Stephanitis typica
కీటకం
ఇది ఆకులపై, దూరం నుండి కూడా కనిపిస్తుంది. పెద్ద పురుగులు మరియు నింఫ్స్ యొక్క గుంపులు ఆకుల క్రింది పక్కన కనిపిస్తాయి. ఈ పురుగులు సామాన్యంగా ఆకు ఈనెల దగ్గర కణ ద్రవ్యాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆకు పైభాగం పై చిన్న తెలుపు మరియు పాలిపోయినట్టు వున్న (క్లోరోటిక్) మచ్చలు కనిపిస్తాయి. పురుగుల యొక్క ముదురు సారాలు ఆకు క్రింది భాగంలో కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది మరియు అవి నిస్సత్తువగా కనిపిస్తాయి.
ఒక సమతుల్య పద్దతిలో స్టెతోకొనుస్ ప్రాఫెక్టుస్ లాంటి వేటాడే కీటక జాతులను ఉపయోగిస్తే ఈ తెగులును నియంత్రించవచ్చు. వేప నూనె మరియు వెల్లుల్లి (2%) రసాయనం పిచికారీ చేయడం వలన ఈ తెగులును నియంత్రించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు అరటి మొక్కలపై వ్యాపించకుండా ఆపటానికి సాధారణంగా కీటక నాశినులను వాడతారు. డైమిథోయేట్ మరియు క్వినాల్ఫోస్ కలిగిన ఉత్పత్తులు ఆకుల క్రింది భాగాల్లో పిచికారీ చేయడం వలన ఫలితం ఉంటుంది.
పెద్ద పురుగులు పసుపు నుండి తెలుపు రంగులో మరియు 4 మిల్లీమీటర్ల పరిమాణం కలిగి, అల్లికల వంటి రెక్కలు కలిగి ఉంటాయి. ఆడ పురుగులు ఆకుల కింది భాగంలో సుమారుగా 30 వరకు గుడ్లు పెడతాయి. 12 రోజుల తరువాత ఇవి పగులుతాయి. ఈ ఎదుగుదల దశ దాదాపుగా 13 రోజులు కొనసాగుతుంది. ప్రస్తుతం దీని వల్ల కలిగే దిగుబడి నష్ఠాల గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు ఈ తెగులు వలన ఎటువంటి తీవ్రమైన నష్టం అరటి పంటకు కలిగినట్టు నివేదికలు లేవు.