వరి

పచ్చ దీపపు పురుగులు

Nephotettix spp.

కీటకం

క్లుప్తంగా

  • పచ్చ దీపపు పురుగులు సహజంగా వరి పంటల్లో కనిపిస్తాయి.
  • ఇవి నీటిపారుదల కలిగిన వాతావరణాలలో ఎక్కువగా ఎదుగుతాయి మరియు తుంగ్రో లాంటి వైరల్ వ్యాధుల్ని వ్యాపిస్తాయి.
  • ఆకు చివర్లు రంగు కోల్పోవటం మరియు పిలకలు తగ్గిపోవటం లాంటివి సాధారణ లక్షణాలు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

పచ్చ దీపపు పురుగులు సహజంగా వరి పంటల్లో కనిపిస్తాయి. ఇవి నీటిపారుదల కలిగిన వాతావరణాలలో ఎక్కువగా ఎదుగుతాయి మరియు తుంగ్రో లాంటి వైరల్ వ్యాధుల్ని వ్యాపిస్తాయి. ఆకు చివర్లు రంగు కోల్పోవటం మరియు పిలకలు తగ్గిపోవటం మొక్క ఎదుగుదలతగ్గడం లాంటివి సాధారణ లక్షణాలు. తెగులు తీవ్రంగా ఉంటే మొక్కలు వాలిపోయే అవకాశంకూడా వుంది. తుంగ్రో సోకిన పంటకు నత్రజని లోపం లేదా ఇనుము వలన విషపూరితం కావడానికి తేడా తెలుసుకోవటానికి పురుగులు ఉన్నాయో లేదో చూడాలి. నల్లని చారలతో తెలుపు లేదా పసుపు రంగు గుడ్లు ఆకు పైపొరలలో కాడల దగ్గరలో కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

కందిరీగలు( ఇవి పురుగు గ్రుడ్లను తింటాయి) మిరిడ్ కీటకం, స్ట్రెపీసీపీటీరం,పెద్ద ఈగలు (పిపుంక్యూలిడ్) మరియు నెమటోడ్లు అక్వియాటిక్ వెలిడ్ బగ్స్ నాబిడ్ బగ్స్, ఎంపిడ్ ఈగలు, తూనీగలు, డాంసెల్ ఫ్లైస్, మరియు సాలెపురుగులు లేదా ఫంగల్ పాథోజెన్స్ జీవనియంత్రణకు పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పచ్చ దీపపు పురుగులకు వ్యతిరేకంగా అనేక పురుగుల మందులు మార్కెట్లో దొరుకుతాయి. మీ స్థానిక రిటైలరును అడిగి మీకు అనుకూలమైన ఎరువుల గురించి తెలుసుకోండి. బుప్రోఫెజిన్ లేదా పైమెట్రోజెన్ వాడడం వలన ఉపయోగం ఉంటుంది క్లోర్ఫెరోఫోస్.లమ్డ సైహలోత్రిన్ లేదాఇతర కృత్రిమ పెరిథ్రోయిడ్స్ మిశ్రమాలను వాడవద్దు.

దీనికి కారణమేమిటి?

సాధారణంగా ఇవి నీటిపారుదల కలిగిన వాతావరణంలో మాగాణి భూములలో ఎక్కువగా జీవిస్తాయి. మెట్టప్రాంతాలలో వేసే వరి పంటలో ఈ పురుగులు ఉండవు. చిన్న పురుగులు మరియు పెద్ద పురుగులు ఆకులపైన కాకుండా వెన్ను ఉపరితలంపై ఉండి ఆకులను తింటాయి. ఎక్కువ నత్రజని ఎరువులు వేసిన వరి పంటను ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులవలన ఆదుర్దా చెందనక్కర్లేదు కానీ ఇవి వరి తుంగ్రో వైరస్ ను వ్యాపింపచేస్తాయి.


నివారణా చర్యలు

  • పచ్చ దీపపు పురుగులు నిరోధక మరియు తుంగ్రో నిరోధక రకాలు వాడాలి.
  • వరి పంటల్ని సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే వేయాలి.
  • నాట్లు వేసే కాలంలో, ముఖ్యంగా ఎండ కాలంలో.
  • అనుకున్న దానికన్నా తొందరగా నాట్లు వేయటం మంచిది.
  • వరిపంట కాకుండా ఇతర పంటలతో పంట మార్పిడి చేయటం మంచిది.
  • ఈ దీపపు పురుగులను తగ్గించడానికి లైట్ ట్రాప్స్ కూడా వాడొచ్చు.
  • సిఫార్సు చేసినంత మోతాదులోనే నత్రజని వాడాలి.
  • కలుపు మొక్కలు పెరగకుండా చూడాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి