Deanolis albizonalis
కీటకం
బఠాణి లేదా నిమ్మ పరిమాణం కలిగిన పండ్ల క్రింది భాగంలో పై నల్లని తెరచివున్న రంద్రాలు, గుండ్రని పాలిపోయినట్టు వుండే ప్యాచ్ కనిపిస్తాయి. పండ్లు సైజు పెరుగుతునప్పుడు ఈ రంధ్రాల నుండి గుజ్జు మరియు జీడి రావటం కనిపిస్తుంది. బోరర్ వలన పండ్లు పగిలిపోతాయి. లార్వా ఇతర పండ్లకు విస్తరిస్తాయి. ఈ లార్వా ఎరుపు మరియు తెలుపు రింగులు కలిగి నల్లటి కాలర్ మరియు తల కలిగి ఉంటాయి. అవి ఎదుగుతునప్పుడు పచ్చ-నీలం రంగులోకి మారిపోతాయి. ఇవి ముందు గుజ్జు ను ఆ తరువాత టెంకను వాటి ఆహారంగా చేసుకుంటాయి. ఇవి పండ్లు పూర్తిగా ఎదగకుండానే రాలిపోయేటట్టు చేస్తాయి.
D. అల్బిజోనలిస్ ను నివారించడానికి వేప సారాన్ని (అజాడిరచటిన్) వారం విడిచి వారం వాడవచ్చు. మామిడి పూత దశనుండి మొదలు పెట్టి 2 నెలల వరకు ఇలా వేప సారాన్ని వాడొచ్చు.
ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మామిడి టెంకను ఆశించు పురుగులను నిర్ములించడానికి థియక్లోప్రిడ్ కలిగివున్న స్ప్రేలను పిచికారీ చేయండి. ఇతర క్రిమిసంహారక మందులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.
పెద్ద పురుగులు బూడిద రంగు కలిగి 13 ఎం. ఎం. రెక్కల విస్తారం కలిగి ఉంటాయి. ఇవి ఒక వారం పాటు జీవించి మరియు గుంపులుగా పండ్ల కింది భాగం లో గుడ్లు పెడతాయి. ప్యూపాషన్ బెరడు లో 1-2 సీఎం లోతులో ఇవి చేసిన రంధ్రాలలో జరుగుతుంది. పురుగులు 10-14 రోజుల్లో బయటకి వచ్చి నిద్రలో ఉంటాయి. ఈ చీడ వ్యాధి సోకిన పండ్ల వల్ల , కొన్ని సార్లు ఎగరగలిగే పురుగుల వల్ల వ్యాపిస్తుంది.