Amrasca biguttula
కీటకం
తెగులు సోకిన ఆకులు ముందు పసుపు రంగులోకి మారి తరువాత గోధుమరంగులోకి, ఆకు అంచులనుండి మధ్య ఈనె వైపుకు రంగు మారుతాయి. ఆకులు ఎండిపోయి రాలిపోకముందే ముడుచుకు పోతాయి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే, లేత మొక్కలలో పెరుగుదల తగ్గి ఆకులపై “హోపర్ బర్న్” లక్షణం కనిపిస్తుంది. పంట చివరి దశలలో ఈ తెగులు ఆశించినట్లయితే, చాలా సందర్భాల్లో దిగుబడి తగ్గి ప్రత్తి నాణ్యత క్షీణిస్తుంది.
లేస్ వింగ్ కీటకాలు (క్రైసోపేర్లా కార్నియా) ఓరియస్ లేదా జియోకోరిస్ అనే జాతులకు చెందిన కీటకాలు కాక్సినేలిడ్స్ జాతులు మరియు సాలీడు పురుగులు ఈ పురుగులను తింటాయి. కావున సాధ్యమైనంతవరకు కీటక నాశినుల వాడకం తగ్గించి వీటి సంఖ్యను పెంచుకోవాలి. మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే స్పైనోసాద్ (౦.35 మి లీ/ లీ) వాడండి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మలాథియాన్, సైపర్మేత్రిన్ (1 మి లీ/లి) సల్ఫాక్సాఫ్లొర్, క్లొర్ఫైరీఫోస్, (2.5 మి లీ/ లీ), డైమిధోయెట్, లాంబ్డా-సైహాలోత్రిన్ (1 మి లీ/లీ) లేదా క్లొరాన్త్రనిలిప్రోల్ + లాంబ్డా-సైహాలోత్రిన్ (0.5 మీ లీ/లీ) ఆధారిత పురుగు మందుల సూత్రీకరణలను వాడొచ్చు. ఈ రసాయనాలు పచ్చదోమను తినే ఇతర కీటకాలను కూడా చంపుతాయి. అందువలన పచ్చదోమ ఉదృతి అధికంగా ఉన్నపుడు మాత్రమే సమయానుకూలంగా ఈ మందులను పిచికారీ చేయాలి.
ఆమ్రస్క కీటకం యొక్క పిల్ల మరియు పెద్ద పురుగుల వలన నష్టం కలుగుతుంది. ఇవి మొక్క యొక్క కణ ద్రవ్యాన్ని పీల్చి దాని యొక్క లాలాజలం ద్వారా విష రసాయనాలను లోనికి ప్రవేశపెడతాయి. ఈ లాలాజల విషాలు కణజాలాన్ని నాశనం చేసి కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకుండా చేసే సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో, మధ్యస్దం నుండి అధిక ఉష్ణోగ్రతలు, అంటే 21 నుండి 31°C, మరియు అధిక తేమ, అంటే 55- 85%) కలిగిన వాతావరణ పరిస్ధితులు ఉన్నట్లైతే ఇవి పురుగుల అభివృద్ధికి మరియు కార్యకలాపాలకు దోహదపడతాయి. తక్కువ ఉష్ణోగ్రతలు మరియు బలమైన గాలుల సమయంలో పురుగుల వ్యాప్తి తక్కువగా ఉంటుంది.