మామిడి

జీడిపప్పు ఆకు చార తెగులు

Acrocercops syngramma

కీటకం

క్లుప్తంగా

  • మామిడి ఆకు పైబాగాలు మరియు లేత చిగుర్ల మైనింగ్.
  • లేత ఆకులపై కాలిన గుర్తులు.
  • ఆకులపై పొక్కులున్న బూడిద-తెలుపు పాచెస్ ఏర్పడతాయి.
  • తరువాత ఇవి పెద్ద రంధ్రాలుగా మారుతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

దాడి యొక్క ప్రారంభ సంకేతాలు లేత ఆకులపై లార్వా చేత మైనింగ్ చేసినట్టు కనిపిస్తాయి. ఆకు పై పొరలను తాకకుండా ఆకు కణజాలాలను లార్వా తింటుంది. తెల్లటి, పొక్కులు కలిగిన పాచెస్ ఆకు ఉపరితలంపై కనిపిస్తాయి, ఇక్కడ అనేక తవ్విన భాగాలు విలీనం అవుతాయి. ముదురు, పరిపక్వ ఆకులలో ఈ నష్టం పెద్ద రంధ్రాలుగా కనిపిస్తుంది. ఆకు యొక్క తవ్వబడిన భాగాలు ఎండిపోవడం మరియు విరిగిపోవటం వలన ఇది సంభవిస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

డిగ్లిఫస్ ఇసియా వంటి పరాన్నజీవి కందిరీగలను వాడండి, ఇది ఆకు మైనర్ లార్వాలపై పరాన్నజీవిగా జీవించి ఇవి ప్యూపా దశకు చేరుకోవడానికి ముందే వాటిని చంపుతాయి. మొక్కల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సేంద్రియ ఎరువులను వాడండి. ఫ్లోటింగ్ రో కవర్లను ఉపయోగించడం ద్వారా పెద్ద పురుగులు ఆకులపై గుడ్లు పెట్టకుండా నిరోధించండి. గుడ్డు పెట్టే పెద్ద పురుగులను పట్టుకోవడానికి పసుపు లేదా నీలం రంగు జిగురు ఉచ్చులు ఉపయోగించవచ్చు. లార్వా నేల మీద పడకుండా మరియు ప్యుపాగా మారకుండా ఉండటానికి తెగులు సోకిన మొక్కల క్రింద ఉన్న మట్టిని ప్లాస్టిక్ కవర్లతో కప్పాలి. వేప నూనె మరియు సైపర్‌మెత్రిన్ యొక్క సాంద్రీకృత పిచికారీ కీటకాల పెరుగుదల మరియు వృద్ధికి అంతరాయం కలిగిస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మోనోక్రోటో ఫాస్ 36 డబ్ల్యు ఎస్ సి 0.05% (@ 0.5 మి.లీ / లిటర్) ను పిచికారీ చేయండి. వేగంగా పనిచేసే బొటానికల్ పురుగుమందులను చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగించాలి.

దీనికి కారణమేమిటి?

ఆకు మైనర్ల లార్వా వలన ఈ నష్టం జరుగుతుంది. వెండి బూడిద రంగులో వుండే పెద్ద పురుగు లేత ఆకులపై గుడ్లు పెడుతుంది. పరిపక్వతకు ముందు, లార్వా సాధారణంగా నిస్తేజంగా తెల్లని రంగులో ఉండి తరువాత గులాబీ లేదా ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది. లార్వా మట్టిలో పడిపోయి 7-9 రోజుల తరువాత పరిపక్వత చెందుతుంది. మొత్తం జీవిత చక్రం 20 నుండి 40 రోజుల మధ్య ఉండొచ్చు ఈ నష్టం మొక్కల కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివలన ఆకులు ఎండి రాలిపోయి ఉత్పత్తికి భారీ నష్టం కలుగుతుంది.


నివారణా చర్యలు

  • ముందుగా చర్యను తీసుకోవడానికి సీజన్ ప్రారంభం నుండి మొక్క ఆకులను గమనిస్తూ వుండండి చిన్న తోటలలో తీవ్రంగా తెగులు సోకిన ఆకులను తొలగించి నాశనం చేయండి.
  • మొక్కల నష్టానికి సహన శక్తి మరియు నిరోధకత కలిగి ఉండడానికి సరైన నీటి యాజమాన్య పద్దతులను అనుసరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి