Nacoleia octasema
కీటకం
అరటి బొబ్బల తెగులులో వచ్చే హాని ప్రధానంగా లార్వా దశ ద్వారా కలుగుతుంది మరియు అది ప్రముఖంగా కాయలకు మాత్రమే పరిమితం అవుతుంది. గెలల మీద కవచాలు వున్నా లార్వాలు దాడి చేస్తాయి. ఇవి పుట్టినప్పటి నుండి గెలలు మరియు ముదురుతున్న కాయల యొక్క ఉపరితలంపై తినడం ప్రారంభిస్తాయి. పండ్లపై వుండే తొక్క పైన నల్లగా మాడ్చి బొబ్బలు ఏర్పడునట్లు చేస్తాయి. కాలక్రమేణా, ఆకు పైకి లేవడం మరియు పడిపోవటం మొదలు కాగానే, ఇవి గెల క్రిందకు మరియు ఇంకా దాచబడిన లేత పండ్ల వద్దకు వెళతాయి. లార్వాలకు ప్రత్యామ్నాయం దొరకకపోతే అవి పూత తొడిమ వద్ద వుండి మగ పూతను లేదా ముదురుతున్న కాయలను తింటాయి. తరచుగా ఒక బంక వంటి పదార్థం కనబడుతుంది. ఇది బనానా స్కబ్ మొత్ కు సంబంధించినది మాత్రమే. దీని వలన కాయ రూపం దెబ్బతిని ధర అమ్మకానికి పనికి రాదు.
ఈ జీవులను తినే పరాన్నజీవి లేదా ప్రెడేటర్లను ఇప్పటివరకు గుర్తించలేదు. కొన్ని రకాల కందిరీగలు పరాన్నజీవులు, సాలీడులు మరియు ఇతర సాధారణ మాంసాహారులు తక్కువ స్థాయి సహజ నియంత్రణను అందిస్తాయి. మొక్కలు మరియు గెలల్లో సాధారణంగా ఉండే టెట్రామోనియం బైకర్ణాటమ్ అనే చీమ అరటి స్కాబ్ మొత్ ను కొంత వరకు నియంత్రిస్తుంది. స్పినోసాడ్, శిలీంధ్రం బెయువేరియా బాస్సియానా లేదా మెటారిజియం అనీసోప్లియా లేదా బాక్టీరియం బాసిల్లస్ తురింగిన్స్సిస్ యొక్క ఫార్ములాలను కలిగి ఉన్న జీవపదార్థాలు కూడా ప్రతిభావంతంగా పనిచేస్తాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మంచి ప్రభావవంతమైన సూత్రాల ఆధారంగా తయారుచేయబడ్డ క్లోరోఫెరిఫాస్, బైఫెంత్రిన్ మరియు బెంజియోకార్బ్ ను సాధారణంగా అరటి గెలకు ఇంజెక్షన్ చేయడానికి సిఫార్సు చేస్తారు. మొక్కకు గెల నిటారుగా ఉన్నపుడు మాత్రమే ఇంజక్షన్ చేయాలి. స్పియర్ యొక్క ఎగువ నుండి కింద దాదాపు మూడవ వంతు వరకు సరైన మోతాదులో 20 నుండి 40 మిల్లీలీటర్ల పలుచన చేసిన క్రిమిసంహారకాన్ని ఇంజెక్ట్ చేయండి. దీనికి పైన లేదా క్రింద గాని ఇంజెక్షన్ చేస్తే కాయలు నాశనం కావచ్చు లేదా అనుకొన్న ఫలితం ఇవ్వదు.
అరటి బొబ్బల కీటకం నాకోలేయా ఆక్టాసిమా వల్ల నష్టం జరుగుతుంది. పెద్ద కీటకాలు తేలికపాటి గోధుమరంగులో రెక్కల మీద నల్లటి గుర్తులతో వుంటాయి.ఈ స్వల్ప కాలం జీవించే కీటకం (4-5 రోజులు) చీకటిలో చురుకైన అలవాట్లను కలిగి వుంటుంది మరియు సాయంత్రం వేళల్లో జతకడుతాయి. ఇవి పగటిపూట కుప్పల్లో కాని లేదా ముదురు ఆకు తొడిమ మరియు కాండం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కాని దాక్కుని వుంటాయి. ఆడ కీటకాలు కొత్తగా వేస్తున్న గెలల మీద లేదా ఆకుల చుట్టుప్రక్కల లేదా మొగ్గ రక్షక కవచాల మీద గుడ్లు పెడుతాయి. పొదగబడిన తరవాత లార్వాలు గెలల మీదకు పోయి తినడం ప్రారంభిస్తాయి. గుడ్లు పెట్టడం నుండి పొదగడం వరకు వీటి జీవిత చక్రం 28 రోజులు పడుతుంది. బనానా స్కాబ్ మొత్ కు తేమ మరియు వెచ్చని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాని తడి వాతావరణంలో ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. చల్లని మరియు పొడి చలికాలాలలో అనుకోని వర్షాలు పడకుండా ఉంటే ఈ కీటకాలు లేకుండా ఉంటాయి. పరిశోధనలో తేలిందేమిటంటే పెద్దవి తక్కువ గాలిలో తేమ మరియు వేడి పరిస్థితుల్లు ఉన్నప్పుడు ఈ కీటకాలు శృంగారంలో పాల్గొనక గుడ్లు పెట్టవు. ఇది అరటిలో ఆర్థికంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించే తెగులు మరియు దీనిని నియంత్రించకపోతే దీనివలన 100% గెలలు నాశనం కాగలవు.