ఇతరములు

డైమండ్‌ బ్యాక్ పురుగు

Plutella xylostella

కీటకం

క్లుప్తంగా

  • గొంగళి పురుగులు మొక్క ఆకులలో చాలా చిన్న రంధ్రాలను చేసి తింటాయి.
  • తరచుగా ఇవి ఆకు పైపొర పైన తిన్న రంధ్రాలను చేస్తాయి.
  • బ్రోకొల్లి ఫ్లోరెట్స్ మరియు కాలీఫ్లవర్ లోపల ప్యుపాగా రూపాంతరం చెందడం ద్వారా ఇవి కూరగాయలను కలుషితం చేస్తాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు
క్యాబేజీ
కనోల
కాలీఫ్లవర్

ఇతరములు

లక్షణాలు

సాధారణంగా డైమండ్‌బ్యాక్ పురుగు చాలా తక్కువ తీవ్రత కలిగిన తెగులుగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, అధిక సాంద్రతలలో అవి బ్రాసికా పంటలకు ఇబ్బందికరంగా మారతాయి. ఆకు కణజాలాలలో సొరంగాలు త్రవ్వడం లేదా ఆకు ఈనెల మధ్య భాగం యొక్క దిగువ భాగంపై లార్వా గీయడం వలన నష్టం జరుగుతుంది. క్రమరహిత పట్టీలు కనిపిస్తాయి (ఆకు పైపొర నుండి కూడా) అప్పుడప్పుడు చెక్కుచెదరకుండా వదిలివేయవచ్చు, ఇది కిటికీ ఎఫెక్ట్ ను సృష్టిస్తుంది. పెద్ద లార్వా విపరీతంగా తింటుంది తీవ్రమైన ముట్టడి సమయంలో ఆకు ఈనెలు మినహా మిగిలిన ఆకు మొత్తం (ఆకు అస్థిపంజరం) తినేయవచు. ఫ్లోరెట్స్‌పై లార్వా ఉనికి వలన బ్రోకలీ లేదా కాలీఫ్లవర్‌లో తలలు ఏర్పడటంలో అంతరాయం కలుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

డైమండ్‌బ్యాక్ పురుగు యొక్క శత్రువులలో పరాన్నజీవి కందిరీగలు డయాడెగ్మా ఇన్సులేర్, ఓమిజస్ సోకోలోవ్స్కీ, మైక్రోప్లిటిస్ ప్లూటెల్లే, డయాడ్రోమస్ సబ్టిలికోర్నిస్ మరియు కోటేసియా ప్లూటెల్లా ఉన్నాయి. పరాన్నజీవులతో పాటు, జనాభాను నియంత్రించడానికి ఎంటోమోపాథోజెనిక్ శిలీంధ్రాలు లేదా న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ను ఉపయోగించవచ్చు. బాసిల్లస్ తురింగియెన్సిస్ కలిగి ఉన్న పురుగుమందుల ద్రావణాలు కూడా ఉపయోగపడతాయి, అయినప్పటికీ నిరోధకత వృద్ధిని నివారించడానికి ఉత్పత్తుల రొటేషన్ సిఫార్స్ చేయబడింది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చాలా రకాల పురుగుమందులకు ఈ తెగులు విస్తృతంగా నిరోధకత కలిగి ఉంది. (కొన్ని జీవసంబంధమైన వాటితో సహా), కాబట్టి క్రియాశీల పదార్ధాల రొటేషన్ బాగా సిఫార్సు చేయబడింది. 80 ల దశకంలో భారీ వాడకం తర్వాత పైరెథ్రాయిడ్లు కలిగిన ఉత్పత్తులు ఇప్పటికే విఫలమయ్యాయి.

దీనికి కారణమేమిటి?

డైమండ్‌బ్యాక్ పురుగు ప్లూటెల్లా జిలోస్టెల్లా యొక్క లార్వా వలన ఈ నష్టం జరుగుతుంది. బ్రాసికా కుటుంబానికి చెందినవి మరియు బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి మరియు టర్నిప్ అలాగే అనేక కలుపు మొక్కలు వీటి ప్రధాన అతిధి మొక్కలు. పెద్ద పురుగుల చిన్నగా సన్నగా, సుమారు 6 మిమీ పొడవు మరియు పైకి వచ్చిన యాంటెన్నా కలిగి ఉంటాయి. వీటి శరీరం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఇవి బాగా ఎగరలేవు, అయితే గాలి ద్వారా దూరంగా ప్రయానింపబడతాయి. ప్రతి ఆడ పురుగు ఒక ఆకు కింద భాగంలో సగటున 150 గుడ్లు పెడుతుంది. సాధారణంగా ఎనిమిది వరకు చిన్న సమూహాలలో మరియు ఆకు ఈనెల దగ్గర ఇవి గుడ్లు పెడతాయి. చిన్న లార్వాకు ఆకు-మైనింగ్ ( ఆకుల లోపల జీవిస్తూ ఆకులని తినడం) అలవాటు ఉంటుంది, అయితే పెద్ద లార్వా ఆకు యొక్క దిగువ ఉపరితలంపై తింటాయి, ఫలితంగా క్రమరహిత పట్టీలు ఏర్పడతాయి. చిన్న లార్వాకు వర్షపాతం ప్రధాన మరణ కారకంగా గుర్తించబడింది.


నివారణా చర్యలు

  • ఆవాలు, ఎర్ర ముల్లంగి మరియు కోహ్ల్రాబి వంటి నిరోధక రకాలను ఎంచుకోండి.
  • నిగనిగలాడే రకాలను ఎన్నుకోండి.
  • సాధారణ మైనపు ఉపరితలం (బూడిదరంగు ఆకుపచ్చ రంగు కంటే పచ్చని రంగులో ఉండడం) లేకపోవడం.
  • ఎందుకంటే ఇవి ఈ తెగులుకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి.
  • నాటడానికి ముందు మొక్కలకు కీటకాలు లేకుండా ఉండేలా చూసుకోండి.
  • లార్వా చేసిన నష్టం లేదా వీటి ఉనికి యొక్క సంకేతాల కోసం పొలాన్ని గమనిస్తూవుండండి.
  • (ప్రతి 3 మొక్కలకు 1 లార్వా లేదా ఒక మొక్కకు ఒక రంధ్రం పరిమిత విలువ).
  • పెద్ద పురుగులను పట్టుకోవడానికి మరియు వాటి జనాభా సంఖ్యను అంచనా వేయడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించండి.
  • వర్షం పడినట్టు ఉంటుంది కాబట్టి వీలైతే ఓవర్ హెడ్ స్ప్రింక్ల్ ఇరిగేషన్ ఉపయోగించండి.
  • ఈ తెగులు సోకని పంటలను అంతర పంటగా వేయండి.
  • ఇతర జాతుల పంటలతో పంట మార్పిడి చేయండి.
  • పంట కోతల తర్వాత పంట వ్యర్థాలను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి