ఇతరములు

పండ్ల చెట్టు ఆకు ముడుత తెగులు

Archips argyrospila

కీటకం

క్లుప్తంగా

  • వికసించిన పూలపై, పూ మొగ్గలపై చిన్న లార్వా రంధ్రాలు చేసి అంతర్గత కణజాలాలను దెబ్బతీస్తుంది.
  • పరిపక్వత చెందిన పురుగులు పట్టు దారాలతో ఆకును చుట్టబెట్టి వాటికి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి.
  • దాడికి గురైన ఆకులు చిరిగిపోయిన రూపాన్ని కలిగి వుండి తీవ్రమైన సందర్భాల్లో రాలిపోవచ్చు.
  • పండ్ల పైతొక్కకు దగ్గరగా లోతు తక్కువగా వున్న రంధ్రాలను, కాంస్య రంగు మచ్చలను చూపించవచ్చు.
  • తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు చెట్లు పూర్తిగా పట్టు దారాలతో కప్పబడి ఉండవచ్చు.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
ఆపిల్
అప్రికోట్
నిమ్మజాతి
ద్రాక్ష
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

మొదట్లో చిన్న లార్వాలు రంధ్రాలు చేసి వికసించిన పూలను, పూల మొగ్గలను తింటూ అంతర్గత కణజాలాలలోకి ప్రవేశిస్తాయి. తరువాత ఇవి పట్టు దారాలతో ఆకును ముడుతలుగా చుట్టచుట్టి కట్టుకున్న గూళ్ళ నుండి అన్ని మొక్కల భాగాలపై దాడి చేస్తాయి. దాడికి గురైన ఆకులు చిరిగిపోయిన రూపాన్ని కలిగి ఉంటాయి అలాగే తీవ్రమైన సందర్భాల్లో రాలిపోవచ్చు. పండ్ల పైతొక్కకు దగ్గరగా లోతు తక్కువగా వున్న రంధ్రాలను, కాంస్య రంగు మచ్చలను చూపించవచ్చు. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు చెట్లు పూర్తిగా పట్టు దారాలతో కప్పబడి ఉండవచ్చు. రాలిపోని పండ్లపై గరుకైన నెట్ లాంటి ఉపరితలాలతో కాంస్య-రంగు మచ్చలు ఉండవచ్చు. సాధారణంగా పండ్లు వైకల్యం చెంది అమ్మకానికి పనికిరావు. తెగులు తీవ్రంగా ఉంటే చెట్లు పూర్తిగా పట్టు దారాలతో కప్పబడి ఉండవచ్చు. లార్వా నేల మీదకు రాలినప్పుడు చెట్లకింద వున్న మొక్కల పైన పడి వాటిపై కూడా దాడి చేయవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లేస్వింగ్, పెంకు పురుగులు మరియు లేడీబర్డ్స్ వంటి వీటిని వేటాడే అనేక కీటకాలు పండ్ల చెట్ల ఆకు ముడుత పురుగుల లార్వాలను తింటాయి. ట్రైకోగ్రామా జాతికి చెందిన పరాన్నజీవి కందిరీగలు ఆకు ముడుత పురుగు గుడ్లపై గుడ్లు పెట్టి అవి పెరుగుతున్నప్పుడు చిన్న లార్వాను తింటాయి. ఈ సహజ శత్రువుల పురుగుల జనాభాను తక్కువ స్థాయిలో ఉంచడానికి సహాయపడతాయి, కాని అప్పుడప్పుడు ఈ తెగులు విజృంభిస్తుంది. పరిమిత శ్రేణి నూనె వాడడం లేదా బాసిల్లస్ తురింజెన్సిస్ లేదా స్పినోసాడ్ ఆధారిత ద్రావణాలు సేంద్రీయంగా ఆమోదయోగ్యమైనవి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్‌తో కూడిన నివారణ చర్యలతో జీవపరమైన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మెథాక్సిఫెనోజైడ్, క్లోర్ఫైరిఫాస్, క్లోరాంత్రనిలిప్రోల్ లేదా స్పినెటోరామ్ వంటి క్రియాశీల పదార్ధాలను కలిగి ఉన్న ఉత్పత్తులు వీటి జనాభాను తగ్గించడంలో సహాయపడతాయి. చివరిది తేనెటీగలకు కూడా విషపూరితమైనది. పంట రకం ఖచ్చితమైన చికిత్సను నిర్ణయిస్తుందని గమనించండి.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా పండ్ల చెట్టు ఆకు ముడుత చిమ్మట అని పిలువబడే చిమ్మట అర్చిప్స్ ఆర్గిరోస్పిలా యొక్క లార్వా వల్ల లక్షణాలు కలుగుతాయి. పెద్ద పురుగులు గోధుమరంగులో ఉండి వెంట్రుకలతో శరీరాన్ని కలిగి ఉంటాయి. ఇవి 10 మి.మీ పొడవు మరియు చతుర్భుజ కోణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎరుపు గోధుమ, ముదురు గోధుమ మరియు టాన్ రంగు కలయికతో ఉంటాయి. వెనుక రెక్కలు బూడిద రంగులో ఒకేమాదిరిగా ఉంటాయి. కొద్దిగా గోధుమ రంగు చివరి భాగాలు మరియు కుచ్చు లాంటి అంచులతో ఉంటాయి. సాధారణంగా ఆడ పురుగులు మగ పురుగుల కంటే లేత రంగులో ఉంటాయి. ఇవి అతిధి మొక్క కొమ్మలపై గుంపుగా గుడ్లు పెట్టి వాటిని ఒక రక్షణ పొరతో కప్పుతాయి. చిన్న లార్వా మొగ్గలలో రంధ్రాలు చేస్తుంది, పెద్ద పురుగులు ఆకులను చుట్టి లేదా ఆకులను లేదా పండ్లను ఒకదానికి మరొకటి కట్టి వాటి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అక్కడ నుండి అవి బైటకి వచ్చి ఆకులు, పూలు లేదా కొన్ని సార్లు పండ్లను తింటాయి. వీటి లార్వా, ఆపిల్ మరియు పియర్ చెట్లు, సిట్రస్ మరియు రాతి పండ్లతో పాటూ అనేక రకాల చెట్లపై దాడిచేస్తుంది. వీటికి ఒక సంవత్సరంలో ఒక తరం ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు లక్షణాల కొరకు తోటలను గమనిస్తూ వుండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి