ఇతరములు

వేరుశనగలో కాయ తొలుచు పురుగు

Etiella zinckenella

కీటకం

క్లుప్తంగా

  • ఈ పురుగు పూత, పిందె దశలో కాయ లోపల తొలుచుకుంటూ తిని, కాయ రాలిపోవడానికి కారణమవుతుంది.
  • లార్వాలు లోపలి భాగాన్ని తింటూ వ్యర్ధాలను విస్తరించడం వలన కాయలపై మృదువైన, గోధుమ రంగు, కుళ్ళిన మచ్చలు ఎర్పడతాయి.
  • కాయలలో పాక్షికంగా లేదా పూర్తిగా గింజలు తిన్నలక్షణాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఈ పురుగు చిక్కుడు, కంది మరియు సోయాబీన్ లాంటి పప్పు ధాన్యపు పంటలపై దాడి చేస్తుంది. లేత పురుగులు కాయ లోపల తొలుచుకుంటూ తినడం వల్ల, కాయలు రాలిపోవడానికి కారణమవుతుంది. పెద్ద పురుగు కాయలలో రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయలోనికి ప్రవేశిస్తుంది. ప్రతి కాయలో సాధారణంగా ఒకటి లేదా రెండు లార్వాలు చూడవచ్చును మరియు లార్వాలు లోపలి భాగాన్ని తింటూ వ్యర్ధాలను విసర్జించడం వలన కాయలపై మృదువైన, గోధుమ రంగు, కుళ్ళిన మచ్చలు ఎర్పడతాయి. గింజలు పాక్షికంగా లేదా పూర్తిగా తిన్నలక్షణాలు కనిపిస్తాయి మరియు పువ్వులు మరియు కాయలు అందుబాటులో లేకుంటే, లార్వాలు ఆకులను తింటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కొన్ని రకాల వెర్టెబ్రాట్స్, ఆర్థ్రోపోడ్స్ మరియు పక్షులు వీటిని ఆహారంగా తింటాయి. బ్రాకొన్ ప్లేటినోటి, పెరిసేరోలా సేల్యులారిస్ మరియు జట్రోపిస్ టోర్ట్రిసిడిస్ వంటి జాతుల పురుగులు పరాన్నజీవులు ఈ బంగారు పట్టీ ఏటిఏళ్ల పురుగు లార్వాపై ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన ఈ పురుగుల జనాభాపైన తీవ్రమైన ప్రభావం కలిగించవచ్చు. ఈ పురుగుల వ్యాప్తిని నియంత్రించడానికి శిలీంధ్ర మరియు బాక్టీరియల్ తెగుళ్లను కూడా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ పురుగులు సాధారణంగా పప్పుధాన్యాల ప్రధాన తెగులుగా పరిగణించబడదు మరియు వెంటనే ఎటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని రకాల కీటక నాశినులను ఆకులపై పిచికారీ చేయవచ్చు. ఈతెగులు విస్తరించకుండా పంట వేసిన 45 రోజుల తర్వాత మలాథియాన్ 5D ( ఒక హెక్టారుకు 25 కిలోలు) వాడండి

దీనికి కారణమేమిటి?

యేతియెల్లా జింకేనేల్లా అనే లార్వా వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ పురుగులు ఒక ఉబ్బినట్టువున్న తల మరియు రెండు సుదీర్ఘ ప్రబలంగా ఉండే యాంటెన్నాలతో లేత గోధుమ రంగులో ఉండి రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటుంది. ముందుజత రెక్కలు ముదురు బూడిద రంగులో ఉండి అంచులు తెల్లటి గీతతో మెరుస్తుంటాయి. వెనుక జత రెక్కలు లేత బూడిద రంగులో ఉండి ముదురు గోదుమ రంగు పొడవైన అంచు ఏర్పడతాయి. ఆడ పురుగులు వాటి గుడ్లను మొగ్గ లేదా ఆకుపచ్చ కాయ మీద వేస్తాయి మరియు పురుగు కాయలలో రంద్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు పయనిస్తుంది. ఇవి లేత నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి మరియు నారింజ తల ఒక నల్లని V ఆకారం మరియు నాలుగు నల్లని చుక్కలతో ఉంటుంది. శీతాకాలంలో లార్వాదశ ముగిసిన తర్వాత ఇవి పంట నుండి విడిపోయి 2-5 సెం.మీ. లోతులో నేలలోకి చేరి కోశస్ధదశలోకి మారుతాయి మరియు వసంతకాలంలో మళ్ళీ గొంగళి పురుగులుగా మారతాయి.


నివారణా చర్యలు

  • ఈ తెగులును తట్టుకునే రకాలు వాడండి.
  • ఈ తెగులు లక్షణాలకోసం ( గుడ్లు, గొంగళి పురుగులు, వీటివలన కలిగిన నష్టం) తెగులు సోకిన పువ్వులను మొగ్గలను కాయలను మొక్కల భాగాలను చేత్తో తొలగించండి.
  • సరైన మోతాదులో నత్రజని ఎరువులను వాడండి.
  • పొలంలో సరైన మురుగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోండి.
  • వలలు వుపయోగించి ఈ పురుగులను పెద్ద మొత్తంలో పట్టుకోండి.
  • ఈ పురుగులను తినే పక్షులకు పొలంలో గుళ్లను ఏర్పాటుచేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్టుప్రక్కల కలుపు మొక్కలు తొలగించండి.
  • చాలా రకాల తెగుళ్లపైన ఉపయోగించే పురుగుల మందులను సరైన మోతాదులో వాడండి.
  • దీనివలన మీ పొలంలో పురుగులను తినే కీటకాలను సంరక్షించుకోవచ్చు.
  • పంట కోత తర్వాత స్వచ్చందంగా వచ్చిన మొక్కలను మరియు పంట అవశేషాలను తొలగించండి.
  • ఈ తెగులు సోకని ఇతర పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి