వరి

డెమెరారా ఫ్రాగ్ హోపర్ (ఉమ్ము కీటకం)

Deois flavopicta

కీటకం

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారి వాలిపోతాయి.
  • చిన్న మొక్కలు చనిపోతాయి.
  • తెల్లని నురుగు లాంటి ద్రవం-'స్పిటిల్ మాస్', వీటి వెనక భాగంపై లేత గోధుమ రంగు నమూనాతో ముదురు గోధుమ రంగు ఫ్రాగ్ హోపర్.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

'స్పిటిల్ మాస్' (నీరు లాంటి విసర్జనలో గాలిని పంపడం ద్వారా తయారైన ఒక నురుగు లాంటి ద్రవం) అనేది ఈ పిల్ల పురుగులు మొక్కలను తింటున్నాయనడానికి సాక్ష్యం.ఆడ కీటకాలు మొక్కలకు దగ్గరగా మట్టిలో గ్రుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్లు పొదిగిన తర్వాత పిల్ల పురుగులు వేర్లు మరియు కాండంపై ఆతృతతో తినడం మొదలుపెడతాయి. పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు కణ ద్రవ్యాన్ని పీల్చుకుని మొక్కను నాశనం చేస్తాయి. మొక్కల కణ ద్రవ్యాన్ని పీల్చటం ద్వారా మరియు కణ ద్రవ్యప్రసరణకు అవరోధం కల్పించే లేదా నిరోధించే టాక్సిన్ ను ఇంజెక్ట్ చేయడం ద్వారా వాటిని హాని చేస్తుంది మరియు బలహీనపరుస్తుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

రాత్రిపూట ఉష్ణోగ్రతలలో తగ్గుదల మరియు ఎక్కువ కాలం గుడ్లు చల్లని ఉష్ణోగ్రతలకు బహిర్గతం కావడం వలన పొదుగుదల సమయం బాగా తగ్గిపోతుంది. ఇలా ముందుగానే గుడ్లు పొదగడం వలన ఈ కీటకాల జనాభా బాగా తగ్గిపోతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. డిపోయిస్ ఫ్లేవోపిక్టా దాడి చేయకుండా నిరోధించడానికి విత్తనాలను దైహిక పురుగుమందులతో చికిత్స చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఉమ్ము కీటకం (డెయోయిస్ ఫ్లేవోపిక్టా) అని కూడా పిలిచే డెమెరారా ఫ్రాగ్ హోపర్ అనేది వరి మరియు మొక్కజొన్న వంటి చాలా పంటలకు నష్టం కలిగించే ఒక కీటకం. ఆడ కీటకాలు అతిధి మొక్కలకు దగ్గరలో మట్టిలో గుడ్లు పెడతాయి. గుడ్లను పొదిగిన తర్వాత పిల్ల పురుగులు నేల ఉపరితలానికి దగ్గరగా వున్న వేర్లు మరియు కాడలను తింటాయి. అవి ఒక ఉమ్ము లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయి, ఇది వాటి వ్యర్థాలలోకి గాలిబుడగలను ప్రవేశపెట్టడం ద్వారా ఏర్పడిన ఒక తెల్లటి నురుగు వంటి ద్రవం. ఉమ్ము వంటి పదార్థం అనేది నింఫ్స్ మొక్క ను ఆ ప్రదేశంలో తింటాయి అనడానికి ఒక ఆధారంగా ఉంటుంది. పొలం లోపల లేదా చుట్టు ప్రక్కల వ్యాధి సోకే అవకాశం గల గడ్డి మొక్కల ఉనికి ఈ కీటకాల జనాభాను పెంచుతుంది. ఇవి ఈ మొక్కలకు ఆకర్షించబడి తమ జీవిత చక్రానికి మద్దతునివ్వడానికి వాటిని ప్రత్యామ్నాయ అతిధిగా వాడుకుంటాయి.


నివారణా చర్యలు

  • ఆకుల మీద తెల్లటి నురుగు వంటి ద్రవం (ఉమ్ము వంటి పదార్థం) ఉందేమో తెలుసుకోవడానికి పొలాన్ని తరచు గమనిస్తూ వుండండి.
  • పొలంలో మరియు చుట్టుప్రక్కల ఈ కీటకాలకు ఆశ్రయం ఇచ్చే మొక్కలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి