అరటి

అరటి తుప్పు తెగులు

Chaetanaphothrips signipennis

కీటకం

క్లుప్తంగా

  • పెద్ద పురుగులు మరియు నింఫ్స్ సాధారణంగా ఆకులు, కాండాలు మరియు పండ్ల పై గుంపులుగా కనిపిస్తాయి.
  • తినటం వల్ల కలిగిన నష్టం నీట నాని మచ్చల వలె పండ్ల పై కనిపిస్తుంది.
  • మచ్చలు తుప్పు రంగు గరుకు మచ్చలుగా ఏర్పడిన తరువాత ఎరుపు నుండి ముదురు గోధుమ రంగు లోకి మారుతాయి.
  • అలా మొత్తం పండ్ల తోలు పై కనిపిస్తాయి.
  • పెరిగిన పండ్లు కూడా పగుళ్లు కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

సంక్రమణ మొక్కల ఎదుగుదల ఏ దశలో అయినా జరగవచ్చు. ముఖ్యంగా ఆకులు, కాండాలు మరియు పండ్ల పై ప్రభావం చూపుతుంది. పెద్ద పురుగులు మరియు లార్వా సహజంగా ఆకు తొడుగుల వెనక ఉంటాయి. నింఫ్స్ మొక్కల రసాన్ని పీలుస్తాయి. ఇవి ఇలా తినటం వలన కలిగిన నష్టం నీట నాని మచ్చల వలె పండ్ల పై కనిపిస్తుంది. మచ్చలు తుప్పు రంగు గరుకు మచ్చలుగా ఏర్పడిన తరువాత ఎరుపు నుండి ముదురు గోధుమరంగు లోకి మారుతాయి. మాములుగా పైతొక్కపైనే ఈ నష్టం కనిపిస్తుంది. కాని వ్యాధి తీవ్రంగా వున్నట్లైతే ఇది మొత్తం పండుకు నష్టం కలుగుతుంది. పండ్లపై పగుళ్ళు కనిపిస్తాయి. కొన్ని సార్లు పండ్లు పగిలి తెరుచుకున్నట్టు అయిపోతాయి. మొక్కల ఆరంభ ధశలో అయితే ఈ తెగులు వలన నష్టం చాలా అధికంగా ఉంటుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్రైసోపిడే జాతికి చెంధిన కీటకాలు మరియు లేడీబగ్ బీటిల్ పురుగుల జాతులు ఈ వ్యాధిని నియంత్రించటంలో సహాయపడతాయి. కొన్ని రకాల చీమలు కూడా మట్టిలోని ప్యూపా పై దాడి చేస్తాయి. విత్తనాలు ఆరోగ్యకరమైనవో కాదో తెలియకపోతే వేడినీళ్ళతో వాటిని శుద్ధిచేస్తే ఈ తెగులు సోకే అవకాశం తగ్గుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒక వేళ క్రిమి నాశినులు వాడవలసి వస్తే వీటిని భూమిపై ప్యూపాను చంపే విధంగా మరియు మొక్కలు, పండ్ల పై పెద్ద పురుగుల్ని చంపే విధంగా వాడాలి . ఇలా చేయడం వలన ఈ తెగులు మళ్ళీ రాకుండా సమర్ధవంతంగా ఆపవచ్చు.

దీనికి కారణమేమిటి?

త్రిప్స్ చైతనఫోస్త్రిప్స్ సిగ్నిపెన్నీస్ వలన ఈ తెగులు లక్షణాలు ఏర్పడతాయి. కానీ ఇతర జాతుల వలన కూడా ఈ తెగులు సోకవచు. కొన్నిసార్లు చెట్ల మధ్య ఎగురుతున్న కీటకాల ద్వారా కూడా సోకుతాయి. పెద్ద పురుగులు సన్నగా ఉండి, పసుపు నుండి గోధుమ రంగు కలిగి, 1.3 మిల్లీమీటర్లు ఉంటాయి. వీటి ముందర రెక్కల పైన రెండు ముదురు మచ్చలు ఉంటాయి. ఆడ పురుగులు చిన్న గుడ్లను ఆకుల కింది భాగంలొ పెడతయి. దాదాపు ఏడు రోజుల తరువాత రెక్కలు లేని లార్వా బయటకి వస్తాయి. ఇవి ఏడు రోజుల్లోనే పెద్దవిగా మారుతాయి. తరువాత ఇవి భూమిలోనికి వెళ్లి అక్కడే ఉంటాయి. ప్యూపా తెల్లగా మరియు 1 మిల్లిమీటర్ సైజులో ఉంటాయి. 7-10 రోజుల అనంతరం పెద్ద పురుగుల రూపంలో బయటకు వస్తాయి. ఒక సంవత్సరంలో చాలా తరాలు ఉండవచ్చు. వేడి మరియు తేమ వున్న వాతావరణంలో వీటి జనాభా అధికమవుతుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యంగా ఉన్న మొక్కలను వాడండి.
  • ఈ తెగులును ఆతిధ్యాన్ని ఇచ్చే ఇతర మొక్కలను పొలం నుండి మరియు పొలం చుట్టుపక్కలనుండి తొలగించండి.
  • క్రమంతప్పకుండా మొక్కలను తెగులు లక్షణాల కోసం పరీక్షిస్తూ వుండండి.
  • మొక్కలను కాపాడటానికి మొదటి దశ నుండే గుత్తులు కప్పి ఉంచండి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చి వేయండి.
  • పంట వేయని చుట్టు పక్కల ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి.
  • లేకపోతే వాటివలన ఈ తెగులు అభివృద్ధిచెందే అవకాశం ఉంటుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి