కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

పొక్కు పెంకు పురుగు

Mylabris pustulata

కీటకం

క్లుప్తంగా

  • పూరేకులను తినడం ద్వారా ఈ పెంకు పురుగులు పువ్వులకు నష్టం కలుగచేస్తాయి.
  • స్తిగా మరియు అండాశయం దెబ్బ తింటాయి కాయలు ఏర్పడవు.

లో కూడా చూడవచ్చు


కంది పప్పు మరియు ఎర్ర కంది పప్పు

లక్షణాలు

పెద్ద పొక్కు బీటిల్ ప్రధానంగా పువ్వులను తింటుంది. లేత ఆకులు మరియు చిగుర్లపై కూడా ఇవి తిన్న నష్టం కనిపిస్తుంది. పెంకు పురుగులు తరచూ బీన్స్‌ పై సమూహంగా దాడి చేస్తాయి, కాని సాధారణంగా పొలంలో చిన్న పాచెస్ లా ఉంటాయి. సాధారణంగా ఇవి వేరే ప్రాంతాలకు వెళ్లడానికి ముందు ఎక్కువ సేపు ఆహారం తీసుకోవు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

మొక్కల చుట్టూ డాటోమాసియస్ మట్టిని చల్లడం ద్వారా బీటిల్స్ పరిధి మరియు సంఖ్యను తగ్గించండి. పిగ్‌వీడ్ (అమరాంథస్ ఎస్.పి.పి.), ఐరన్‌వీడ్ (వెరోనియా ఎస్.పి.పి.), మరియు రాగ్‌వీడ్ (అంబ్రోసియా ఎస్.పి.పి) వంటి జాతులను మీ వ్యవసాయ భూముల నుండి దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇవి పొక్కు పెంకు పురుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఓ ఎం ఆర్ ఐ లో లిస్ట్ చేయబడిన బయోపెస్టిసైడ్ అయిన స్పినోసాడ్ కలిగిన పిచికారీలు 24 నుండి 48 గంటల మధ్య బీటిల్స్ ను చంపగలవు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండోక్సాకార్బ్ మరియు డెల్టామెత్రిన్ ఆధారంగా ఉత్పత్తులను సిఫార్సు చేశాయి.

దీనికి కారణమేమిటి?

పెద్ద పొక్కు బీటిల్ వల్ల నష్టం సంభవిస్తుంది, ఇవి ప్రధానంగా పువ్వులను తింటాయి మరియు తక్కువ ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. పెద్ద పురుగులు సోయాబీన్ పువ్వులు, లేత కాయలు లేదా లేత కాండాన్ని కూడా తినవచ్చు. అయినప్పటికీ ఈ మొక్క భాగాలు దెబ్బతినవు. పెద్ద పురుగులు వాటి మెడ భాగం కంటే విశాలమైన తలలను కలిగి ఉంటాయి మరియు అవి మధ్యస్తంగా పొడవుగా వుండే యాంటెన్నా మరియు కాళ్ళను కలిగి ఉంటాయి. అంచులు కలిగిన పెంకు పురుగు నలుపు, బూడిదరంగు లేదా ఈ రెండు రంగుల మిశ్రమంతో ఉంటుంది. చారల పొక్కు పెంకు పురుగులు ముదురు చారలతో నారింజ రంగులో ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఒకసారి బీటిల్స్ ఉన్నట్లు భావిస్తే, పంటలను జాగ్రత్తగా పరిశీలించి చికిత్స చేసి ముట్టడిని నివారించండి.
  • వరుసలపై కవర్లు అమర్చి మీ మొక్కలను రక్షించండి.
  • బీటిల్స్ ను ఒక బకెట్ సబ్బు లేదా కిరోసిన్ కలిపిన నీటిలో కర్రతో సేకరించి వాటిని నియంత్రించండి (వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు ).
  • మీ పొలాన్ని లక్ష్యంగా చేసుకోకుండా బీటిల్స్ ను నివారించడానికి ప్రతి సీజన్ ప్రారంభంలో ఆల్చిప్ప సున్నం గుల్ల ను వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి