అరటి

కాస్టర్ గొంగళిపురుగులు

Pericallia ricini

కీటకం

క్లుప్తంగా

  • ఆకు కణజాలంలో క్లోరోఫిల్ లేనట్టు లేత గోధుమ వర్ణంలో గీరినట్టు నష్టం కలుగుతుంది.
  • ఈ పురుగులు ఆకులను తినడం వలన ఆకులపై ఒక కిటికీ నమూనాలో నష్టం కనిపిస్తుంది.
  • ఈ తెగులు ఎక్కువగా సోకినప్పుడు మొత్తం ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

ఆకు కణజాలంలో క్లోరోఫిల్ లేనట్టు లేత గోధుమ వర్ణంలో గీరినట్టు నష్టం కలుగుతుంది. ఈ పురుగులు ఆకులను తినడం వలన ఆకులపై ఒక కిటికీ నమూనాలో నష్టం కనిపిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా సోకినప్పుడు మొత్తం ఆకులు రాలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లార్వా మొదటి దశ ఎదుగుదల సమయంలో నిమ్మ విత్తనాల సారం ఈ తెగులు విస్తరించకుండా నియంత్రిస్తుంది. అందువలన 5% నిమ్మ విత్తనం గుజ్జు మిశ్రమాన్నిఒక లీటర్ నీటిలో కలిపి వాడాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్రిమి నాసీనుల వాడకం అవసరం అనుకుంటే మోనోక్రోటోఫాస్,క్లోరిఫైరిఫాస్ మరియు క్వినాల్ఫస్ క్వినాల్ఫాస్ వంటివి వాడవచ్చు. ఈ మందులు మనుషుల పై, పశువుల పై , ఈగలు, చేపలు మరియు పక్షుల పై విష పూరిత ప్రభావం కలిగి ఉంటాయి.

దీనికి కారణమేమిటి?

ఇది రాత్రులు విహరించే పురుగుల జాతికి చందినది. ముందరభాగం రెక్కలు బూడిద రంగులో ముదురు మచ్చలు కలిగి ఉంటాయి మరియు వెనుక భాగం రెక్కలు గులాబీ రంగులో ఉంటాయి. లార్వా నల్లనిరంగులో ఉండి గోధుమ రంగు తల కలిగి, పొడవు గోధుమ రంగు జుట్టు శరీరం మొత్తం పై కలిగి ఉంటాయి.


నివారణా చర్యలు

  • పొలంలో మొక్కలకు తెగులు సోకిందేమో గమనిస్తూ ఉండాలి.
  • గుడ్లను, లార్వాను , తెగులు సోకిన మొక్కల భాగాల్ని లేదా మొక్కలను తొలగించాలి.
  • కాంతి వలయాలు వాడి ఈ పురుగులను పట్టుకుని చంపొచ్చు.
  • చిన్న పురుగుల సమూహాన్ని వెలుగుతున్న కాగడాలతో పట్టుకోవచ్చు.
  • వ్యాధి సోకిన మొక్కలను తొలగించి కాల్చి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి