీ ఆకర్షక) రకాల పై దాడి చేస్తుంది. దీని అధిక పునరుత్పత్తి సామర్థ్యం మరియు వలస అలవాట్లు ఈ పురుగులను తూర్పు-ఆసియా మరియు ఆస్ట్రేలియాలలో వరి యొక్క ఒక ప్రధాన తెగులు కీటకంగా చేస్తుంది. S. ఫుర్సిఫెరాఎస్ఒక నిరంతర పద్ధతిలో వైరస్ లను కూడా రవాణా చేస్తుంది, ఉదాహరణకు వరి నల్లమచ్చల మరుగుజ్జు వైరస్ మరియు దక్షిణ వరి నల్లమచ్చల మరుగుజ్జు వైరస్. నాటే సమయం, నత్రజని అధికంగా గల ఎరువుల యొక్క అధిక వాడకం మరియు సాగుకు నీటి లభ్యత అనేవి వీటి జనాభాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఉష్ణోగ్రత, తేమ లేదా వర్షపాతం వంటి పర్యావరణ కారకాలు కూడా దీని జీవిత చక్రంలో కీలక పాత్ర పోషిస్తాయి.


నివారణా చర్యలు

  • నాటేటప్పుడు తెగులు నిరోధక రకాలను ఎంచుకోండి.
  • ఈ పురుగుల అధిక జనాభాను నివారించడానికి సీజన్ కన్నా ముందుగా నాటండి లేదా తొందరగా పరిపక్వతకు వచ్చే విత్తన రకాలను ఎంచుకోండి.
  • కీటకం యొక్క జీవిత చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి చుట్టుప్రక్కల పొలాలతో పాటు ఏకకాలంలో నాటండి.
  • నత్రజని విడతలవారీగా వేయండి.
  • సంవత్సరానికి రెండు పంటల కంటే ఎక్కువ వేయకండి.
  • కొంత కాలం పాటు పొలాలలో వరి పంటను వేయకండి లేదా బీడుగా ఉంచండి.
  • ఈ చీడ తీవ్రంగా వుంటే, పంట సీజన్లో, పొలాలను 3 లేదా 4 రోజుల పాటు రెండు సార్లు పొలంలోనుండి నీటిని బైటకు పంపండి.
  • విస్తృత పరిధి కల పురుగు మందులను వాడకండి, ఎందుకంటే ఇది సహజ శతృవులను ప్రభావితం చేయవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి