అరటి

అరటి పండ్లపైన మచ్చలు కలుగచేసే పెంకు పురుగులు

Colaspis hypochlora

కీటకం

క్లుప్తంగా

  • అరటికాయ తొక్క మరియు లేత ఆకుల మీద తీవ్రమైన మచ్చలు ఏర్పడుతాయి.
  • ఈ మచ్చలు అండాకారంలో ఉంటాయి.
  • లార్వా వేర్లను ఆహారంగా తినడం వలన మొక్కలు దెబ్బతింటాయి.

లో కూడా చూడవచ్చు


అరటి

లక్షణాలు

పెద్ద కీటకాలు వివిధ కలుపు మొక్కలను మరియు సుడి ఆకులను, కాండం, మరియు అరటి చెట్ల వేర్లను ఆహారంగా తింటాయి. అవి లేత కాయలను కూడా తింటాయి మరియు గాయాలను లేదా మచ్చలను ఏర్పరచి రంగు మార్చడం వలన అమ్మకానికి పనికిరావు. గాయాలు ఎక్కువగా కాయ మొదలు వద్ద అవుతాయి, కీటకాలు తినడం కోసం అత్యంత అనుకూలమైన మచ్చలను ఎంచుకుంటాయి (ఉదాహరణకి అరటి పువ్వు క్రింద) మచ్చలు ఎక్కువగా అండాకారంలో ఉంటాయి మరియు ఫ్రూట్-స్కేరింగ్ తేనెటీగ మెలిపోన అమల్టెయా ను పోలి ఉంటాయి. అవకాశవాద రోగకారకాల ద్వారా కణజాలం దెబ్బతిని నష్టం మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. లేత వేర్లను లార్వాలు తింటాయి, మరియు ముదురు వాటి కణజాలం తినడానికి వాటి మీద రంద్రాలను చేస్తాయి. వర్షాకాలంలో ఈ తెగులు అధికంగా ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

దీనికి జీవ సంబంధ చికిత్సలు ఇంత వరకు అందుబాటులో లేవు. దీని నియంత్రణకు ఉత్తమ మార్గం కలుపును తొలగించడం.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులుకు రసాయనాలు సిఫారస్సు చేయడం కంటే, సరిగ్గా కలుపు తీయుట వలన పురుగుల ఉదృతిని తగ్గించడమే కాక మందుల వాడకాన్ని కూడా తగ్గించవచ్చును. పురుగుమందుల సూత్రీకరణలు వ్యాధి తీవ్రతను బట్టి పిచకారి చెయ్యాలి. కీటకాలు తీవ్రమైన ఆర్ధిక నష్టాలను కలిగించనంత వరకు పురుగు మందుల వాడరాదు.

దీనికి కారణమేమిటి?

ఫ్రూట్-స్కేరింగ్ బీటిల్, కోలోస్పిస్ హైపోక్లోరా వలన నష్టం జరుగుతుంది. పెద్ద వాటి యొక్క ముందరి రెక్కలు గోధుమ రంగులో, వరుసలుగా చిన్న చిన్న చుక్కలతో ఉంటాయి. అవి బాగా ఎగరగలవు. ఆడపురుగు పాలే లెమన్-పసుపుపచ్చ రంగులో విడివిడిగా కాని లేదా దెగ్గర దెగ్గర కాని 5 నుండి 45 గుడ్ల వరకు పెడుతాయి. ఆకు తొడిమలో తినడం ద్వారా కొంత స్థలం ఏర్పాటు చేసుకొని అరటి కాయల గెల తొడిమకు దగ్గర గుడ్లు పెడుతాయి. 7 నుండి 9 రోజుల తరువాత, కొత్తగా పొదగబడిన లార్వాలు లేత వేర్లను తినడం లేదా ముదురు వాటిలోని గుజ్జును తినడానికి, ముదురు వేర్ల మీద రంద్రాలను చేస్తాయి. ఇవి తెల్లటి, సన్నని మరియు వెంట్రుకల శరీరాన్ని కలిగి ఉంటాయి మరియు తల కొంతవరకు లేత నారింజ రంగు కలిగి ఉంటుంది. ప్యూపాలు మురికి పసుపుగా వుండి ముదురు రంగులోకి మారి అక్కడ నుండి బయటపడడం జరుగుతుంది.


నివారణా చర్యలు

  • ఈ పురుగులు కలుపు మొక్కలపైన జీవిస్తాయి అందువలన తోటలోని కలుపు మొక్కలను పూర్తిగా తొలగించండి.
  • మురికి కాలువల వద్ద అరటి చెట్లు నాటవద్దు.
  • అరటి పిలకలను నేల మట్టం కన్నా క్రిందికి తొలగించి అరటి చెట్లలో లార్వా పరిణితి చెందే భాగమైన రైజోమును కత్తిరించండి.
  • దెబ్బతిన్న మొక్క భాగాలను తోట నుండి తొలగించండి.
  • మట్టిని క్రిందనుండి పైకి తిరగదోడి ప్యుపాను పరాన్న జీవుల కంట పడే విధంగా చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి