నిమ్మజాతి

ఊదా రంగు పొలుసు పురుగు

Lepidosaphes beckii

కీటకం

క్లుప్తంగా

  • కోలాకారపు, చదునైన, ఊదా గోధుమరంగు పురుగులు మొక్కల ఉపరితలాలపై చిన్న గడ్డల వలె కనిపిస్తాయి.
  • ఇవి తిన్న పండ్లపై ఆకుపచ్చని మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఊదా పొలుసు పురుగులు పండ్లు, ఆకులు, కొమ్మలు మరియు కాండంతో సహా మొక్కల అన్ని ఉపరితలాలకు అంటుకుని ఉంటాయి. ఇవి మొక్క యొక్క కణజాల రసాన్ని పీలుస్తాయి, ఇది కనిపించే అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ పొలుసు పురుగులు తిన్న ప్రాంతంలో పండిన పండ్లు ఆకుపచ్చగా మారడం ప్రారంభిస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారుతాయి మరియు రాలిపోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, కొమ్మల చివరలు చనిపోవడం ప్రారంభించవచ్చు మరియు ఈ నష్టం కొమ్మల ప్రధాన భాగం వైపు వెనుక వరకు వ్యాపిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

శీతాకాలం చివరిలో మొదటి గుడ్లు పొదిగే ముందు లేదా మీరు ముట్టడిని ముందుగానే గుర్తించినట్లయితే డార్మెంట్ ఆయిల్ మరియు సున్నపు గంధకంతో చెట్లను పిచికారీ చేయండి. చిన్న చెట్లకు, లేదా పెద్ద చెట్ల యొక్క చేరుకోగల భాగాలకు, మీరు ప్లాస్టిక్ డిష్ స్క్రబ్బర్‌ని ఉపయోగించి భారీగా ఉన్న పొలుసు పురుగులను తొలగించవచ్చు. సాధారణంగా, వీటి సహజ శత్రువులు ఈ కీటకాల జనాభాను అదుపులో ఉంచుతాయి కాబట్టి సాధారణంగా ఇవి పెద్ద సమస్య కాదు.

రసాయన నియంత్రణ

ఇవి సాధారణంగా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి, కానీ ఇవి పెద్ద సంఖ్యలో ఉంటే తీవ్రమైన హానిని కలిగిస్తాయి. అందువలన వీటి జనాభా అధికంగా ఉన్నప్పుడు రసాయన నియంత్రణ అవసరం. వీటిని మీరు గమనించిన తర్వాత వీటిని పురుగుమందులతో చంపడం చాలా కష్టం, ఎందుకంటే వీటి పైపొలుసు చాలా గట్టిగా మారి వీటిని రక్షిస్తుంది. వీటిని నియంత్రించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, ఇవి చిన్నగా ఉండి పై పొలుసు గట్టిపడకముందే మరియు ఆహారం తీసుకోవడానికి ఒక ప్రాంతంలో స్థిరపడకముందే, సీజన్ ప్రారంభంలోనే చికిత్స చేయడం. సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వంటి బలమైన, విస్తృత పరిధి కల క్రిమిసంహారకాలను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం, ఎందుకంటే ఈ పురుగు మందులు ప్రయోజనకరమైన వీటి సహజ శత్రువులను కూడా చంపగలవు. మొక్క ద్వారా శోషించబడే క్రిమిసంహారకాలను ఉపయోగించడానికి ప్రాధాన్యం ఇవ్వండి.

దీనికి కారణమేమిటి?

మీ మొక్కపై ఉన్న గడ్డలు పెద్ద ఆడ ఊదా రంగు పొలుసు పురుగులు. అవి ఎక్కడికి కదలకుండా ఊదా-గోధుమ రంగు రక్షిత తొడుగు కింద దాగి ఉంటాయి. ఆడ పురుగు తన రక్షణ పొలుసు క్రింద గుడ్లు పెడుతుంది, అవి ఇక్కడే శీతాకాలంలో సురక్షితంగా ఉండి మే చివరి లేదా జూన్‌ నెలలో పొదుగుతాయి. ఈ పురుగులు సంవత్సరానికి ఒకసారి పునరుత్పత్తి చేస్తాయి. చిన్న పురుగులు నడవడం ద్వారా, మరియు గాలి, వాహనాలు, జంతువులు, పక్షులు మరియు ప్రజల బట్టల ద్వారా కొత్త మొక్కలకు వ్యాపిస్తాయి. ఈ పురుగులు కలిగిఉన్న మొక్కల పదార్థాల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి.


నివారణా చర్యలు

  • తెగులు లేని మొక్క పదార్థాలను ఉపయోగించండి.
  • మొక్కలకు తగినంత నీరు మరియు పోషకాహారం అందించడం ద్వారా వాటిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల అవి తెగుళ్లను నిరోధించడంలో సహాయపడతాయి.
  • తోటలలో పొలుసు పురుగుల ఉనికి కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అవసరం.
  • పెద్ద పురుగుల కోసం, ముఖ్యంగా నీడ లేదా ఇవి ఆశ్రయం పొందే ప్రదేశాలలో ఆకులు లేదా లేత కాండం యొక్క క్రింది భాగాన్ని తనిఖీ చేయడం మర్చిపోవద్దు.
  • వీటి ఉనికిని ముందుగానే గుర్తించడం చాలా కీలకం! మీరు పెద్ద పురుగులను కంటితో సులభంగా చూడగలిగినప్పటికీ, చిన్న పురుగులను గుర్తించడం కష్టం.
  • మొదటి తరం చిన్న పురుగులను గుర్తించడానికి, గతంలో ఇవి సోకిన చెట్ల కొమ్మల చుట్టూ రెండు వైపులా జిగురు ఉండే టేప్‌ను చుట్టండి.
  • చిన్న పురుగులు పరిమాణంలో చిన్నగా ఉండి, చదునుగా, పారదర్శకంగా మరియు సన్నని కాళ్ళను కలిగి ఉంటాయి.
  • చిన్న పురుగులు ఈ జిగురు టేప్ కి అతుక్కున్నాయో లేదో చూడటానికి ప్రతిరోజూ టేప్‌ను తనిఖీ చేయండి.
  • టేప్ తడిగా లేదా మురికిగా ఉంటే, దాన్ని మరొక టేప్ తో భర్తీ చేయండి.
  • ప్రత్యామ్నాయంగా, మీరు కొమ్మల క్రింద తెల్లటి కాగితాన్ని పట్టుకుని, వాటిని కర్రతో నొక్కవచ్చు.
  • తెలుపు, పసుపు, నారింజ లేదా ఊదా రంగులో ఉండే ఈ పురుగులు ఈ తెల్లని కాగితంపై పడి స్పష్టంగా కనిపిస్తాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి