Altica ampelophaga
కీటకం
పెద్ద పెంకు పురుగులు మరియు లార్వాలు ఆకుల మీద ఉత్పత్తి చేసే లక్షణాలు భిన్నంగా ఉంటాయి. పెద్ద పెంకు పురుగులు కొమ్మలను చీల్చి చిన్న చిన్న రంధ్రాలను చేసి ఆకులను తింటాయి. లార్వాలు ఆకుల పైభాగాన్ని తిని ఆకు క్రింది భాగంలో పైపొరకు రంధ్రాలను మాత్రమే వదిలివేస్తుంది. శీతాకాలం తర్వాత, పెద్ద పెంకు పురుగులు త్వరగా బైటకు రావడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటే చాలా పెద్ద మొత్తంలో నష్టం కలుగుతుంది. వసంత ఋతువు ప్రారంభంలో ఇవి చురుకుగా మారితే ఆకులను మాత్రమే కాకుండా అప్పుడే వికసించిన ద్రాక్ష మొగ్గలను కూడా మ్రింగివేస్తాయి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే ఇవి ఆకులను అస్థిపంజరంలాగ చేయవచ్చు మరియు కొత్తగా ఏర్పడిన పూల గుత్తులను నాశనం చేయవచ్చు. ఎక్కువ మరియు కఠినమైన ఆకులు కలిగిన రకాలు దాడులను బాగా అడ్డుకుంటాయి మరియు మొగ్గలు తగినంత పెరిగిన తర్వాత నష్టం స్వల్పంగా ఉంటుంది. ఈ బీటిల్స్ ద్రాక్ష పండ్లకు పెద్దగా నష్టం కలిగించవు.
వీటిని వేటాడి తినే జిక్రోనా కోరులియా (బ్లూ బగ్) వైన్ ఫ్లీ బీటిల్ యొక్క ప్రధాన జీవ నియంత్రణ వాహకం. తెగులు నియంత్రణలో ఇతర కీటకాలు మరియు పాలిఫాగస్ పరాన్నజీవులను కూడా ఉపయోగించవచ్చు. మట్టికి వర్తించే ప్రయోజనకరమైన నెమటోడ్లు లార్వాలను నాశనం చేస్తాయి మరియు తరువాతి తరం పెద్ద పెంకు పురుగులు బైటకి రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి. మొదటిసారి పెద్ద పెంకు పురుగులను గమనించిన తరువాత స్పినోసాడ్ లేదా వేప నూనె సూత్రీకరణలను పిచికారీ చేయడం వలన ఇవి జనాభాను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైన్ ఫ్లీ బీటిల్‌కు వ్యతిరేకంగా సిఫార్స్ చేయబడిన క్రియాశీల పదార్ధాలలో క్లోర్ఫేరీఫాస్ , లాంబ్డా సైహలోథ్రిన్ సూత్రీకరణలు ఉన్నాయి. పెద్ద పెంకు పురుగులు మొదటిసారి కనబడిన తరువాత పిచికారీ చేయడం లేదా డస్టింగ్ చేయడం ద్వారా అప్లై చేయాలి.
వైన్ ఫ్లీ బీటిల్, ఆల్టికా ఆంపెలోఫాగా వల్ల నష్టం జరుగుతుంది. ఈ మెరిసే లోహపు రంగు పెంకు పురుగులు వసంతకాలంలో, ఇవి కొత్తగా వచ్చే ఆకులు లేదా ద్రాక్ష మొగ్గలపై దాడి చేసినప్పుడు చురుకుగా ఉంటాయి. పర్యావరణ కారకాలపై ఆధారపడి వివిధ వృద్ధి దశల వ్యవధి గణనీయంగా మారుతుంది. ఆడ పురుగులు వీటి జీవితకాలంలో అనేక వందల గుడ్లను ఆకుల దిగువ భాగంలో గుంపుగా పెడతాయి. సాధారణంగా, గుడ్లు పెట్టె స్థితి తర్వాత 1-2 వారాలకు గుడ్లు పొడగబడతాయి. అప్పుడు లార్వా 1 నెల వరకు ఆకులను తింటుంది. ఈ సమయంలో అది మూడు వృద్ధి దశలను దాటుతుంది. తర్వాత ఇవి మట్టిలో 5 సెంటీమీటర్ల లోతులో ప్యూపా దశకు చేరి తరువాతి తరం యొక్క పెద్ద పురుగులు 1-3 వారాల తరువాత బైటకి వస్తాయి. సాధారణంగా సంవత్సరానికి 2 లేదా కొన్నిసార్లు 3 తరాలు ఉంటాయి. చివరి తరం పెద్ద పురుగులు ఆకు చెత్త లేదా ఇతర ప్రాంతాల మధ్య నిద్రాణస్థితికి చేరతాయి.