నిమ్మజాతి

నిమ్మ జాతి మొక్కలలో తామర పురుగులు

Scirtothrips citri

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పుండ్ల వంటివి, బూడిద రంగు లేదా వెండి రంగు మచ్చల చారలు పండు పైతొక్కపైన కనిపిస్తాయి.
  • పండు ఎదిగే కొలది దెబ్బతిన్న కణజాలం పెరుగుతుంది .

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

పెద్ద పురుగులు మరియు వీటి లార్వాలు లేత ఆకులు మరియు పండ్ల పైపొరకు రంద్రాలు చేయడం వలన పుండ్ల వంటి, బూడిద లేదా వెండి రంగు చారలు కణజాలం పైన ఏర్పడతాయి. పెద్ద లార్వాలు లేత పండ్ల రక్షక పత్రావళిని తినడం వలన అధిక మొత్తంలో నష్టం కలగచేస్తుంది. పండ్లు వృద్ధి చెందే కొలదీ ఈ మచ్చలు రక్షక పత్రావళి నుండి బైటకు వ్యాపించి మచ్చలు ఏర్పడిన కణజాలంతో ఒక సృష్టమైన వృత్తము వలే ఏర్పడుతాయి. పూరేకులు రాలిపోయిన తర్వాత 3.7 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణానికి ఎదిగే వరకు పండ్లు ఈ నష్టానికి అధికంగా గురవుతాయి. గుబురుగా వున్నఆకుల అవతల వున్న పండ్లు ఈ తామర పురుగుల వలన అధికంగా నష్టానికి గురవుతాయి. ఇవి గాలి వలన మరియు ఎండ వేడిమి వలన కూడా దెబ్బతినే అవకాశం వుంది. గుజ్జు మరియు రసం యొక్క లక్షణాలు మారకపోవచ్చు కానీ పండ్లు మాత్రం అమ్మకానికి పనికిరాకపోవచ్చు .

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వీటిని వేటాడే నల్లులు అయిన యూసేయుస్ తులారెన్సిస్, సాలీడ్లు, లేస్ వింగ్స్ మరియు మైన్యూట్ పైరేట్ బగ్స్ సిట్రస్ తామర పురుగులపై దాడిచేస్తాయి. E. తులారెన్సిస్, ఈ పురుగులను నియంత్రించి ఒక ఇండికేటర్ జాతి లాగ ఉంటుంది. ఇది తోటలో వున్న సహజ శత్రువుల స్థాయిని సూచిస్తుంది. విస్తృత శ్రేణి పురుగుల మందులను వాడి వీటిని అస్థిర పరచకండి. సేంద్రియ పద్దతిలో పెంచే తోటలలో స్పైనోసాడ్ పిచికారీను సేంద్రియ ఆమోదం పొందిన ఆయిల్, కావోలిన్ లేదా సబడిల్ల ఆల్కలాయిడ్లను మొలాసిస్ లేదా పంచదార ఎరతో కలిపి ఉపయోగించడం సిఫార్స్ చేయబడినది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇవి ఆకులపై దాడిచేయగలిగినా వీటి జనాభా తక్కువగా వున్నప్పుడు, సాధారణంగా ఆరోగ్యంగా వున్న చెట్లు వీటివలన కలిగిన నష్టాన్ని తట్టుకోగలవు. పండ్లు లేని చెట్లపైన తరచుగా పురుగుల మందుల వాడకం వలన ఈ పురుగులు పురుగుల మందులకు నిరోధకతను పెంచుకుంటాయి. తరువాత సంవత్సరాలలో వీటిని నియంత్రించడం చాలా కష్టమౌతుంది. ఆబమెక్టిన్, స్పీనేటోరం, డైమిథోయేట్ మరియు సైఫ్లూత్రిన్ పురుగుల మందులను ఈ తామర పురుగులను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ నష్టం నిమ్మ తామర పురుగు అయిన స్కిర్టోత్రిప్స్ సిట్రి వలన కలుగుతుంది. పెద్ద పురుగులు చిన్నగా ఉండి నారింజ-పసుపు రంగులో జాలరు వంటి రెక్కలు కలిగి ఉంటాయి. వసంత ఋతువు మరియు వేసవి కాలంలో ఆడ పురుగులు కొత్త ఆకుల కణజాలం, లేత పండ్లు లేదా పచ్చని రెమ్మలపైన సుమారు 250 వరకు గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు తరువాత వసంత కాలంలో చెట్లు కొత్తగా ఎదిగే సమయంలో పొదగబడతాయి. చిన్న లార్వాలు చాలా చిన్నగా ఉంటాయి. పెద్దవి గుండ్రంగా చుట్టబడి ఉన్నట్టు ఉండి రెక్కలు లేకుండా ఉంటాయి. చివరి లార్వా దశలలో (ప్యూపా) తామర పురుగులు ఆహరం తీసుకోకుండా వాటి వృద్ధిని నేలపై కానీ చెట్ల పగుళ్లలో కానీ కొనసాగిస్తాయి. పెద్ద పురుగులు బైటకి వచ్చినప్పుడు అవి చురుకుగా చెట్టు ఆకుల చుట్టూ తిరుగుతాయి. 14°C కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇవి వృద్ధి చెందవు మరియు వాతావరణం అనుకూలంగా ఉంటే ఒక సంవత్సరంలో ఇవి 8 నుండి12 తరాల వరకు ఉత్పత్తి చేయగలవు.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తనాలను ఉపయోగించండి.
  • ఈ తెగులు లక్షణాల కోసం తోటను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • తోటలో అధిక ప్రాంతాలలో జిగురు వలలు వుపయోగించి వీటిని పెద్ద మొత్తంలో పట్టుకోండి.
  • విస్తృత పరిధి కల పురుగుల మందులను వాడడం వలన వీటిని వేటాడి తినే జాతులకు నష్టం కలుగుతుంది.
  • ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలకు దగ్గరగా పంటను వేయకండి.
  • పొలంలో మరియు పొలం చుట్టు ప్రక్కల కలుపు మొక్కలను తొలగించండి.
  • మొక్కలకు బాగా నీరు పెట్టండి మరియు అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి