నిమ్మజాతి

గ్రీన్ సిట్రస్ అఫిడ్

Aphis spiraecola

కీటకం

క్లుప్తంగా

  • లేత ఆకులు లోనికి ముడుచుకొని పోతాయి.రెమ్మలు రూపుమారిపోతాయి.
  • అధిక మొత్తంలో హనీ డ్యూ ఉండి అది క్రింద వున్న ఆకులపైనా పడుతుంది.
  • దీనిని బూజు నివాసంగా చేసుకుంటుంది.
  • లేత మొక్కలు ప్రత్యేకంగా ఈ తెగులుకు గురవుతాయి.
  • మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
ఆపిల్
క్యారెట్
నిమ్మజాతి
లెట్టూస్
మరిన్ని

నిమ్మజాతి

లక్షణాలు

తెగులు తీవ్రంగా ఉంటే లేత ఆకులు లోనికి ముడుచుకొని పోయి కొమ్మలు రూపుమారి పోతాయి. తెగులు సోకిన మొగ్గలు ఇంకా లేత కాయలు రాలిపోతాయి. ముఖ్యంగా పలుచని పైతొక్క కలిగి ఉండే కాయలు ఈ తెగులుకు త్వరగా గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, తెగులు ఎక్కువ మొత్తంలో హానీడ్యూను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆకుల క్రింది భాగంలోకి కారుతుంది. దానిలో ఉండే తీపి లక్షణం కారణంగా నల్లని సూటీ మోల్డ్ దీనిని ఆవాసంగా చేసుకుంటుంది. చీమలు కూడా హానీడ్యూను తింటాయి. ఇవి నిరంతరం తినడం వలన ఇంకా కిరణ్య జన్య సంయోగక్రియ తగ్గడం వలన మొక్కలు బలహీనంగా తయారవుతాయి. ప్రత్యేకంగా లేత మొక్కలు ఈ తెగులుకు గురవుతాయి. మొక్కల ఎదుగుదల మందగిస్తుంది. ఈ తెగులు ఎంత త్వరగా మొక్కలను సోకితే అంత తీవ్రంగా ప్రభావం ఉంటుంది. పండ్ల నాణ్యత కూడా తగ్గిపోతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

స్పైయరా ఎఫిడ్ ను తినే జాతులలో ఫ్లైస్, లెస్ వింగ్స్, లేడి బర్డ్స్ మరియు హోవర్ ఫ్లైస్ వంటి అనేక జాతులు ఉన్నాయి. అఫిడిడయి కుటుంబం యొక్క కొన్ని పరాన్న కందిరీగలు కూడా ఎ. స్పిరియా మీద దాడి చేస్తాయి. కానీ లార్వాలో వాటి జీవిత చక్రాన్ని అరుదుగా పూర్తి చేస్తాయి. దీని వలన అవి నమ్మదగినవి కాదు. అనేక తెగులు కారక శిలీంధ్రాలు కూడా అఫిడ్ ను సోకేటట్టు చేస్తాయి. కాని వీటిలో ఏమీ గతంలో తెగులు యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగించబడ లేదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే లేత మొక్కలు తెగులుకు త్వరగా గురవుతాయి, నివారణ చర్యలు ఈ తెగులు విస్తరించకుండా చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు మరియు తక్కువ తేమ వాతావరణంలో పిచికారి చేయకండి. కొన్ని కార్బమేట్స్, ఆర్గానోఫాస్ఫేట్లు, అసిటమిప్రిడ్, పిరిమికార్బ్ మరియు ఇమిడాక్లోరైడ్ స్పైయరా ఎఫిడ్ ను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పోలీఫాగస్ అఫిడ్ అఫిస్ స్పైరైకోలా యొక్క స్పిరియా అఫిడ్ అని కూడా పిలవబడే పురుగులు తినడం వలన ఈ లక్షణాల కనిపిస్తాయి. ఆపిల్, నిమ్మజాతి మరియు బొప్పాయితో పాటు , ఇది ముఖ్యమైన అనేక పంటలకు పెద్ద సంఖ్యలో ఈ తెగులు సోకవచ్చు. వైల్డ్ అతిధి మొక్కలలో క్రటేగస్ (హౌథోర్న్) మరియు స్పిరయ అనే జాతి అనేక జాతులు ఉన్నాయి, వీటివల్లనే ఈ దీనికి ఈ పేరు వచ్చింది. దీని శరీరం పాలిపోయిన ఆకుపచ్చ నుండి పసుపు పచ్చతో 2 మిల్లీమీటర్ల పొడవుతో ఉంటుంది. కడుపు క్రింది భాగంలో మూడు బుడిపెలు ప్రక్కకు వచ్చి ఉంటాయి. పెద్ద పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకులను, కొమ్మలను విపరీతంగా తిని మొక్కల రసాన్ని పీల్చుకొని సమృద్ధిగా హానీడ్యూను ఉత్పత్తి చేస్తాయి. ఈ తీపి పదార్థం తరవాత సూటీ బూజుకు ఆవాసంగా మారుతుంది. ఉష్ణోగ్రత దీని జీవిత చక్రంలో గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఉదాహరణకు, 25ºC వద్ద తెగులు 7-10 రోజులలో ఒక తరాన్ని పూర్తి చేయగలదు. అధిక ఉష్ణోగ్రతలు తక్కువ తేమ పరిస్థితులు దీనికి అనుకూలం. చలికాలం తర్వాత వసంత ఋతువు ప్రారంభంలో సిట్రస్ తోటలను ఆకస్మికంగా ఆయిస్తుంది. చాలా ఎక్కువగా చలి వాతావరణాన్ని కూడా ఇది తట్టుకుంటుంది. ఇది త్రిస్తేజా వైరస్ యొక్క మరియు ఇతర తెగుళ్లకు వాహకంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ అఫిడ్స్ ఉనికి కోసం పొలాన్ని గమనిస్తూవుండండి.
  • చీమల కదలికలను నిరోధించేందుకు అడ్డంకులను ఉపయోగించండి.
  • హానీడ్యూ ఉనికిని అంచనా వేయడానికి వాటర్ సెన్సిటివ్ పేపర్ వంటి పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించండి.
  • చీమలను నిరోధించడానికి జిగురు వలలు ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి