Parapoynx stagnalis
కీటకం
చిన్న పి. స్టాగ్నలిస్ లార్వా ఆకులను తింటాయి. గొట్టం పురుగులు వరి ఆకుల కొనల్ని లంబ కోణాల్లో కత్తిరించి ఆకులలో అరలను తయారు చేస్తాయి. ఈ లార్వా ఆకుల కణజాలాన్నితిని వాటిపై ఒక పేపర్ లాంటి పైపొరని వదులుతాయి. ఈ పురుగులు వ్యాపించిన ఆకులు నిచ్చెన లాంటి నిర్మాణాలతో కనిపిస్తాయి. ఈ నష్టం యొక్క లక్షణాలు బట్టి చూస్తే వేరే తెగులు సోకిందేమో అనే అనుమానం వస్తుంది. తెగులు కేస్ వార్మ్ వల్లనే కలిగింది అని తెలుసుకోవడానికి మొదట నిచ్చెన లాంటి ఆకు కణజాలాన్ని పరిశీలించండి, తర్వాత ఆకులు కత్తిరించబడడాన్ని పరిశీలించండి, ఆ తర్వాత ఆకులపై తొడుగులు ఏర్పడి నీటి పైన తేలటం వంటివి పరిశీలించండి.
జీవ నియంత్రణ ఏజెంట్స్ ని ప్రోత్సహించండి. నత్తలు (గుడ్లని తింటాయి), హైడ్రోఫిలిడ్ మరియు డైటిస్కిడ్ నీటి పెంకు పురుగులు (లార్వా ని తింటాయి), సాలెపురుగులు, తూనీగలు మరియు పక్షులు (పెద్దలని తింటాయి). బూడిద లేదా వేపాకుల రసాన్ని కీటకాలు ఉన్న స్థలంలో వాడాలి.
వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవసంబంధమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కార్బమేట్ గల క్రిమిసంహారకాలను ఆకుల పై వుపయోగించండి, కానీ పెరిథ్రోయిడ్స్ ను వాడకపోవడం మంచిది, ఎందుకంటే కీటకాలు దీనికి అలవాటు పడే ప్రమాదం వుంటుంది.
ఈ కీటకాలు ముఖ్యంగా నీరు అధికంగా ఉండే వరి పొల్లాలో కనిపిస్తాయి. ఇవి కలుపు మొక్కలపైన, వరి పంట అవశేషాలపైన, పొలం చుట్టుపక్కల ప్రాంతాలలో జీవిస్తాయి. కొత్త పంట వేయగానే అదను బట్టి ఇవి ఆ పంటపై దాడిచేస్తాయి. వరి నాట్లు వేసే సమయం కూడా వీటికి అనుకూలంగా ఉంటుంది. సరైన ముందస్తు ప్రణాళిక లేని సేద్యం మరియు జింక్ లోపం వున్న నేలలు ఈ తెగులు సులువుగా సోకడంతో సహాయపడతాయి. అయినా ఈ పురుగులు సాధారణంగా వరిపంటలో తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి.